Jump to content

మలింద పుష్పకుమార

వికీపీడియా నుండి
మలింద పుష్పకుమార
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పావులుగే మలింద పుష్పకుమార
పుట్టిన తేదీ (1987-03-24) 1987 మార్చి 24 (వయసు 37)
కొలంబో, శ్రీలంక
ఎత్తు5 అ. 7 అం. (170 cమీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 141)2017 ఆగస్టు 3 - ఇండియా తో
చివరి టెస్టు2018 నవంబరు 23 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 184)2017 ఆగస్టు 31 - ఇండియా తో
చివరి వన్‌డే2017 సెప్టెంబరు 3 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008–2010Moors Sports Club
2012–2015Saracens Sports Club
2015–presentచిలా మారియన్స్ క్రికెట్ క్లబ్
2020Dambulla Viiking
2022Chattogram Challengers
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 4 2 150 104
చేసిన పరుగులు 102 11 2,289 440
బ్యాటింగు సగటు 17.00 5.50 13.78 10.00
100లు/50లు 0/0 0/0 0/4 0/0
అత్యుత్తమ స్కోరు 42* 8 80* 29
వేసిన బంతులు 860 114 33,201 4,927
వికెట్లు 14 1 863 175
బౌలింగు సగటు 37.14 105.00 20.09 18.71
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 72 5
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 24 0
అత్యుత్తమ బౌలింగు 3/28 1/40 10/37 5/24
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 2/– 140/– 36/–
మూలం: Cricinfo, 28 December 2022

పావులుగే మలింద పుష్పకుమార, శ్రీలంక క్రికెటర్. శ్రీలంక తరపున టెస్టు, వన్డేలు ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కొలంబో క్రికెట్ క్లబ్‌కు ఆడాడు.[1] 2019 జనవరిలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీశాడు.[2]

జననం

[మార్చు]

పావులుగే మలింద పుష్పకుమార 1987, మార్చి 24న శ్రీలంకలోకి కొలంబోలో జన్మించాడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

2016–17 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో 9 మ్యాచ్‌లు, 18 ఇన్నింగ్స్‌లలో మొత్తం 77 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీశాడు.[3]

2017 నవంబరులో శ్రీలంక క్రికెట్ వార్షిక అవార్డులలో 2016–17 సీజన్‌కు దేశీయ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా ఎంపికయ్యాడు.[4]

2017–18 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో 10 మ్యాచ్‌లు, 20 ఇన్నింగ్స్‌లలో మొత్తం 70 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసుకున్నాడు.[5] 2018 మార్చిలో 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం గాల్లె జట్టులో ఎంపికయ్యాడు.[6][7] తరువాతి నెలలో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం గాల్లె జట్టులో కూడా ఎంపికయ్యాడు.[8] ఆరు మ్యాచ్‌లలో పదిహేను ఔట్‌లతో టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.[9]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2017 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌తో సిరీస్ కోసం శ్రీలంక టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు, కానీ అందులో ఆడలేదు.[10]

2017 జూలైలో భారత్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక టెస్టు జట్టులో ఎంపికయ్యాడు.[11] 2017 ఆగస్టు 3నన భారత్‌పై శ్రీలంక తరపున అరంగేట్రం చేశాడు.[12] 20 ఓవర్లు బౌలింగ్ చేసి, అజింక్య రహానేను స్టంపౌట్ చేయడంతో తొలి వికెట్ సాధించాడు. పుష్పకుమార రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ తో 16 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఓడిపోయింది.

భారత్‌తో జరిగిన సిరీస్ కు శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[13] 2017 ఆగస్టు 31న భారత్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వికెట్ పడకుండా 65 పరుగులు ఇచ్చాడు, 3 పరుగులు మాత్రమే చేశాడు.[14]

2018 మేలో 2018–19 సీజన్‌కు ముందు శ్రీలంక క్రికెట్ ద్వారా జాతీయ కాంట్రాక్ట్‌ను పొందిన 33 మంది క్రికెటర్లలో అతను ఒకడిగా నిలిచాడు.[15][16]

మూలాలు

[మార్చు]
  1. "Malinda Pushpakumara". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  2. "Malinda Pushpakumara bags all 10 wickets in an innings". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  3. "Records: Premier League Tournament Tier A, 2016/17: Most wickets". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  4. "Gunaratne wins big at SLC's annual awards". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  5. "Records: Premier League Tournament Tier A, 2017/18: Most wickets". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  6. "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-24.
  7. "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 27 March 2018. Retrieved 2023-08-24.
  8. "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-24.
  9. "2018 Super Provincial One Day Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  10. "Herath to lead Sri Lanka, Pushpakumara called up for Bangladesh Tests". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  11. "Dhananjaya, Pradeep return to Sri Lanka's Test squad". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  12. "2nd Test, India tour of Sri Lanka at Colombo, Aug 3-7". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  13. "Thisara, Siriwardana return to ODI squad". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  14. "4th ODI (D/N), India tour of Sri Lanka at Colombo, Aug 31 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  15. "Sri Lanka assign 33 national contracts with pay hike". International Cricket Council. Retrieved 2023-08-24.
  16. "Sri Lankan players to receive pay hike". ESPN Cricinfo. Retrieved 2023-08-24.

బాహ్య లింకులు

[మార్చు]