Jump to content

ముంబై

అక్షాంశ రేఖాంశాలు: 19°04′34″N 72°52′39″E / 19.07611°N 72.87750°E / 19.07611; 72.87750
వికీపీడియా నుండి
(ముంబై నగరం నుండి దారిమార్పు చెందింది)
Mumbai
Bombay
Coat of arms of Mumbai
Nickname(s): 
పటం
Interactive Map Outlining Mumbai
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Mumbai" does not exist.
Coordinates: 19°04′34″N 72°52′39″E / 19.07611°N 72.87750°E / 19.07611; 72.87750
Country India
State Maharashtra
DivisionKonkan
DistrictMumbai City
Mumbai Suburban
First settled1507[4]
Named forMumbadevi
Government
 • TypeMunicipal Corporation
 • BodyBrihanmumbai Municipal Corporation
 • MayorVacant[5][6]
 • AdministratorI. S. Chahal, IAS[7]
విస్తీర్ణం
 • Megacity603.4 కి.మీ2 (233.0 చ. మై)
 • Metro4,355 కి.మీ2 (1,681.5 చ. మై)
Elevation
14 మీ (46 అ.)
జనాభా
 (2011)[9]
 • Megacity1,24,78,447
 • Rank1st
 • జనసాంద్రత21,000/కి.మీ2 (54,000/చ. మై.)
 • Metro1,84,14,288
2,07,48,395 (Extended UA)
Demonym(s)Mumbaikar, Bombayite, Mumbaiite[11]
Time zoneUTC+5:30 (IST)
PINs
400 001 to 400 107
ప్రాంతపు కోడ్+91-22
Vehicle registration
  • MH-01 Mumbai(S/C)
  • MH-02 Mumbai(W)
  • MH-03 Mumbai(E)
  • MH-47 Borivali[12]
GDP (PPP)$606.625 billion[13][14]
International airportChhatrapati Shivaji Maharaj International Airport
Rapid TransitMumbai Metro and Mumbai Monorail
Official languageMarathi[15][16]
అధికారిక పేరుElephanta Caves, Chhatrapati Shivaji Terminus, and The Victorian and Art Deco Ensemble of Mumbai
రకంCultural
క్రైటేరియాi, ii, iii, iv
గుర్తించిన తేదీ1987, 2004, 2018 (11th, 28th 42nd sessions)
రిఫరెన్సు సంఖ్య.[1]; [2] [3]
RegionSouthern Asia

ముంబయి (మరాఠీ: मुंबई), పూర్వం దీనిని బొంబే అని పిలిచేవారు. ఇది భారత దేశంలోని ఒక ముఖ్య నగరం. ఇది మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని , భారత దేశంలో ఢిల్లీ తర్వాత రెండవ అత్యంత జన సమ్మర్ధం గల నగరం. అలాగే ప్రపంచంలో జనభా పరంగా ఏడో స్థానంలో ఉంది. దీని ప్రస్తుత జనాభా 13 మిలియన్లు (ఒక కోటి ముప్పై లక్షలు ). ఇది మహారాష్ట్రలోని పశ్చిమ సముద్ర తీరంలోని సాష్టీ ద్వీపంలో ఉంది. ఆధునిక భారతదేశ విభిన్నతను ఈ నగరంలో చూడచ్చు. ఈ నగర సినీ పరిశ్రమ, రాజకీయాలు, నేరస్థులు కలసిపోయి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తుంది అదే సమయంలో ఈ నగర వాసుల సాహసం ఆశ కలిగిస్తుంది.దక్షిణ ఆసియాలో ముంబాయ్ అతి పెద్ద నగరం. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.

పేరు

[మార్చు]

మరాఠీయుల ఆరాధ్యదైవమయిన ముంబా దేవి పేరు మీదుగా ఈ పట్టణానికి ముంబై అనే పేరు వచ్చింది.[17] పాత పేరైనటువంటి 'బాంబే' కు మూలం, 16వ శతాబ్దములో పోర్చుగీసు వారు ఈ నగరానికి వచ్చినపుడు బొంబైమ్ అనే పేరుతో పిలిచేవారు. 17వ శతాబ్దంలో బ్రిటిషువారు దీనిని 'బాంబే' అని పిలిచారు. మహారాష్ట్రీయులు దీనిని 'ముంబై' అని హిందీ ఉర్దూ భాషలవారు 'బంబై' అనే పేర్లతో పిలుస్తారు.[18] కాని మహారాష్ట్రీయులు , గుజరాతీయులు ఇంగ్లీషు భాషలో సంభాషించినపుడు 'బాంబే' అనే పలుకుతారు.[19] 1995 లో అధికారికంగా ఈ నగరానికి "ముంబై" అనే పేరును స్థిరీకరించారు.

పేరు చరిత్ర

[మార్చు]

ముంబై నగరానికి ఈ పేరు మాంబాదేవి అనే హిందూ దేవత పేరు ఆధారంగా వచ్చింది. మహా అంబ అనే పేరు రూపాంతరంచెంది మంబాగా మారింది. ఆయీ అంటే మరాఠీ భాషలో అమ్మ ముంబ, ఆయి కలసి ముంబై అయింది. దీనికి ముందరి పేరు బాంబేకి మూలం పోర్చుగీసువారి బాంబియం. 16వ శతాబ్దంలో ఇక్కడకు ప్రవేశించిన పోర్చుగీసు వారు ఈ నగరాన్ని పలు పేర్లతో పిలిచి చివరకు వ్రాత పూర్వకంగా బాంబియంగా స్థిరపరిచారు. 17వ శతాబ్దంలో ఈ నగరాన్ని స్వాధీన పరచుకున్న ఆంగ్లేయులు ఈ పేరుని కొంత ఆంగ్ల భాషాంతరం చేసి బాంబేగా మార్చారు. మరాఠీలు , గుజరాతీయులు దీనిని మంబాయి, ముంబాయి గానూ హిందీలో దీనిని బంబాయి గాను పిలిచినా ఆంగ్లంలో మాత్రం దీనిని బాంబేగా పిలుస్తారు. 1995 లో దీనిని అధికార పూర్వకంగా మరాఠీల ఉచ్ఛారణ అయిన ముంబైగా మార్చారు.

