భారత కేంద్ర బడ్జెట్ 2025 - 26
![]() భారతదేశ చిహ్నం | |
Submitted by | భారత ఆర్థిక మంత్రి |
---|---|
Parliament | 18వ లోక్‌సభ |
Party | భారతీయ జనతా పార్టీ |
Finance minister | నిర్మలా సీతారామన్ |
‹ 2024 2026 › |
భారత కేంద్ర బడ్జెట్ 2025, అనేది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్. ఆమె భారతదేశ చరిత్రలో ఇప్పటివరకూ వరసగా అత్యధిక సార్లు (ఎనిమిదో సారి) బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా, మహిళ మంత్రిగా నిలిచింది. అంతకుముందు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డు సృష్టించాడు.[1][2]
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశ పెట్టగా ఇందులో రూ.50,65,345 కోట్ల వ్యయం అంచనా వేశారు.[3] ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఈ మొత్తం 7.4 శాతం ఎక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు (సవరించిన అంచనా) రూ. 47.16 లక్షల కోట్లు.[4]
బడ్జెట్ నివేదిక ప్రకారం ఏప్రిల్ 1, 2025 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.5,41,850.21 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.4,15,356.25 కోట్లుగా ఉంటుంది.[5][6]
కేటాయింపులు
[మార్చు]- గ్రామీణ ఉపాధి హామీకి రూ. 86 వేల కోట్లు.
- ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ.19 వేల కోట్లు.
- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌కు రూ.19 వేల కోట్లు
- వాటర్ షెడ్ అభివృద్ధికి రూ. 2,505 కోట్లు
- కృషి వికాస యోజనకు రూ. 8,500 కోట్లు
- ఆయుష్ మిషన్‌కు రూ.1,275 కోట్లు
- సమగ్ర శిక్షా యోజనకు రూ. 41,250 కోట్లు
- పోషణ్ శక్తికి రూ.12,500 కోట్లు
- ప్రధాన మంత్రి స్కూల్ రైజింగ్‌కి రూ. 7,500 కోట్లు
- ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.30 వేల కోట్లు
- ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయలకు రూ. 7 వేల కోట్లు
- ఆయుష్మాన్ భారత్‌కి రూ.9,600 కోట్లు
- పోలీసు ఆధునీకరణకు రూ.4,069 కోట్లు
- ప్రధాని ఆవాస యోజన (అర్బన్) రూ.19,794 కోట్లు
- ప్రధాని ఆవాస యోజన (గ్రామీణ) రూ.54,832 కోట్లు
- అమృత్‌కి రూ.10 వేల కోట్లు
- స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) రూ. 5 వేల కోట్లు
- స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) రూ.7,192 కోట్లు
- అర్బన్ ఛాలంజ్ ఫండ్ రూ.10 వేల కోట్లు
- పీఎం కృషీ సించాయి యోజన రూ. 8,260 కోట్లు
- నదుల అనుసంధానానికి రూ. 2,400 కోట్లు
- పోలవరం ప్రాజక్టుకు రూ. 5,936 కోట్లు
- జలజీవన్ మిషన్ (గ్రామీణ తాగునీటి) రూ. 67 వేల కోట్లు
- పన్ను మినహాయింపుల కోసం రూ. 22,600 కోట్లు
- అంగన్‌వాడీ రూ. 21,960
- పంటల భీమా రూ.12,242 కోట్లు
- పీఎం ఆశా రూ. 6,941 కోట్లు
- పీఎం కిసాన్ రూ. 63,500 కోట్లు
- పత్తి టెక్నాలజీ మిషన్ రూ.500 కోట్లు
- పప్పు ధాన్యాల మిషన్ రూ. వెయ్యి కోట్లు
- పండ్లు, కూరగాయల మిషన్ రూ. 500 కోట్లు
- హైబ్రిడ్ విత్తనాల మిషన్ రూ. 100 కోట్లు
- మఖనా బోర్డుకు రూ.100 కోట్లు
- యూరియా సబ్సిడీ రూ.1,18,900 కోట్లు
- పోషకాహార సబ్సిడీ రూ. 49 వేల కోట్లు
- కొత్త పారిశ్రామిక పార్క్‌లకు రూ. 2,500 కోట్లు
- టెలికం మౌలిక సదుపాయలకు రూ. 28,400 కోట్లు
- గరీబ్ కళ్యాణ్ యోజన రూ. 2 లక్షల 3 వేల కోట్లు
- రక్షణ పరిశోధనలకు రూ.14,924 కోట్లు
- విమానాలు, ఏరో ఇంజన్లకు రూ. 48,614 కోట్లు
