కంది శ్రీనివాసరావు
స్వరూపం
కంది శ్రీనివాసరావు | |||
వ్యక్తిగత వివరాలు
|
---|
కంది శ్రీనివాసరావు మెదక్ జిల్లాకు చెందిన నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. ఇతను హుస్నాబాదు గ్రామంలో జన్మించగా ఐదేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు కంది గ్రామానికి చెందిన దేశ్‌ముఖ్ దత్తత తీసుకున్నారు.[1] న్యాయవాద విద్య అభ్యసించిన శ్రీనివాసరావు కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. 1947లో హైదరాబాదు సంస్థానపు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. హైదరాబాదు సంస్థానం విమోచన అనంతరం విడుదలైనారు. 1952లో తొలి లోక్‌సభ ఎన్నికలలో మెదక్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. తర్వాత రాజకీయాలకు దూరమైనారు.
మూలాలు
[మార్చు]- ↑ మెదక్ జిల్లా స్వాతంత్ర్యోద్యమం - సమరయోధులు, రచన: ముబార్కపురం వీరయ్య, పేజీ 70