నగర చరిత్ర

[మార్చు]
గేట్ వే ఆఫ్ ఇండియా
ముంబై హైకోర్టు

ముంబై నగర ఉత్తర భాగంలో కాందివలిలో లభించిన కళాఖండాల ఆధారంగా ఇక్కడ రాతియుగం నుండి నివసించినట్లు విశ్వసిస్తున్నారు. క్రీ.పూ 250 నుండి వ్రాతపూర్వక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని గ్రీకు రచయిత హెప్టెనేషియాగా (గ్రీకు భాషలో:సప్త ద్వీప సమూహం) వ్యవహరించాడు. క్రీ.పూ 3 వ శతాబ్దంలో ఈ సప్త ద్వీపాలు బౌద్ధ మత అవలంబీకుడైన మౌర్యచక్రవర్తి అశోకుని సామ్రాజ్యంలో భాగంగా మారాయి. మొదటి కొన్ని శతాబ్ధాల వరకు ఈ ద్వీపాలపై ఆధిపత్యంలో ఇండో సితియన్ స్ట్రాప్స్ , శాతవాహనుల మధ్య వివాదాలు ఉన్నాయి. తరువాతి కాలంలో ఈ ద్వీపాలు సిల్హరా సామ్రాజ్యంలో భాగమైనాయి. 1343 వరకూ ఈ ద్వీపాలు గుజరాత్ లో కలిసే వరకూ సిల్హరా పాలనలోనే ఉన్నాయి. కొన్ని పురాతన నిర్మాణాలున్న ఎలెఫెంటా గృహలు, వాకేశ్వర్ గుడుల సమూహం ఇక్కడ ఉన్నాయి.
1534 లో ఈ ద్వీపాలు బహదూర్ షాహ్ ఆఫ్ గుజరాత్ నుండి పోర్చుగీస్ ఆధీనంలోకి వచ్చాయి. 1661లో ఈ ద్వీపాలు ఇంగ్లాండుకు చెందిన రెండవ చార్లెస్‌కు కేథరిన్ డీ బ్రగాంజాను వివాహమాడిన సందర్భంలో వరకట్నముగా లభించాయి. 1963లో ఈ ద్వీపాలు ఈస్టిండియా కంపనీకు 10 పౌండ్ల సంవత్సర లీజు కింద ఇవ్వబడ్డాయి. వారు ఈ ద్వీపాల తూర్పు తీరంలో భారత ద్వీపకల్పంపంలోని తమ మొదటి రేవుని నిర్మించారు. 1661లో 10,000 జనాభా ఉన్న ఈ ప్రాంతం జనాభా 1675 , 1687 నాటికి 60,000 జనాభాగా త్వరితగతిని అభివృద్ధి చెందింది.ది బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ తన ప్రధాన కార్యాలయాన్ని సూరత్ నుండి బాంబేకు మార్చింది. ఎట్టకేలకు ముంబై నగరం బాంబే ప్రెసిడెన్సీకు ప్రధాన నగరంగా మారింది. 1817 నుండి బృహత్తర నిర్మాణ ప్రణాళికల ద్వారా అన్ని ద్వీపాలను అనుసంధానించాలని తలపెట్టారు.1845 నాటికి హార్న్‌బై వల్లర్డ్ పేరుతో నిర్మాణకార్యక్రమాలు పూర్తి అయ్యాయి. దీని ఫలితంగా మొత్తం ద్వీపాలు 438 చదరపు కిలోమీటర్ల ప్రదేశానికి విస్తరించాయి. 1853లో మొదటి రైలు మార్గాన్ని బాంబే నుండి థానే వరకు నిర్మించారు. అమెరికన్ సివిల్ వార్ (1861-1865) కాలంలో ముంబై నగరం నూలు వస్త్రాల వ్యాపార కేంద్రంగా మారింది. ఫలితంగా నగర ఆర్థిక పరిస్థితులలో పెను మార్పు సంభవించింది. ఆ కారణంగా నగర రూపురేఖలలో విశేష మార్పులు వచ్చాయి.
1955లో బాంబే రాష్ట్రం భాషాపరంగా మహారాష్ట్రా , గుజరాత్‌లుగా విభజింప బడిన తరువాత ఈ నగరం స్వయంపాలిత ప్రాంతంగా మార్చాలన్న ఆలోచనని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రీయులు బాంబే ముఖ్యపట్టణంగా మహారాష్ట్రా రాష్ట్రం కావాలని కోరుతూ సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం లేవదీయడంతో, పోలీసు కాల్పుల్లో 105 మంది మరణంతో ఉద్యమం విజయవంతంగా ముగిసింది. మహారాష్ట్రా రాష్ట్రం బాంబే ముఖ్యపట్టణంగా వెలిసింది.
1970 తరువాత నిర్మాణ కార్యక్రమాలు త్వరిత గతిని అభివృద్ధి చెందటం, వలస ప్రజల స్థిర నివాసం కారణంగా జనసంఖ్యలో బాంబే కలకత్తాను అధిగమించింది. వలస ప్రజల ప్రవాహం ముంచెత్తడం మహారాష్ట్రీయులను కొంత అశాంతికి గురి చేసింది. వారి నాగరికత, భాష , ఉపాధి పరంగా జరిగే నష్టాలను ఊహించి ఆందోళన పడసాగారు. ఈ కారణంగా బాలాసాహెబ్ థాకరే నాయకత్వంలో మాహారాష్ట్రీయుల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యాంశంగా శివసేనా పార్టీ ప్రారంభం అయింది. 1992-1993లో నగర సర్వమత సౌజన్యం చీలికలైంది. దౌర్జన్యాలు విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల కారణంగా మారాయి. కొన్ని నెలల తరువాతి కాలంలో మార్చి 12 వ తారీఖున ముంబాయి మాఫియా ముఠాల ఆధ్వర్యంలో ప్రధాన ప్రదేశాలలో బాంబు పేలుళ్ళు సంభవించాయి. ఈ సంఘటనలో 300 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. 1995లో శివసేనా ప్రభుత్వ పాలనలో ఈ నగరం పేరు పురాతన నామమైన మూంబైగా మార్చబడింది. 2006లో ముంబై మరో తీవ్రవాద దాడికి గురైంది ఈ సంఘటన 200 ప్రాణాలను బలితీసుకుంది. ఈ దాడి ముంబై నగర రైల్వే పైన జరిగింది.

