చందన్ చౌహాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందన్ సింగ్ చౌహాన్
చందన్ చౌహాన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు మలూక్ నగర్
నియోజకవర్గం బిజ్నోర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
10 మార్చి 2022 – జూన్ 2024
ముందు అవతార్ సింగ్ భదానా
తరువాత ఖాళీ
నియోజకవర్గం మీరాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1988-08-23) 1988 ఆగస్టు 23 (వయసు 36)
ముజఫర్‌నగర్
రాజకీయ పార్టీ రాష్ట్రీయ లోక్ దళ్
ఇతర రాజకీయ పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (2024–ప్రస్తుతం)
తల్లిదండ్రులు సంజయ్ సింగ్ చౌహాన్ , అనురాధ
జీవిత భాగస్వామి Yashika Chauhan
సంతానం 2
పూర్వ విద్యార్థి చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం
మూలం [1]

చందన్ సింగ్ చౌహాన్ (జననం 23 ఆగష్టు 1988) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022లో ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

చందన్ చౌహాన్ తండ్రి సంజయ్ చౌహాన్ కూడా బిజ్నోర్ ఎంపీగా, తాత చౌదరి నారాయణ్ సింగ్ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

చందన్ చౌహాన్ రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి సమాజ్ వాదీ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో చందన్ చౌహాన్ ఎస్పీలో ఉండగా మీరాపూర్ నియోజకవర్గం నుండి ఆర్‌ఎల్‌డి గుర్తుపై పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రశాంత్ చౌదరిపై 27380 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఆర్‌ఎల్‌డి పార్టీ యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

చందన్ చౌహాన్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ నియోజకవర్గం నుండి ఆర్‌ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి దీపక్ సైనీపై 37508 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  2. TV9 Bharatvarsh (5 June 2024). "बिजनौर लोकसभा सीट से जीतने वाले RLD के चंदन चौहान कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. "2024 Loksabha Elections Results - Bijnor". 4 June 2024. Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.