బొమ్మలు చెప్పిన కథ
బొమ్మలు చెప్పిన కథ | |
---|---|
దర్శకత్వం | జి.విశ్వనాథం |
రచన | కె. వి. శ్రీనివాసన్ (కథ, స్క్రీన్ ప్లే), సముద్రాల జూనియర్ (మాటలు) |
నిర్మాత | డి. రామానాయుడు |
తారాగణం | కాంతారావు, విజయనిర్మల |
ఛాయాగ్రహణం | పి. భాస్కరరావు |
కూర్పు | కె. ఎ. మార్తాండ్ |
సంగీతం | మాస్టర్ వేణు |
నిర్మాణ సంస్థ | |
సినిమా నిడివి | 149 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సురేష్ మూవీస్ బానర్‌పై జి.విశ్వనాథం దర్శకత్వంలో డి.రామానాయుడు రూపొందించిన జానపద చిత్రం బొమ్మలు చెప్పిన కథ. ఇందులో కాంతారావు, కృష్ణ, విజయనిర్మల, విజయలలిత ముఖ్య పాత్రలు పోషించారు. కె. వి. శ్రీనివాసన్ ఈ చిత్రానికి కథ, స్క్రీ ప్లే అందించగా జూనియర్ సముద్రాల మాటలు రాశాడు. వాహినీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మాస్టర్ వేణు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. జూనియర్ సముద్రాల, కొసరాజు, శ్రీశ్రీ, దాశరథి పాటలు రాశారు. ఘంటసాల, పి. సుశీల పాటలు పాడారు.
కథ
[మార్చు]నలుగురు దేవకన్యలు మునికుమారుల శాపంవలన కాళికాలయం బొమ్మలుగా మారతారు. వారు చెప్పిన కథ, పరిష్కారంతో రూపొందిన చిత్రం ఇది. విధి వ్రాతను విధాత కూడా తప్పించలేడని చెప్పిన కథే ఈ చిత్రం. అమరావతి నగర మహారాజు ధూళిపాళ. అతని బావమరిది వీరసేనుడు (ప్రభాకర్‌రెడ్డి). అతని భార్య హేమలత. వారికిద్దరు కుమార్తెలు లక్ష్మీ, సుజాత. పిల్లలతో కాళికాలయం చేరిన వీరసేనుకి ఈ పిల్లల్లో ఒకరి మరణానికి మరొకరు హేతువవుతారని తెలిసి, చిన్న కుమార్తెను ఆలయంలో వదిలివెళ్తాడు. ఆ బిడ్డ ఓ గొర్రెలకాపరి ఎల్లయ్య (మిక్కిలినేని) వద్ద చంపగా పెరుగుతుంది. కోటలో యువరాజు ప్రతాప్ (కాంతారావు)ను, సుజాత (విజయలలిత) ప్రేమిస్తుంది. రాజ్యంలో బందిపోట్లును అణచివేయాలని వెళ్లిన ప్రతాప్‌ను, వారి యువనాయకుడు మంగు (కృష్ణ) గాయపరుస్తాడు. ఆ అడవిలో పరిచయమైన చంప (విజయనిర్మల) అతణ్ణి సేద తీరుస్తుంది. ఆమెను ప్రేమించిన ప్రతాప్ అక్కడే వివాహం చేసికొని రాజ్యానికి తిరిగి వస్తాడు. తనను పెంచి పెద్దచేసి నాయకుడు (వి శివరాం) వల్ల తాను వీరసేనుడి కుమారుడినని మంగు తెలుసుకుంటాడు. తన అనుచరులను ప్రతాప్ బంధించాడని, అతన్ని చంపాలని రాజభవనానికి వెళ్లిన మంగును చంప తన అన్నయ్యగా గుర్తిస్తుంది. పోరాటంలో గాయపడిన మంగు ఎల్లన్నవలన చంప తన చెల్లెలని తెలుసుకుంటాడు. మరల కాళికాలయంలోని బొమ్మల ద్వారా ఆమెకు, ప్రతాప్‌కు కలిగే అపాయం నివారించటానికి గర్భవతియైన చంప తన భర్తను గాయపరచి ఆ రక్తం నుదుట తిలకంగా దిద్దుకోవాలని తెలుసుకొని, రాజభవనంలో ఆమెను ప్రోత్సహించి ఆ పని చేయిస్తాడు. సుజాత