భౌగోళికం

[మార్చు]

ముంబై భారతదేశపు పడమటిభాగంలో అరేబియన్ సముద్ర తీరంలో ఉల్హానదీ ముఖద్వారంలో ఉంది.మహారాష్ట్రా రాష్టృఆనికి చెందిన సాష్టా ద్వీపంలో ముంబై నగరం అధిక భాగాన్ని ఆక్రమించుకుని విస్తరించి ఉంది.ఇది కాక ఈ ద్వీపంలో ఠాణే జిల్లాలోకొంతభాగం కూడా ఉంది.ముంబై నగర అధిక భూభాగం సముద్ర మట్టానికి స్వల్ప ఎత్తులో మాత్రమే ఊంటుంది.నగరమంతా సముద్ర మట్టానికి 10 నుండి 15 మీటర్ల ఎత్తుల మధ్య ఉంటుంది. ఉత్తర ముంబై నగరం కొడ ప్రాంతాలతో నిండి ఉంటుంది.నగరంలోకెల్లా ఎత్తైన ప్రదేశం ఎత్తు 450 మీటర్లు.నగరం విస్తీర్ణం 603 కిలోమీటర్లు.

ముంబై నగరంలో సంజయ్ గాంధి నేషనల్ పార్క్ మాత్రం నగరంలోని ఆరవభాగం భూభాగంలో విస్తరించి ఉంది.ఇక్కడ ఇప్పుడు కూడా చిరుతపులులు ఉన్నట్లు గుర్తించబడింది.

ముంబై వాసుల మంచినీటీ అవసరాలు తీర్చడానికి భాత్సా కాకుండా ఆరు సరసులు ఉన్నాయి.అవి వరసగా విహార్, వైతర్ణా, ఉప్పర్ వైతర్ణా, తుసి, తాన్సా , పొవాయ్.త్ల్సి, విహార్ సరసులు బొరివిలి నేషనల్ పార్క్‌లో నగర సరిహద్దులో ఉన్నాయి.నగర సరిహద్దులో ఉన్న పొవాయ్ నీటిని పరిశ్రమలకు సరఫరా చేస్తారు.దహిసర్, పొఇన్‌సర్ , ఒహివారా అనే మూడు నదులు ఉన్నాయి.తుల్సి నుండి ప్రవహించే మిథి నది విహారు , పొవాయ్ సరసులు పొంగి పొరలుతున్నపుడు వచ్చేనీటిని చేర్చుకుని ప్రవహిస్తుంది.పడమటి సముద్ర తీరం సెలఏర్లు నీటిమడుగులు ఉన్నాయి.పడమటి సముద్ర తీరం ఇసుక , రాళ్ళతో నిండి ఉంటుంది.

వాతావరణం

[మార్చు]

ముంబై నగరం భూమధ్యరేఖకు సమీప ప్రాంతం , సముద్రతీర ప్రాంతం అయినందున ఇక్కడి వాతావరణం రెండు ప్రత్యేక మార్పులకు గురౌతుంది.గాలిలో తేమ అధికంగా ఉండే జీజన్ , పొడిగాలులు వీచే సీజన్ ముంబైలో సహజంగా ఉంటుంది.తడిగాలులు మార్చి , అక్టోబరు మధ్యకాలంలోనూ పొడిగాలులు జూన్ , సెప్టెంబరు మధ్యకాలంలో అధికం.జూన్ , సెప్టెంబరు మాసాల మధ్యకాలంలో వీచే నైరుతి ఋతుపవనాలు నగరానికి నీటి అవసరాన్ని చాలావరకు భర్తీ చేస్తుంది.నగరంలోని వార్షిక వర్షపాతం 2,200 మిల్లీమీటర్లు ఉంటుంది.1954లో నమోదైన 3,452 మిల్లీలీటర్ల వర్షపాతం నగరంలో నమోదైన అత్యధిక వర్షపాతం.ఒక రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం 944 మిల్లీలీటర్లు.పోడి గాలులు వీచే నవంబరు , ఫిబ్రవరి మధ్యకాలం మితమైన తడితో చేరిన వెచ్చదనంతో కూడిన చలిగాలులు కలిగిన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది.ఉత్తరదిశ నుండి వీచే చలిగాలులు జనవరి , ఫిబ్రవరి మాసాల మధ్యకాలంలో కొంచంగా చలిని పుట్టించడానికి కారణమౌతాయి.సంవత్సర అత్యధిక ఉష్ణోగ్రత 38డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యల్ప ఉష్ణోగ్రత 11డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది.

జనాభా

[మార్చు]

