మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మతుకు మిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి
జననం(1938-07-03)1938 జూలై 3
అయినవిల్లి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం2018 అక్టోబర్ 2
అమెరికా సంయుక్త రాష్ట్రాలు

మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి ( 1938 జులై 3- 2018 అక్టోబర్ 2) ఒక భారతీయ రాజకీయవేత్త, వ్యాపారవేత్త ఉపాధ్యాయుడు. వీర వెంకట సత్యనారాయణ మూర్తి[1] గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు.

ప్రారంభ జీవితం మరణం

[మార్చు]

వీర వెంకట సత్యనారాయణమూర్తి 1938 జూలై 3న ఐనావిల్లి జన్మించారు . వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. వీర వెంకట సత్యనారాయణ మూర్తి 2018 అక్టోబర్ 1న, జార్జ్ పార్క్స్ హైవే ప్రయాణిస్తున్నప్పుడు అలాస్కాలోని కాంట్వెల్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[1] గీతం విద్యాసంస్థల అధినేత వీర వెంకట సత్యనారాయణ మూర్తి అంత్యక్రియలు విశాఖపట్నం పక్కన 2018 అక్టోబరు 7న ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.[2]

కెరీర్

[మార్చు]

వీర వెంకట సత్యనారాయణ మూర్తి గీతం విద్యాసంస్థలను ప్రారంభించడానికి ముందు శీతాల పానీయాల వ్యాపారం చేసేవాడు.1980లో గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ విద్యాసంస్థలను స్థాపించాడు. 1983లో వీర వెంకట సత్యనారాయణ మూర్తి తెలుగు దేశం పార్టీ చేరి, 1987 నుండి 1989 వరకు విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పనిచేశాడు . వీర వెంకట సత్యనారాయణ మూర్తి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడానికి విశాఖ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. . 1991లో వీర వెంకట సత్యనారాయణ మూర్తివిశాఖపట్నం నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికై 1996 వరకు విశాఖపట్నం ఎంపీగా పనిచేశాడు. వీర వెంకట సత్యనారాయణ మూర్తి 1999 నుంచి 2004 వరకు విశాఖపట్నం నుండి గెలిచి రెండవసారి ఎంపీగా పనిచేశాడు. వీర వెంకట సత్యనారాయణ మూర్తి 2014లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. [3][4][5]

వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు సన్నిహితుడు. ఆయన మనవడు శ్రీభారత్ మతుకుమిల్లి, బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్వినిని వివాహం చేసుకున్నాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Hollander, Zaz (3 October 2018). "Former member of India parliament among dead in Parks Highway crash". Anchorage Daily News. Retrieved 6 October 2018.
  2. "GITAM founder MVVS Murthi to be cremated with state honours tomorrow". The New Indian Express. 6 October 2018. Retrieved 24 October 2021.
  3. "Andhra Pradesh MLC M V V S Murthy dies in car accident in US". Indian Express. Press Trust of India. 3 October 2018. Retrieved 6 October 2018.
  4. Aluri, Srikanth (3 October 2018). "GITAM institutions founder MVVS Murthy among four dead in car crash in USA". Times of India. Retrieved 6 October 2018.
  5. Nyayapati, Neeshita (4 October 2018). "Vizag mourns the sudden demise of educationist MVVS Murthi". Times of India. Retrieved 6 October 2018.
  6. "GITAM founder and ex-MP MVVS Murthi killed in US road accident". The News Minute. 2 October 2018. Retrieved 27 May 2019.