మంగూ, చంపల కుట్ర అని చెప్పటం, న్యాయసభలో చంప నిజం చెప్పడంవల్ల ప్రతాప్ శిలగా మారిపోతాడు. మంత్రి (సత్యనారాయణ) సింహాసనం ఆక్రమించుకుని.. మహారాజును, వీరసేనుని బంధిస్తాడు. మంత్రి కుమారుడు సుందరనందుడు (రాజ్‌బాబు) మంగులు సాయం, సాహసం బొమ్మలు చెప్పిన పరిష్కారంతో ప్రతాపుడు నిజరూపుడిగా మారి చంపను కలిసి ఆనందిస్తాడు. చంపపై కుట్రలు జరిపిన సుజాత, తన చెల్లిని మన్నింపుకోరి మరణించడంతో చిత్రం ముగుస్తుంది.[1]
నటీనటులు
[మార్చు]- ధూళిపాళ
- ప్రభాకర్‌రెడ్డి
- హేమలత
- మిక్కిలినేని
- కాంతారావు
- విజయలలిత
- కృష్ణ
- విజయనిర్మల
- వి.శివరాం
- సత్యనారాయణ
- రాజబాబు
- సంధ్యారాణి
- గీతాంజలి
- రామదాసు
- రమాప్రభ
సాంకేతిక వర్గం
[మార్చు]- సంగీతం: మాస్టర్ వేణు
- కథ, స్క్రీన్ ప్లే: కె. వి. శ్రీనివాసన్
- కళ: రాజేంద్రకుమార్
- నృత్యం: కెఎస్ రెడ్డి
- ఎడిటింగ్: కెఎ మార్తాండ్
- ఫొటోగ్రఫీ: పి భాస్కర్‌రావు
- అసోసియేట్ దర్శకుడు: కె బాపయ్య
- దర్శకత్వం: జి.విశ్వనాథం
- నిర్మాత: డి.రామానాయుడు
- స్టిల్స్: చిట్టిబాబు, శ్యాం
- మేకప్: పోతరాజు, వీర్రాజు, నరసింహులు, మాధవరావు, నారాయణ
- పోరాటాలు: సేతుమాధవన్, రాజు
- పబ్లిసిటీ: ఈశ్వర్
- కాస్ట్యూమ్స్: ఎం. కృష్ణారావు
పాటలు
[మార్చు]మాస్టర్ వేణు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. జూనియర్ సముద్రాల, కొసరాజు, శ్రీశ్రీ, దాశరథి పాటలు రాశారు. ఘంటసాల, పి. సుశీల పాటలు పాడారు.
- ఊర్వశి చేరగా ప్రేయసి కోరగా (గానం: పి సుశీల, రచన: శ్రీశ్రీ).
- గండు తుమ్మెద రమ్మంటుంది కొండ మల్లె రానంటుంది (గానం: పి సుశీల, ఘంటసాల, రచన: దాశరథి).
- మెమేమే మేకలన్నీ కలిసే ఉంటాయే. (గానం: పి సుశీల, రచన: సముద్రాల జూనియర్).
- జోడు నీవని తోడు రమ్మని అంటే పలకవు (గానం: పి సుశీల, రచన: సముద్రాల జూనియర్).
- సిరులిచ్చు లేవమ్మా శ్రీలక్ష్మిదేవీ పసుపు కుంకుమ,(గానం పి సుశీల బృందం, రచన: కొసరాజు)
మూలాలు
[మార్చు]- ↑ సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (11 May 2019). "ఫ్లాష్ బ్లాక్@50 బొమ్మలు చెప్పిన కథ". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 17 మే 2019. Retrieved 17 May 2019.
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- Pages using infobox film with missing date
- రామానాయుడు నిర్మించిన సినిమాలు
- తెలుగు జానపద సినిమాలు
- కాంతారావు నటించిన సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- విజయనిర్మల సినిమాలు
- ధూళిపాళ నటించిన సినిమాలు
- సుజాత నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు
- 1969 తెలుగు సినిమాలు