2001 జనాభా లెక్కల ననుసరించి ముంబై జనాభా 1,30,00,000. నగరపురాలలో నివసిస్థున్న ప్రజలను చేర్చుకుంటే ఈ సంఖ్య 1,60,00,000.5 ముంబై నగర పురపాలక వ్యవస్థకి చెందిన వెలుపలి ప్రదేశాలలో 10,04,000 ప్రజలు నివసిస్థున్నట్లు అంచనా. 2008 లో జనసంఖ్య 1,36,62,885. పురపాలక వ్యవస్థకు చెందిన వెలుపలి ప్రాంతాల జనాభా 2,08,70,764. జన సాంద్రత ఒక చదరపు కిలో మీటర్‌కి 22,000. అక్షరాస్యత శాతం 86%, ఇది దేశ సరాసరి కంటే అధికం. ప్రతి 1000 మంది రురుషులకు 875 మంది స్త్రీలు. ఇది దేశ సరాసరి కంటే కొంచం తక్కువ. ముంబై జనాభాలో హిందువులు 68%, ముస్లిములు 17%, క్రిస్తియన్లు 4%, జైనులు 4%. మిగిలిన వారు పారశీకులు, బౌద్ధ మతస్థులు, యూదులు , అథియిస్టులు.
1991 జనాభా లెక్కల మహారాష్ట్రియన్లు 42%, గుజరాతియన్లు18%, ఉత్తర భారతీయులు21%, తమిళులు 3%, సింధీలు 3%, కన్నడిగులు 5% , ఇతరులు. మిగిలిన పెద్ద నగరాలకంటే ముంబైలో అధిక భాషలను మాట్లాడకలిగిన ప్రజలు అధికం. మహారాష్ట్రా రాష్ట్రానికి అధికారభాష మరాఠీ. మరాఠీ రాష్ట్రంలో అధికసంఖ్యాకులు మాట్లాడే భాష. ఇతరభాషలు హిందీ, ఆంగ్లము (ఇంగ్లీషు) , ఉర్దూ. ఇక్కడి వారు మాట్లాడే హిందీని బాంబియా హిందీగా వ్యవహరిస్తారు. మరాఠీ, హిందీ , భారతీయ ఆంగ్లము ఇవి కాక మరికొన్ని ప్రాంతీయ భాషల కలగలుపుగా ఇక్కడి హిందీ ఉంటుంది. ఇక్కడి ప్రజలు అధికంగా ఆంగ్లంలోనే మాట్లాడుతుంటారు. వైట్ కాలర్ జాబ్ అనబడే కార్యాలయ ఉద్యోగులు ఆంగ్లభాషను ఎక్కువగా మాట్లాడుతుంటారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాధారణంగా ఎదుర్కొనే సమస్య నగారాలు వాటి పరిసరాలలో పెరిగే జనసంఖ్య. అన్ని ననగరాల మాదిరిగా ముంబాయి కూడా నగరపరిసరాలలో విపరీతంగా పెరుగుతున్న జనాభాతో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ కారణంగా నిరుద్యోగం, అనారోగ్యం, పేదరికం లాంటి సమస్యలు నగరానికి పరిష్కరించవలసిన ప్రధాన సమస్యలు. పెరుగుతున్న జనాభా కారణంగా నివాసగృహాలు కొరత వలన ప్రజలు ఇరుకైన గృహాలలో నివసించవలసి వస్తుంది. నివాసాలకు చెల్లించ వలసిన బాడుగలు ఎక్కువే. నివాస ప్రదేశానికి పనిచేసే ప్రదేశానికి దూరాలూ ఎక్కువే. ఈ కారణంగా ప్రయాణ వసతులు పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడం కొంత కష్ణమవుతున్నది. సిటీ బస్సులు, లోకల్ ట్రైన్లలో జన సమర్ధం ఎక్కువైనప్పటికి, చక్కగా కాల ప్రమాణాలను అనుసరించటంవల్ల ప్రజలకు ఎంతగానో సౌకర్యవంతముగా ఉన్నాయి. 2001లో జనాభా లెక్కలననుసరించి నగరంలోని 54% ప్రజలు మురికివాడలలో (స్లమ్స్) అతితక్కువ సౌకర్యాలు కలిగిన నివాసాలలో నివసిస్తున్నట్లు అంచనా. 2004లో ముంబై 27,577 నేరాలను నమోదు చేసింది. 2001 లో నమోదు చేసిన 30,991 నేరాలకంటే 11% తగ్గిన మాట వాస్తవం. ఇతర రాష్ట్రాలనుండి 1991-2001 మధ్య ఇక్కడకు వలస వచ్చిన ప్రజలసంఖ్య 11.2కోట్లు.[ఆధారం చూపాలి] ఇది ముంబై జనసంఖ్యను54%పెంచింది.[ఆధారం చూపాలి]

పట్టణ పరిపాలన

[మార్చు]

ముంబై నగరాన్ని రెండు ప్రత్యేకవిభాగాలుగా విభజిస్తారు.ఒకటి ముంబైనగర ద్వీపం (ఐలాండ్ సిటీ) రెండు నగరపరిసరాలు.నగరనర్వహణ బృహన్ముంబై మునిచిపల్ కార్పొరేషన్ (బిఎమ్‌సి) అధ్వర్యంలో జరుగుతుంది.దీనిని పూర్వం బాంబే మునిసిపల్ కార్పొరేషన్ అని అంటారు.మున్సిపల్ కమీషనర్నగర ప్రధాన అధికారి.ఈ పదవికి ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.24 నియోజకవర్గాల నుండి 227 కౌన్సిలర్లను నగర పాలన నిమిత్తం ప్రజలు నేరుగా 24 వార్డుల నుండి ఓటు వేసి ఎన్నుకుంటారు.వీరుకాక ప్రతిపాదించబడిన అయిదుగురు కౌన్సిలర్లు ఒక మేయరు ఉంటారు.మేయరు మర్యాదపూర్వక అధికారి.పాలనాధికారాలు మున్సిపల్ కమీషనర్ ప్దవికి వర్తిస్తాయి.మహానగర ముఖ్యావసరాలు తీర్చవలసిన బాధ్యత బిఎమ్‌సి వహిస్తుంది.సహాయక కమీషనర్ ప్రతి ఒక్క వార్డు పాలనా వ్యవహారాలు పర్యవేక్షిస్తుంటారు.ఈ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలన్నీ పాలుపంచుకుంటాయి.ది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో అంతర్భాగంగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు,13 మున్సిపల్ కౌన్సిల్స్ ఉంటాయి.గ్రేటర్ ముంబైలో అంతర్భాగంగా రెండు జిల్లాలు ఉన్నాయి.జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆస్తివివరాలు, ఆదాయ వ్యయాలు , జాతీయ ఎన్నికల నిర్వహణా బాధ్యతలు నడుస్తుంటాయి.

ఐపిఎస్ ఆఫీసరైన పోలిస్ కమీషనర్ ఆధ్వర్యంలో ముంబై పోలిస్ తనబాధ్యతలు నెరవేరుస్తుంటుంది.రక్షకదళం హోమ్‌మంత్రిత్వ శాఖ అధికారంలో పనిచేస్తుంది. ముంబై నగరం ఏడు పోలీస్ విభాగాలుగానూ, ఏడు ట్రాఫిక్ పోలిస్ విభాగాలుగానూ విభజించారు.ట్రాఫిక్ పోలిస్ వ్యవస్థ పోలి వ్యవస్థ అధ్వర్యంలోనే ఉన్నా కొంతభాగం స్వతంత్రంగానే వ్యవహరించే వీలుకలిగి ఉంటుంది.నలుగురు సహాయక అగ్నిమాపక దళ అధికారులు, ఆరుగురు విభాగాల అధికారుల సహాయంతో ఉన్నత అగ్నిమాపక అధికారి అధ్వర్యంలో నగరంలోని అగ్నిమాపకదళం ముంబై ఫైర్ బ్రిగేడ్ పనిచేస్తుంది.

