మీర్ అహ్మద్ అలీఖాన్
మీర్ అహ్మద్ అలీఖాన్ | |||
శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1952 – 1967 | |||
ముందు | అబ్దుల్ రహమాన్ | ||
---|---|---|---|
తరువాత | సరోజినీ పుల్లారెడ్డి | ||
నియోజకవర్గం | మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1905 Missing required parameter 1=month! ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేస్ |
నవాబ్ మీర్ అహ్మద్ అలీఖాన్, హైదారాబాదుకు చెందిన భారత జాతీయ కాంగ్రేసు రాజకీయనాయకుడు. నిజాం నవాబులకు సంబంధిత రాజవంశీకుడు. మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగానూ, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో హోం శాఖామంత్రిగా పనిచేశాడు.
మీర్ అహ్మద్ అలీఖాన్, 1905లో హైదరాబాదులో జన్మించాడు. అహ్మద్ అలీఖాన్ జాతీయవాది మరియు మానవతావాది. మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ప్రభావితుడై పాఠశాల రోజుల నుండి ఖాదీ దుస్తులు ధరించేవాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తొలి బ్యాచ్ విద్యార్ధిగా ఎం.ఏ. ఎల్.ఎల్.బి పట్టభద్రుడయ్యాడు. ఉస్మానియాలో చదివే రోజుల్లో విద్యార్ధి సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికై చారిత్రత్మకమైన ప్రసంగాన్ని ఇచ్చాడు. తన ప్రసంగంలో తొలిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వం రావాలని, విశాలాంధ్ర సాకారం కావాలని చెప్పాడు.[1]
మీర్ అహ్మద్ అలీఖాన్, తొలిసారి 1952లో హైదరాబాద్ సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రేసు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయాడు. 1957లో మలక్‌పేట నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రేసు అభ్యర్ధిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 1962లో తిరిగి అదే స్థానం నుండి శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. 1967లో జరిగిన ఎన్నికలలో కాంగ్రేసు అసమ్మతీయ వర్గీకుడిగా చార్మినార్ నియోజకవర్గం నుండి పోటీ చేసి మజ్లిస్ పార్టీ అభ్యర్ధి, సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయాడు. అసమ్మతి నాయకుని ఓటమిలో అధికారిక కాంగ్రేసు హస్తం ఉన్నదని భావించారు.[2]
1977 ఎన్నికలలో భారతీయ లోక్‌దళ్ పార్టీ అభ్యర్ధిగా హైదరాబాదు నియోజకవర్గం నుండి లోక్‌సభకు పోటీ చేసి, కె.ఎస్.నారాయణ, సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ A.P. Year Book. Hyderabad Publications & Newspapers. 1979. p. 371. Retrieved 14 July 2024.
- ↑ Acharya, K.R. (1979). The Critical Elections. p. 26. Retrieved 14 July 2024.
- ↑ "General Election of India 1977, 6th Lok Sabha" (PDF). Election Commission of India. p. 126. Archived from the original (PDF) on 18 జూలై 2014. Retrieved 21 జూలై 2024.