మంజు రాజేంద్ర దాదు
స్వరూపం
మంజు రాజేంద్ర దాదు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2023 డిసెంబర్ 3 | |||
ముందు | సుమిత్రా దేవి కస్డేకర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | నేపానగర్ | ||
పదవీ కాలం 2016 – 2018 | |||
ముందు | రాజేంద్ర దాదు | ||
తరువాత | సుమిత్రా దేవి కస్డేకర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1989 వాద్‌నగర్, మెహెసానా జిల్లా, మధ్యప్రదేశ్ , భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | రాజేంద్ర దాదు | ||
నివాసం | మధ్యప్రదేశ్ , భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
మంజు రాజేంద్ర దాదు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు నేపానగర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]మంజు దాదు తన భర్త రాజేంద్ర దాదు మరణాంతరం నేపానగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అంతర్సింగ్ దేవిసింగ్ బార్డే అంబాపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సుమిత్రా దేవి కస్డేకర్ చేతిలో 1,264 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయింది.
మంజు దాదు 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గెండు బాయిపై 44,805 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "मध्यप्रदेश : नेपानगर विधानसभा सीट पर सत्तारूढ़ भाजपा की मंजू दादू विजयी". NDTV. 22 November 2016. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "Madhya Pradesh bypoll: BJP retains Nepanagar Assembly seat". The Economic Times. 22 November 2016. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "Madhya Pradesh Assembly Elections Results 2023 - Nepanagar". Election Commission of India. 3 December 2023. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "Nepanagar Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.