మహారాష్ట్ర, గోవా , యూనియన్ ప్రదేశాలైన డామన్, డయ్యూ, దాద్రా, నగర్ హవేలీల న్యాయ వ్యవహారాలు చక్కదిద్దే బాంబే హైకోర్ట్ నగరంలోపల ఉండి న్యాయ సేవలందిస్తుంది.ఇవి కాక రెండు క్రింది కోర్టులు ఉన్నాయి.ఒకటి సాధారణ వ్యవహారాలకుస్మాల్ కాజెస్ కోర్ట్ ఒకటి నేరసంబంధిత వ్యవహారలను చక్కదిద్దే సెషన్స్ కోర్ట్ ఉన్నాయి.తీవ్రవాద సమస్యల నిమిత్తం ప్రత్యేక కోర్ట్ ఉంది దానిని టిడిఎ అంటారు.నగరం నాలుగు పార్లమెంట్ నియోజక వర్గాలుగానూ, ముప్పై నాలుగు విధాన సభ నియోజక వర్గాలుగా విభజించబడింది.

విద్య

[మార్చు]

నగరంలో మునిసిపల్ పాఠశాలలు లేక ప్రైవేట్ పాఠశాలలు విద్యా సంబంధిత సేవలందిస్తూ ఉన్నాయి.ఈ పాఠశాలలు మహారాష్ట్రా స్టేట్ బోర్డ్, సెంట్రల్ బోర్డ్ ఫర్ సెంకండరీ ఎడ్జ్యుకేషన్ , ది ఆల్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎక్జామినేషన్స్లలో ఏదైనా ఒకదానిలో భాగమై ఉంటాయి.ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం నుండి కొంత నిధులు అదుంతూ ఉంటాయి.ప్రభుత్వ పాఠశాలలు అనేక సదుపాయాలతో పనిచేస్తాయి.ప్రభుత్వ పాఠశాలలలో ఖరీదైన ప్రైవేట్ పాఠశాలలో చదివించలేని వారు తమ పిల్లలను చదివిస్తుంటారు.అధిక శాతం ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలలో చదివించడానికే మొగ్గు చూపుతుంటారు.ప్రైవేట్ పాఠశాలలు చక్కని భవన నిర్మాణ వసతులు కలిగి ఉండటం ఒక కారణం.

విద్యార్థులు 10 సంవత్సరాల చదువు పూర్తిచేసిన తరువాత విద్యార్థులకు జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించడానికి అర్హులౌతారు.రెండు సంవత్సరాల జూనియర్ కళాశాల విద్య్హలో విద్యార్థులు ఆర్ట్స్, కామర్స్ (వాణిజ్యం) , సైన్స్ (విజ్ఞానం) విభాగాలలో ఒకదానిని ఎన్నుకుని విద్యాభ్యాసం కొనసాగిస్తారు.ఇది సాదారణ పట్టా లేక వృత్తి విద్యలను కొనసాగించడానికి సౌలభ్యం కలిగిస్తుంది.అత్యధిక కళాశాలలు ముంబై విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.యూనివర్శిటీ ఆఫ్ ముంబై ప్రపంచంలోతి పెద్దకళాశాలలలో ఒకటి.ఇక్కడ పట్టభద్రులైయ్యేవారి సంఖ్య అత్యధికం.నగరంలో ఉన్న భారత దేశంలో ప్రాముఖ్యత కలిగిన ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లు ముంబై నగర విద్యార్ధులకు సాంకేతిక ఉన్నత విద్యలను అందిస్తున్నాయి.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ,నర్శీ మంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ , వీరమాత జిజియాబాయ్ టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ , ఎస్‌ఎన్‌డిటి మహిళా విశ్వవిద్యాలయం, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఇతర సాంకేతిక విద్యాలయాలు.ఇవి కాక నగరంలో జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్ట్త్యౌత్ అఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, నర్శీ మంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసర్చ్, ఎస్‌పి జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అండ్ రీసేర్చ్ లాటి ఆసియాలో పేరెన్నికగన్న కళాశాలలు ఉన్నాయి.

సమాచార రంగం

[మార్చు]

ముంబై నగరం అనేక వార్తాపత్రికా ప్రచురణ సంసంస్థలకు, దూరదర్శన్ , రేడియో కేంద్రాలకు పుట్టిల్లు.ఇండియన్ ఎక్స్‌ప్రెస్, మిడ్‌డే, డెన్‌ఏ , టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి ప్రముఖ ఆంగ్ల వార్తా దినపత్రికలు ఇక్కడ నుండి ప్రచురించబడి అమ్మబడుతుంటాయి.లోక్ సత్తా, లోక్ మాతా , మహారాష్ట్రా టైమ్స్ లాంటి ప్రాంతీయ పత్రికలు ప్రచురించబడుతున్నాయి.ఇతర భారతీయ భాషలలోనూ అనేక వార్తాపత్రికలు నగరంలో లభ్యమౌతూ ఉన్నాయి.1822 నుండి ప్రచురించబడుతున్న బాంబే సమాచార్ వార్తాపత్రిక ఆసియాలో అతి ప్రాచీన వార్తాపత్రిక అంతస్తును కలిగి ఉంది.1832లో బాలశాస్త్రి జంబేకర్‌చే బాంబే దర్పన్ అనే మొదటి మరాఠీ వార్తా పత్రిక ప్రచురించబడింది.

