మలూక్ నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మలూక్ నగర్

పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు భరతేంద్ర సింగ్
తరువాత చందన్ చౌహాన్
నియోజకవర్గం బిజ్నోర్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-07-03) 1964 జూలై 3 (వయసు 60)
షకర్పూర్, హాపూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ ఆర్‌ఎల్‌డీ
ఇతర రాజకీయ పార్టీలు బీఎస్‌పీ
తల్లిదండ్రులు ఆర్డీ నగర్, శాంతి నగర్
జీవిత భాగస్వామి సుధా నగర్ (06 జూలై 1989)
సంతానం 2
వృత్తి Politician
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

మలూక్ నగర్ (జననం 3 జూలై 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మలూక్ నగర్ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 1998 నుండి 2004 వరకు ఉత్తరప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పని చేసి, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మీరట్ నుండి, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కున్వర్ భరతేంద్ర సింగ్ పై 69,941 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ & కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[2]

మలూక్ నగర్ కు 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీఎస్‌పీ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన 2024 ఏప్రిల్ 11న రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డి)లో చేరాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. The Indian Express (12 November 2022). "Delhi Confidential: BSP MP Malook Nagar reaches out to the people in a unique way" (in ఇంగ్లీష్). Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
  3. The Hindu (11 April 2024). "Denied ticket, U.P.'s 'richest' MP from BSP joins RLD" (in Indian English). Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.