Jump to content

మందుముల నరసింగరావు

వికీపీడియా నుండి
(ముందుముల నరసింగరావు నుండి దారిమార్పు చెందింది)
మందుముల నరసింగరావు
మందుముల నరసింగరావు

నియోజకవర్గం కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం (1952-57)

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 17, 1896
చేవెళ్ళ
మరణం May12, 1976
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం 7
నివాసం తలకొండపల్లి

మందుముల నరసింగరావు (మార్చి 17, 1896 - May 12, 1976) నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు.[1]

జననం

[మార్చు]

పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు మార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నరసింగరావు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. పర్షియన్ భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు, పత్రికా రచయితగా పేరుపొందాడు. 1921లో ఆంధ్రజనసంఘాన్ని స్థాపించిన వారిలో ఒకడు. 1927లో న్యాయవాదవృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకియాలుచేపట్టారు. 1927లో రయ్యత్ అనే ఉర్దూ వార్తాపత్రిక స్థాపించి సంపాదక బాధ్యతలు చేపట్టాడు[2]. మందుముల సమరరంగంలో కూడా కీలకపాత్ర వహించి 1937లో ఇందూరు (నిజామాబాదు) లో జరిగిన 6వ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు.[3] 1938-42 కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నాడు. 1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యాడు. ఇవేకాక బాల్యవివాహాల రద్దుకు, వితంతు వివాహాలకు బాగా కృషిచేశాడు. 1952లో కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశాడు. నిజాం కాలంలోని దుష్పరిపాలనను వర్ణిస్తూ "50 సంవత్సరాల హైదరాబాదు" గ్రంథాన్ని స్వీయజీవిత చరిత్రగా రచించాడు.

మరణం

[మార్చు]

[may 12], 1976 న మందుముల మరణించాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Nava Telangana (25 December 2021). "చేవెళ్లలో జన్మించిన హైదరాబాదు జాతీయోద్యమ కిరణమే మందుముల | సోపతి | www.NavaTelangana.com". Archived from the original on 27 డిసెంబరు 2021. Retrieved 27 December 2021.
  2. పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర, రచన ఆచార్య ఎస్వీ రామారావు, పేజీ 151
  3. చరితార్థులు మన తెలుగు పెద్దలు, రచన మల్లాది కృష్ణానంద్, పేజీ 241