ముంబై నగవాసులు స్వదేశీ , విదేశీ దూరదర్శన్ ప్రసారాలనేకం చూస్తూంటారు.కేబుల్ కనెక్షన్ ద్వారా దాదాపు నూరుకు పైబడిన చానల్స్ గృహాలకు అందింబడుతున్నాయి. వివిధ మతాలకు , భాషలకు చెందిన ప్రజలకు ఈ ప్రసారాలవలన ప్రయోజనంచేకూరుతుంది. అనేక అంతర్జాతీయ వార్తాసంస్థలు వార్తా ప్రసారాలు , ప్రచురణా సంస్థలకు నగరం ప్రధాన కేంద్రం. జాతీయ దూరదర్శన్ ప్రసారాలద్వారా రెండు ఉచిత ప్రసారాలను ప్రజలకు అందిస్తుంది. మూడు ప్రధాన సంస్థలు అనేక గృహాలకు కేబుళ్ళ ద్వారా ప్రసారాలను అందిస్తున్నాయి. వీటిలో ఈటీవీ మరాఠి, జీ మరాఠి, స్టార్‌స్పోర్ట్స్ , ఇఎస్‌పిఎన్, డిడి మరాఠి, శేషాద్రి, మీ మరాఠి, జీటాకీస్, జీటీవీ, స్టార్‌ప్లస్ , నూతన ప్రసారాలైన స్టార్‌మజా లేక పాపులర్ ప్రజల అభిమానాన్ని సంపాదించిన ప్రసారాలు. పాపులర్ వార్తాప్రసారాలు పూర్తిగా ముంబై , మహారాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రసారమౌతుంటాయి. స్టార్‌మజా, జీ24టాస్ , షహారాసమయ్ పాపులర్ అందించే ముఖ్య ప్రసారాలు. అధిక ఖరీదైన పాపులర్, టాటాస్కై , డిష్ టీవీ ప్రసార కారణంగా ముంబై ఉపగ్రహ ప్రసారాలు శాటిలైట్ టెలివిజన్ ప్రసారాలు ప్రజలంగీకారాన్ని సాధించాయి. పన్నెండు ఆకాశవాణి ప్రసారకేంద్రాలలో నాలుగు కేంద్రాలు ఎఫ్‌ఎమ్ ప్రసారాలందిస్తున్నాయి.ఇవి కాక మూడు ఆకాశవాణి ప్రసారాలు ఏమ్ బ్రాండ్ ప్రసారాలందిస్తున్నాయి.ముంబై నగరంలో కమర్షియల్ రేడియో అందించే వరల్డ్ స్పేస్, సైరస్ , ఎక్స్‌ఎమ్ ప్రసారాలు అందిస్తుంది.2006 యూనియన్ గవర్న్‌మెంట్ చే ప్రారంభించబడిన కండిషనల్ ఏక్సెస్ విధానం దాని అనుబంధ విధానం డీటీహెచ్‌తో పోటీని ఎదుర్కోవడంలో విఫలమైంది.

ఆర్ధికరంగం

[మార్చు]

భారతదేశంలో ముంబై అతి పెద్ద నగరం.దేశం మొత్తంలో పారిశ్రామిక ఉద్యోగాలు 10% ముంబై నగరం నుండి లభిస్తుంది.ఈ నగరంలో ఆదాయపు పన్ను దేశం మొత్తం లభిచించేదానిలో 40%.దేశం మొత్తంలీని కస్టమ్స్ పన్ను 60% ఈ నగరం నుండి లభిస్తుంది.దేశానికి 20% ఎగుమతి పన్ను ముంబై నగరం నుండి లభిస్తుంది.దేశం మొత్తంలో విదేశీ వర్తకం , పారిశ్రామిక పన్ను రూపంలో 40% ముంబైనగరం నుండి లభిస్తుంది.ముంబై నగర తలసరి ఆదాయం 48,954 రూపాయలు.ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే మూడింతలు ఎక్కువ.భారతదేశం అంతా శాఖలు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసి, గోద్రెజ్, రిలయన్స్ లాంటి భారతీయ ఫార్చ్యూన్ 500 కంపెనీలకు చెందిన నాలుగు పరిశ్రమలు ముంబై నుండి తమకార్యకలాపాలు సాగిస్తున్నాయి.విదేశీ బ్యాంకులూ , ఆర్థిక సంస్థలు అనేకం ఈ నగరంలో కార్యాలయాలను స్థాపించాయి.వీటిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్(ముంబై)ప్రధానమైనది.1980 వరకు ముంబైనగర ప్రధాన ఆదాయపు వనరులలో వస్త్రాల తయారీ , సముద్ర రేవు (హార్బర్) లు ప్రధానమైనవి. ప్రజాదాయం ఇంజనీరింగ్, వజ్రలను సానబెట్టడం, హెల్థ్ కేర్ , సమాచార మాధ్యమం.నగరం బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ , దేశంలో ప్రత్యేకత కలిగిన సాంకేతిక పరిశ్రమలు.ఈ కారణంగా నగరంలో అత్యాధునిక భవన సముదాయాలు అభివృద్ధి చెందాయి.విస్తారంగా మానవ వనరులు లభ్యం కావడం ఈ అభివృద్ధికి ఒక కారణం.

నగరంలోని ఉద్యోగులలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అధికం.అత్యధిక నైపుణ్యం కలిగిన వారు మితమైన నపుణ్యం కలిగినవారూ స్వయం ఉపాధి కలింగిఉన్నారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు.వీధి వర్తకులు, టాక్సీ డ్రైవర్లూ, మెకానిక్ , శ్రామిక జీవితంతో తమజీవికకు కావలసిన ద్రవ్యాం సంపాదించే ప్రజలసంఖ్య కూడా నగరంలో అధికమే.ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రేవు , నౌకా పరిశ్రమ ఉద్యోగాలు కల్పిస్తుంది.మధ్య ముంబైలోని ధారవిలో ఉన్న బృహత్తర రీసైక్లింగ్ పరిశ్రమ నగరంలోని ఇతర భాగంలోని వ్యర్ధాల నుండి పలు పరికరాలు తయారు చేయబడతాయి.ఇక్కడ ఒకే గదిలో పనిచేసే లఘు పరిశ్రమలు 15,000 ఉన్నాయి.

ముంబై నగర ప్రధాన ఉపాధి వనరులలో ప్రచార మాధ్యమం ఒకటి.అనేక దూరదర్శన్ , ఉపగ్రహ (శాటిలైట్) నెట్‌వర్క్‌లు, అలాగే ప్రధాన ప్రచురణా సంస్థలు ఇక్కడనుండి ప్రారంభం అయినవే.హిందీ చలన చిత్రాలకు ముంబై ప్రధాన కేంద్రం. చందు

రవాణా వ్యవస్థ

[మార్చు]
ఛత్రపతి శివాజీ టెర్మినస్
చర్చిగేట్ మెట్రో రెయిల్వే స్టేషను
విమానాశ్రయం, ముంబై
బీఎస్‌టి (BEST) బసు
'ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్'

