Jump to content

మిస్సమ్మ (2003 సినిమా)

వికీపీడియా నుండి
మిస్సమ్మ
దర్శకత్వంనీలకంఠ
స్క్రీన్ ప్లేనీలకంఠ
కథనీలకంఠ
నిర్మాతబి.సత్యనారాయణ,
వింధ్యాల ఫణిశేఖర్ రెడ్డి
తారాగణంలయ,
భూమిక,
శివాజీ (నటుడు),
తనికెళ్ళ భరణి,
ఎమ్మెస్ నారాయణ,
ఎల్.బి.శ్రీరామ్,
బెంగుళూరు పద్మ
ఛాయాగ్రహణంజవహర్ రెడ్డి
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
సత్య ఎంటర్ టైన్ మెంట్స్
విడుదల తేదీ
నవంబరు 28, 2003 (2003-11-28)
భాషతెలుగు

మిస్సమ్మ నీలకంఠ దర్శకత్వం వహించగా 2003 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇందులో శివాజీ, లయ, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు. 2003లో ఈ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ రచయిత, ఉత్తమ నటి, ఉత్తమ డబ్బింగ్ విభాగంలో మూడు నంది పురస్కారాలు అందుకున్నది.[2]

నందగోపాల్ అలియాస్ నందు (శివాజీ) జె. పి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే సంస్థ, హైదరాబాదులో అకౌంటెంటుగా పనిచేస్తుంటాడు. చేసేది చిన్న ఉద్యోగమైనా అతని హృదయం విశాలమైంది. తనకొచ్చే జీతంలో పాతిక శాతం సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుంటాడు. అతని భార్య రత్నమాల (లయ). వారిద్దరూ పిల్లలు వద్దనుకుని ఒక అనాథ అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు. ఒకసారి కంపెనీకి ఛైర్మన్ మేఘన (భూమిక) కంపెనీ ప్రధాన కార్యాలయమైన ముంబై నుంచి హైదరాబాదుకు వస్తుంది. నందగోపాల్ ఆమె దగ్గర మంచి పేరు సంపాదించి పదోన్నతి పొందాలని వ్యాపార సంస్థలు సామాజిక సేవ ద్వారా ఎలా అభివృద్ధి చెందవచ్చో అనే అంశంపై తాను రాసిన థీసిస్ ను ఆమెకు ఇస్తాడు. ఆమె దాన్ని చదివి అతన్ని ఇంటికి పిలిపిస్తుంది.

తారాగణం

[మార్చు]
  • నందగోపాల్ పాత్రలో శివాజీ
  • రత్నమాల పాత్రలో లయ
  • మేఘన పాత్రలో భూమిక
  • తనికెళ్ళ భరణి
  • శరత్ బాబు
  • నాజర్
  • ఎం. ఎస్. నారాయణ

అవార్డులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు. ఆకాశానికి ఆశల నిచ్చెన అనే పాట పాతాళభైరవి సినిమాలో ప్రాచుర్యం పొందిన ప్రేమ కోసమై వలలో పడెనే అనే పాట బాణీలో స్వరపరచబడింది. ఇందులో కథా నాయకుడి మనోభావాలను వ్యక్తపరచడానికి దర్శకుడు నీలకంఠ మూకాభినయ (మైమ్) కళాకారులకు వాడుకున్నాడు.

  • నే పాడితే లోకమే పాడదా , వసుంధరా దాస్
  • ఎంత సుఖమిదే మనోహరా , శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్
  • ఆకాశానికి ఆశల నిచ్చెల వేసెను మనవాడు ,రాందాస్
  • అందాల గుమ్మరో ఆ బాపు బొమ్మరో , కార్తీక్, నిష్మ
  • నువ్వలా జిలి బిలి గువ్వలా , ఉదిత్ నారాయణ్ , ఉష
  • మిస్సమ్మ ట్యూన్ , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]
  1. జి. వి., రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 8 May 2017.
  2. శ్రీకన్య. "భూమిక 'మిస్సమ్మ' చిత్రం నిర్మాత మృతి". telugu.filmibeat.com. ఫిల్మీబీట్. Retrieved 8 May 2017.