Jump to content

భారత కేంద్ర బడ్జెట్ 2023 - 24

వికీపీడియా నుండి
2023 (2023) భారత కేంద్ర బడ్జెట్
Submitted byభారత ఆర్థిక మంత్రి
Submitted toభారత పార్లమెంట్
Presented2023
Parliament17వ లోక్ సభ (లోక్ సభ)
Partyభారతీయ జనతా పార్టీ
Finance ministerనిర్మలా సీతారామన్ (ప్రస్తుతం)
Total revenueIncrease31.94 trillion (US$400 billion) (in 2022)
Total expendituresIncrease39.45 trillion (US$490 billion) (in 2022)
Tax cutsNone
Deficit6.4% Positive decrease(0.3%) (in 2022)

భారత కేంద్ర బడ్జెట్ 2023-24 (ఆంగ్లం:2023 Union budget of India) దీన్ని ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న భారత పార్లమెంట్లో ఉదయం 11 గంటలకు సమర్పించింది.[1] దీంతో వరుసగా రెండోసారి డిజిటల్‌ పద్దును పార్లమెంట్‌కు సమర్పించినట్టయింది. ఇది 2020 నుండి నరేంద్ర మోడీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(NDA) ప్రభుత్వ రెండవ టర్మ్ లో నాల్గవ బడ్జెట్. ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి కాగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.

చరిత్ర

[మార్చు]

యూనియన్ బడ్జెట్ అనేది భారతదేశ వార్షిక ఆర్థిక నివేదిక; కాలానుగుణంగా ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల అంచనా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం, ఇది ప్రభుత్వం తప్పనిసరి విధి. భారతదేశపు మొదటి బడ్జెట్‌ను 1860 ఫిబ్రవరి 18న స్కాట్‌లాండ్‌కు చెందిన జేమ్స్ విల్సన్ సమర్పించారు. 1947 నవంబరు 26న ఆర్కే షణ్ముఖం చెట్టి స్వతంత్ర భారత తొలి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా దేశానికి వచ్చే ఆదాయం, ఖర్చులతో బడ్జెట్ రూపొందిస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టాక ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. అంటే ఈ ప్రక్రియ ఏప్రిల్ 1 లోపు పూర్తవ్వాల్సిఉంటుంది.

ప్రాధాన్య అంశాలు

[మార్చు]

సప్త రుషుల రీతిలో బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

  • సమ్మిళత వృద్ధి
  • చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరాలి
  • మౌలిక సదుపాయాలు- పెట్టుబడులు
  • సామర్థ్యాలను వెలికితీయడం
  • హరిత వృద్ధి
  • యువ శక్తి
  • ఆర్థిక రంగం బలోపేతం

బడ్జెట్ ముఖ్యాంశాలు

[మార్చు]
  • నీతి ఆయోగ్ మరో మూడేళ్లు పొడగింపు
  • చిరుధాన్యాల ప్రాధాన్యత పెంచేందుకు చర్యలు
  • శ్రీఅన్న పథకం ద్వారా చిరు ధాన్యాల రైతులకు ప్రోత్సాహం
  • సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం
  • హరిత ఇంధనం కోసం పటిష్ఠమైన చర్యలు
  • విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు
  • పురాతన తాళపాత్రల డిజిటలైజేషన్‌ కోసం ప్రత్యే చర్యలు
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
  • డిజిటల్ ఇండియాకు అనుగుణంగా వన్‌స్టాప్ ఐడెంటిటీ కేవైసీ విధానం
  • మహిళల కోసం కొత్తగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్
  • సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితి 15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంపు
  • కోస్తాలో మడ అడవుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

వ్యక్తిగత ఆదాయపు పన్ను

[మార్చు]

ఇన్‌కం ట్యాక్స్‌కు సంభందించి పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఇక రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో ‘కొత్త ఆదాయ పన్ను విధానం’ డీఫాల్ట్‌ ఆప్షన్‌గా వస్తుంది. దీనికి సంబంధించిన మార్పులు:

  • కొత్త పన్ను విధానంలో రూ. 5 లక్షల రిబేట్‌ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.7లక్షలకు పెంచారు.[2]
  • గతంలో ఇందులో 6 శ్లాబులు ఉండగా కొత్తగా 5కు కుదించారు. రూ.3 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదు.
    • రూ.3-6 లక్షల వరకు 5శాతం,
    • రూ.6-9 లక్షల వరకు 10శాతం,
    • రూ.9-12 లక్షలకు 15శాతం,
    • రూ.12-15 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20శాతం పన్ను కట్టాల్సిఉంటుంది.
    • అలాగే రూ.15 లక్షల ఆదాయం దాటిన వారిపై అత్యధికంగా 30శాతం పన్ను రేటు విధిస్తారు.

ఆదాయపు పన్ను రిటర్న్‌ల సగటు ప్రాసెసింగ్ సమయాన్ని 93 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించారు.

మూలాలు

[మార్చు]
  1. "Budget-2023: బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలమ్మ". web.archive.org. 2023-02-01. Archived from the original on 2023-02-01. Retrieved 2023-02-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Union Budget 2023-24: No income tax up to Rs 7 lakh - Sakshi". web.archive.org. 2023-02-01. Archived from the original on 2023-02-01. Retrieved 2023-02-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)