ముంబై ప్రజలు అనేకంగా ప్రభుత్వంచే నడపబడుతున్న రైళ్ళలోనూ, సిటీ బస్సులలో ప్రయాణానికి ఉపయోగించుకుంటారు. 'ముంబై సబర్బన్ రైల్వే'బి ఇ ఎస్ టి బస్సులు, కార్లు, ఆటోరిక్షాలు , ఫెర్రీలు లలో వారు పనిచేసే ప్రదేశాలను చేరుకుంటూ ఉంటారు.
ముంబై నగరం రెండు భారతీయ రైల్వే సంస్థలకు చెందిన ప్రధాన కార్యాలయాలకు కేంద్రం. 'ఛత్రపతి శివాజీ టెర్మినస్'(CR)లో సెంట్రల్ రైల్వేకి చెందిన ప్రధాన కార్యాలయం, 'వెస్ట్రన్ రైల్వే' (WR) ప్రధాన కార్యాలయం చర్చ్‌గేట్ వద్ద ఉన్నాయి. ముంబై సబర్బన్ రైల్‌వే నగరంలో ప్రయాణానికి వెన్నెముక లాంటిది. ఇది మూడు భాగాలుగా విభజింప బడింది.భూమి లోపల , వెలుపల ప్రయాణం చేసే 'ముంబై మెట్రో రైల్ మార్గం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇది వెర్సోవా నుండి అంధేరీ మీదుగా ఘాట్‌కోపర్ వరకు ప్రయాణీకులను తీసుకొని వెళుతుంది. 2009లో దీనిలో కొంత భాగం పనులు పూర్తికాగానే మిగిలిన భారతీయ భూభాగంతో ఇండియా రైల్వే ద్వారా ముంబై చక్కగా అనుసంధించబడుతుంది. శివాజీ టెర్మినస్, దాదర్, లోకమాన్య టెర్మినస్ (కుర్లా), ముంబై టెర్మినస్ , బాంద్రా టెర్మినస్ నుండి రైళ్ళ రాకపోకలు ఉంటాయి. 'సబర్బన్ రైల్వే' రైళ్ళలో ఒక సంవత్సరానికి 2.20 కోట్ల ప్రాయాణీకులను తమ గమ్యాలకు చేరవేస్తున్నట్లు అంచనా. బస్సు ప్రయాణాలతో పోల్చి చూస్తే ట్రైన్ చార్జీలు కొంత తక్కువ. ఈ కారణంగా ప్రజలు దూర ప్రయాణాలకు రైళ్ళలో ప్రయాణించడానికి ప్రాముఖ్యత ఇస్తారు. ముంబై ప్రభుత్వం బియిఎస్‌టి(BEST)పేరుతో నగరం లోపల బస్సులను నడుపుతుంది. ఈ బస్సు మార్గాలు నగరమంతటినీ కలుపుతూ నగరంలో ఏప్రాతానికైనా చేరుకునేలా ఉంటాయి. ఈ మార్గాలు నేవీ ముంబై నుండి తానే వరకు విస్తరించి ఉన్నాయి. ది బి.యి.ఎస్‌.టి.(BEST) 3,400 బస్సులను నడుపుతుంది. నగర ప్రజలు తక్కువ, మధ్య రకం ప్రయాణాలకు వీటిని ఉపయోగించుకుంటారు. ఫెర్రీ (బోట్) లలో 45% ప్రజలు ప్రయాణిస్తారనీంచనా. ఫెర్రీలలో సాదారణ ఫెర్రీలే కాక రెండస్థుల ఫెర్రీలు నడపడం ప్రత్యేకత. 340 జలమార్గాలలో ఫెర్రీలు ప్రజలను అటూ ఇటూ చేరవేస్తుంటాయి. మహారాష్ట్రలోని ప్రధాన నగరాలను కలుపుతూ ఎయిర్ కండిషన్ బస్సులను ఎమ్‌ఎస్‌ర్‌టిసి (MSRTC) పేరుతో నడుపుతుంటారు. ఈ సర్వీసులు నగరం లోపలి భాగాలలో కూడా ఉంటాయి. ఇక్కడికి సందర్శనార్ధం వచ్చే ప్రయాణీకులకోసం 'ముంబై దర్శన్' పేరుతో బస్సులను నడుపుతుంటారు. వీటి సాయంతో అనేక ముంబై పర్యాటక ఆకర్షణ ప్రదేశాలను దర్శించ వచ్చు.

నలుపు, పసుపు రంగులతో మీటర్ల సహాయంతో నడిచే కార్ల బాడుగ వసూలు చెసుకొని ప్రయాణీకులను చేరవేస్తూ ఉంటాయి. నగరపురాలలో ఆటోరిక్షాలు అధికంగా ఉంటాయి. గ్యాస్ సిలిండర్ల సాయంతో నడిపే రిక్షాలు బాడుగకు నడుపుతుంటారు. ఇవి బడుగు వర్గాలకు అందుబాటులో ఉండే చౌకైన వాహనాలు.వీటిలో ముగ్గురు ప్రయాణం చేయవచ్చు. మొదట 'షహర్ ఎయిర్‌పోర్ట్' గానూ ప్రస్తుతం 'ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్' గాను వ్యవహరిస్తున్న విమానాశ్రయం దే భారత దేశంలో ఎక్కువమంది ప్రయాణం చేసే విమానాశ్రయాలలో ఒకటి. 'జుహూ ఎయిరోడ్రోమ్' భారత దేశంలో మొదటి విమానాశ్రయం.దీనిలో ఇప్పుడు ఫ్లైయింగ్ క్లబ్, హెలీ ఎయిర్ కార్యాలయాలు కూడా పనిచేస్తున్నాయి.కోప్రా-పాన్‌వెల్ లో'అంతర్జాతీయ నావికాదళ విమానాశ్రయం'నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.ఇది పనిచేయడం ఆరంభమైతే 'ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్' లో ప్రస్తుతం ఉన్న ప్రయాణీకుల రద్దీ కొంత తగ్గించవచ్చని ఆలోచన.భారథదేశంలో 25% దేశంలోపల ప్రాణించే ప్రయాణీకులు '38% అంర్జాతీయ ప్రయాణీకులు ముంబై నుండి ప్రయాణిస్తారని అంచనా.