- రక్షణ నిర్మాణాలకు రూ. 11,452 కోట్లు
- నావెల్ ఫ్లీట్ రూ. 24,391
- సెమీ కండక్టర్స్ వ్యవస్థ ఏర్పాటు రూ. 7 వేల కోట్లు
- ఇండియా ఎఐ మిషన్ రూ. 2 వేల కోట్లు
- మెట్రో ప్రాజక్టులు రూ.31,239 కోట్లు
- పోలీసు మౌలిక వసతులకు రూ. 4,379
- కొత్త ఉద్యోగాల సృష్టికి రూ. 20 వేల కోట్లు
- కుసుం రూ. 2,600 కోట్లు
- సూర్య ఘర్ రూ. 20 వేల కోట్లు
- పేదలకు ఎల్‌పిజి కనెక్షన్లకు రూ. 9,100 కోట్లు
- కొత్త రైల్వే లైన్లకు రూ. 32,235 కోట్లు
- డబ్లింగ్‌కి రూ. 32 వేల కోట్లు
- రోలింగ్ స్టాక్ రూ. 45,530 కోట్లు
- జాతీయ రహదారులకు రూ. 1, 70, 266 కోట్లు
- మంత్రిత్వ శాఖ ద్వారా రహదారులకు రూ.1,16,292 కోట్లు
- సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనలకు రూ.20 వేల కోట్లు
- ఏకలవ్య మోడల్ స్కూల్స్ రూ. 7,089
- ఖేలో ఇండియా రూ. 1000 కోట్లు[7]
కొత్త పన్ను శ్లాబ్‌లు
[మార్చు]2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపును ఇచ్చింది. స్టాండర్డ్ డిడక్షన్ 75 వేల రూపాయలు కలుపుకుంటే పన్ను మినహాయింపు పరిధి 12.75 లక్షలకు పెరగనుంది.[8][9]
కొత్త విధానంలో ట్యాక్స్ శ్లాబ్‌లు
[మార్చు]రూ. 4,00,000 | జీరో ట్యాక్స్ |
రూ.4,00,001- రూ.8,00,000 | 5 శాతం |
రూ.8,00,000- రూ.12,00,000 | 10 శాతం |
రూ.12,00,000- రూ.16,00,000 | 15 శాతం |
రూ.16,00,000- రూ.20,00,000 | 20 శాతం |
రూ.20,00,000- రూ.24,00,000 | 25 శాతం |
రూ.24 లక్షల పైన | 30 శాతం |
మూలాలు
[మార్చు]- ↑ "తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డ్." Andhrajyothy. 1 February 2025. Archived from the original on 1 February 2025. Retrieved 1 February 2025.
- ↑ "దటీజ్ నిర్మలా సీతారామన్". Sakshi. 1 February 2025. Archived from the original on 1 February 2025. Retrieved 1 February 2025.
- ↑ "రూ.50.65 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం". Sakshi. 1 February 2025. Archived from the original on 1 February 2025. Retrieved 1 February 2025.
- ↑ "Union Budget 2025-26" (PDF). 1 February 2025. Archived from the original (PDF) on 1 February 2025. Retrieved 1 February 2025.
- ↑ "పేదలు, యువత, అన్నదాతలే టార్గెట్- కేంద్ర బడ్జెట్లో కీలక విషయాలివే!". ETV Bharat News. 1 February 2025. Archived from the original on 1 February 2025. Retrieved 1 February 2025.
{{cite news}}
: zero width space character in|title=
at position 32 (help) - ↑ "Union Budget 2025-26: బడ్జెట్ 2025-26 ఫుల్ డీటెయిల్స్ మీకోసం." Andhrajyothy. 1 February 2025. Archived from the original on 1 February 2025. Retrieved 1 February 2025.
- ↑ "Union Budget 2025 - 26: పథకాలకు భారీ కేటాయింపులు.. అవి ఎంతెంత అంటే ?". Andhrajyothy. 1 February 2025. Archived from the original on 1 February 2025. Retrieved 1 February 2025.
- ↑ "రూ.12.75 లక్షల వరకు పన్ను ఎలా పడదంటే?". 1 February 2025. Archived from the original on 1 February 2025. Retrieved 1 February 2025.
- ↑ "నెలకు లక్ష రూపాయల జీతం ఉన్నా ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు". BBC News తెలుగు. 1 February 2025. Archived from the original on 1 February 2025. Retrieved 1 February 2025.