Jump to content

బూటా సింగ్

వికీపీడియా నుండి
బూటా సింగ్
బూటా సింగ్


పదవీ కాలం
1986 – 1989
ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ

గ్రామీణ, వ్యవసాయ అభివృద్ధి శాఖామంత్రి
పదవీ కాలం
1984 – 1986
ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ

బీహార్ రాష్ట్ర గవర్నరు
పదవీ కాలం
2004 – 2006

b3b gunmen
పదవీ కాలం
1962 – 2004

జాతీయ షెడ్యూల్డు కులాల ఛైర్మన్
పదవీ కాలం
2007 – 2010
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

క్రీడలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి
పదవీ కాలం
1982 – 1984
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ

ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ ఛైర్మన్
పదవీ కాలం
1981 – 1982
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ

ప్రజా పంపిణీ, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
1995 – 1996
ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు

వ్యక్తిగత వివరాలు

జననం (1934-03-21) 21 మార్చి 1934 (age 90)
ముస్తఫాపూర్, జలంధర్, పంజాబ్
రాజకీయ పార్టీ కాంగ్రెస్, రాజస్థాన్ వికాస్ పార్టీ
జీవిత భాగస్వామి మంజీత్ కౌర్
సంతానం అర్విందర్ సింగ్ లవ్లీ
నివాసం 11-A తీన్ మూర్తి మార్గ్, ఢిల్లీ

బూటా సింగ్ (21 March 1934 – 2 January 2021) ) కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, గవర్నరు. ఇందిరా గాంధీ హయాంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేశాడు. బీహార్ రాష్ట్ర మాజీ గవర్నరు.

జీవితం

[మార్చు]

బూటా సింగ్ 1934 మార్చి 21 న బ్రిటిష్ పంజాబ్ రాష్ట్రం, జలంధర్ జిల్లాలోని, ముస్తఫాపూర్ లో జన్మించాడు. జలంధర్ లోని లియాపూర్ ఖల్సా కళాశాలలో బి.ఏ ఆనర్సు చదువుకున్నాడు. తరువాత బాంబే లోని గురునానక్ ఖల్సా కళాశాలలో ఎం.ఏ చదివాడు. బుందేల్ ఖండ్ విశ్వవిద్యాలయం నుంచి పీ.హెచ్.డీ పూర్తి చేశాడు. 1964 లో మంజీత్ కౌర్ ను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం.[1] 2.1.2021 న కోమాలో చనిపోయారు.

రాజకీయం

[మార్చు]

బూటా సింగ్ రాజకీయ ప్రస్థానంలో  కమ్యూనిస్టుగా ప్రారంభించి, కొద్దికాలం శిరోమణి అకాలీదళ్ లో చేరాడు, తరువాత 1960 ల ప్రారంభంలో కాంగ్రెస్  పార్టీ లో చేరారు. కాంగ్రెస్ లో పేరెన్నిక  దళిత నాయకుడుగా చలామణిగా ఉంటూ, 1973-74లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) హరిజన సెల్ కన్వీనర్ గా పనిచేశాడు, ఆ తరువాత 1978 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. తన రాజకీయ జీవితంలో 1962లో పంజాబ్ లోని మోగా లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో ప్రారంభం అయ్యి, ఎనిమిది సార్లు లోక్ సభకు ఎన్నికైనాడు. 1974లో ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో రైల్వే సహాయ (డిప్యూటీ) మంత్రిగా నియమించాడు.  ఆపరేషన్ బ్లూ స్టార్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత కేంద్రమంత్రిగా స్వర్ణదేవాలయ పునర్నిర్మాణంలోనూ పాలుపంచుకున్నాడు.

1981 లో, భారతదేశములో జరిగిన మొదటి ప్రధాన అంతర్జాతీయ క్రీడలైన ఆసియా క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించబడ్డాడు. ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు ఆధ్వర్యంలో, బూటా సింగ్ 1995 నుండి 1996 వరకు కేంద్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2007 లో ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో బూటా సింగ్ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్.సి.ఎస్.సి) చైర్మన్ గా 2010 వరకు ఆ పదవిలో కొనసాగాడు[2].

మరణం

[మార్చు]

సుదీర్ఘ రాజకీయ వేత్తగా నలుగురి ప్రధాన మంతులతో పనిచేసిన బూటా సింగ్ తన 86 వ ఏట ఆరోగ్య కారణాలతో న్యూ ఢిల్లీలో 2021 జనవరి 2 న మరణించాడు[3].

మూలాలు

[మార్చు]
  1. "Hon'ble Governor of Bihar - Sardar Buta Singh". National Informatics Centre, India. Archived from the original on 3 ఫిబ్రవరి 2008. Retrieved 17 September 2014.
  2. "Indian National Congress". Indian National Congress (in ఇంగ్లీష్). Retrieved 2024-08-15.
  3. "Buta Singh who served under 4 prime ministers passes away". The Times of India. 2021-01-03. ISSN 0971-8257. Retrieved 2024-08-15.