ప్రజలు సంస్కృతి

[మార్చు]

ముంబైలో నివసించే పౌరులను ముంబైకార్, ముంబైవాలా అని వ్యవహరిస్తుంటారు. ప్రయాణ సౌకర్యంకోసం పనిచేసే ప్రదేశాన్ని సులువుగా చేరడం కోసమూ ప్రజలు ఎక్కువగా రైల్వే స్టేషను సమీపంలో నివసిస్తుంటారు. ఇక్కడి ప్రజల సమయం ఎక్కువ భాగం ప్రయాణాలకే వెచ్చించవలసి రావడం దీనికి కారణం. ముంబై వాసుల ఆహారవిధానంపై ఎక్కువగా మరాఠీ, గుజరాతీ ప్రభావం ఉంటుంది. ఎక్కువ పౌష్ఠికంగా ఉంటాయి మసాలాలు కొంచం తక్కువ. ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించే అల్పాహారాలు కచోడీ, భేల్పూరి, పానీపూరీ, మీన్వాలా కర్రీ (చేపల కూర) బాంబే మసాలా బాతు. బజారులలో చిన్న చిన్న దుకాణాలలో వడా పావ్, పావ్ భాజీ, భేల్‌పూరీ అమ్మకాలు జరుగుతుంటాయి.
భారతీయ చిత్రసీమకు ముంబై పుట్టిల్లు. దాదాసాహెబ్ ఫాల్కే తన మొదటి దశ మూకీ చిత్రాలతో చిత్రనిర్మాణం ప్రారంభించి తరువాతి దశలో మరాఠీ భాషలో చిత్రాలు తీసాడు. 20వ శతాబ్ధపు ప్రారంభంలో ముంబై దియేటర్లో మొదటి చలన చిత్రం ప్రదర్శించ బడింది. ముంబై నగరంలో అధిక సంఖ్యలో చిత్రాలు నిర్మిస్తుంటారుం. అంతర్ఝాతీయ ప్రసిద్ధి పొందిన ఐమాక్స్ దియేటర్లు ఇక్కడ ఉన్నాయి. వీటిలో ఎక్కువగా హిందీ, మరాఠీ , హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. అధిక సంఖ్యలో ప్రజలు దియేటర్లలో చిత్రాలను చూడటానికి ఆసక్తి కనబరచడం విశేషం. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ , అనేక ప్రాంతీయ భాషలలో చిత్రాలను ప్రదర్శిస్తుంటారు.
సమకాలీన కళాప్రదర్శనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇవి ప్రభుత్వప్రదర్శనశాలలే కాక వ్యాపార ప్రదర్శనశాలలలో ప్రదర్శిస్తుంటారు. 1883లో నిర్మించిన ప్రభుత్వానికి స్వంతమైన 'జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ' , 'నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రెన్ ఆర్ట్'లు ఉన్నాయి . ఏషియాటిక్ 'సొసైటీ ఆఫ్ బాంబే'ముంబై నగర పురాతన గ్రంథాలయం.'ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయ(వస్తు ప్రదర్శన శాల)' పునరుద్ధరింపబడిన మ్యూజియం దక్షిణ ముంబై మధ్యభాగంలో గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఉంది.ఇక్కడ భారతీయ చారిత్రాత్మక వస్తువులను ప్రదర్శిస్తుంటారు. జిజియా మాతా ఉద్యాన్ అనే జంతు ప్రదర్శనశాల ఉంది.

ప్రజావసరాలు సేవలు

[మార్చు]

దస్త్రం ముంబై అపార్ట్‌మెంట్లు ముంబై నగరానికి మంచినీటి సరఫరాను బిఎమ్‌సి అందిస్తుంది.అధికంగా తులసి విహార్ సరస్సులు ఈ నీటిని అందిస్తున్నాయి అలాగే ఉత్తరభాగంలో ఉన్న ఇతర సరసులు కొన్నిటి నుండి ఈ నీటిని అందిస్తారు.ఈ నీటిని ఆసియాలోని అతిపెద్ద ఫిల్టరేషన్ ప్లాంట్ అయిన భాండప్ దగ్గర శుభ్రపరపరుస్తారు.

ఆకాశసౌధాలు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The Seven Islands". The Mumbai Pages. 16 July 1995. Archived from the original on 26 October 2012. Retrieved 27 October 2012.
  2. "Indian Cities and Their Nicknames – Complete List". 22 July 2015.
  3. "Mumbai is truly maximum city". The Economic Times. Retrieved 2023-04-15.
  4. "Mumbai Settlement". Britannia.
  5. "Administrator to run BMC, first time in 40 years". The Times of India.[permanent dead link]
  6. "BMC to be Run by Administrator Sans Mayor After 4 Decades". News18. Retrieved 8 March 2022.
  7. "Iqbal Chahal appointed as BMC administrator as elections delayed". The Free Press Journal. Retrieved 8 March 2022.
  8. "Mumbai metropolitan area". Projectsecoa.eu. Archived from the original on 13 May 2013. Retrieved 14 March 2013.
  9. "Maharashtra (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". Archived from the original on 6 October 2014.
  10. "INDIA STATS : Million plus cities in India as per Census 2011". Press Information Bureau, Mumbai. National Informatics Centre. Archived from the original on 30 June 2015. Retrieved 20 August 2015.
  11. Neela Dabir, Naina Athale (7 June 2011). From Street to Hope. Sage Publications Private Limited, Mathura Road, New Delhi. p. 76. ISBN 9788132107651.
  12. "Maharashtra Government-Know Your RTO" (PDF). Retrieved 21 October 2019.
  13. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; gdp అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  14. National Commissioner Linguistic Minorities 50th report, page 131 Archived 8 జూలై 2016 at the Wayback Machine. Government of India. Retrieved 15 July 2015.
  15. "Evolution of the Corporation, Historical Milestones". Mumbai: Municipal Corporation of Greater Mumbai. Archived from the original on 15 July 2015. Retrieved 15 July 2015.
  16. Sheppard, Samuel T (1917). Bombay Place-Names and Street-Names:An excursion into the by-ways of the history of Bombay City. Bombay, India: The Times Press. pp. 104–105. ASIN B0006FF5YU.
  17. Sujata Patel & Jim Masselos, ed. (2003). "Bombay and Mumbai: Identities, Politics and Populism". Bombay and Mumbai. The City in Transition. Delhi, India: The Oxford University Press. p. 4. ISBN 0195677110.
  18. Mehta, Suketu (2004). Maximum City: Bombay Lost and Found. Delhi, India: Penguin. pp. 130. ISBN 0144001594.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ముంబై&oldid=4387633" నుండి వెలికితీశారు