Jump to content

బి. చంద్రకళ

వికీపీడియా నుండి
బి. చంద్రకళ
జననం
భూఖ్య చంద్రకళ నిరు

(1979-09-27) 1979 సెప్టెంబరు 27 (వయసు 45)
ఇతర పేర్లులేడీ దబాంగ్
విద్యబిఏ భౌగోళిక శాస్త్రం
ఎంఏ (ఆర్థికశాస్త్రం)
విద్యాసంస్థకోఠి మహిళా కళాశాల
ఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తిబ్యూరోక్రాట్
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
ఉద్యోగంభారత ప్రభుత్వం
జీవిత భాగస్వామిరాములు
పిల్లలుఒక కుమార్తె (కీర్తిచంద్ర)

భూఖ్య చంద్రకళ నిరు (జననం 1979 సెప్టెంబరు 27), తెలంగాణ రాష్ట్రానికి చెందిన సివిల్ సర్వీస్ అధికారిణి. ఉత్తర ప్రదేశ్‌లోని భారత ప్రభుత్వ అధికారిక ఐఏఎస్ గా విధులు నిర్వహించింది. భవన నిర్మాణంలో నాణ్యత లేకపోవటం, పారిశుధ్యం సరిగా లేకపోవటంపై సివిల్ అధికారులను నిలదీస్తూ, ఆకస్మిక తనిఖీలతో ఉద్యోగులపై చర్య తీసుకోవడంతో సమర్ధవంతమైన అధికారిణిగా ప్రసిద్ధి చెందింది.[1][2][3][4]

జననం, విద్య

[మార్చు]

చంద్రకళ 1979, సెప్టెంబరు 27న కిషన్ - లక్ష్మీ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలంలోని గర్జన్‌పల్లి గ్రామంలో జన్మించింది. తండ్రి భారతదేశ ఫెర్టిలైజర్ కార్పోరేషన్ విభాగంలో సీనియర్ టెక్నీషియన్ గా పనిచేసి పదవీ విరమణ చేయగా, తల్లి గృహిణి. నలుగురు తోబుట్టువులలో మూడవ కుమార్తెన చంద్రకళకు ఇద్దరు అన్నలు (రఘువీర్, మహావీర్), ఒక చెల్లెలు (మీనా) ఉన్నారు. సెంట్రల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసిన చంద్రకళ హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని కోఠి మహిళా కళాశాల నుండి భౌగోళిక శాస్త్రంలో బిఏ డిగ్రీతో పట్టభద్రురాలైంది. ఆ తరువాత అదే విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా పొందింది.[5] తన భర్త ప్రోత్సాహంలో సివిల్ పరీక్షలో 409వ ర్యాంక్ సాధించింది.[6]

వృత్తి జీవితం

[మార్చు]

2008 సంవత్సరం నుండి చంద్రకళ ఐఏఎస్ అధికారిణిగా సేవలందిస్తోంది. సాంఘిక సంక్షేమం, చెట్ల పెంపకం, పశుపోషణ, పర్యావరణం, పంచాయతీ సంబంధిత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆమె అమలు చేసింది. 2009 నుండి 2012 వరకు అలహాబాద్‌లో ఎస్.డి.యం., సిడిఓగా పనిచేసింది. ఉత్తర ప్రదేశ్ లో కొత్తగా వేసిన రోడ్లు నాసిరకంగా ఉన్నయని అధికారులు, కాంట్రాక్టర్లపై చంద్రకళ అరుస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అది భారతదేశంలోని మిలియన్ల మంది ప్రజల గొంతుకు అద్దం పట్టేలా ఉందని పలువురు పేర్కొన్నారు.[7]

2012లో హమీర్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమితురాలయింది. 2014, జూన్ 8న మధురకు బదిలీ అయింది. మధుర 2వ మహిళా జిల్లా మేజిస్ట్రేట్ అయింది.[2] 2015లో బులంద్‌షహర్ జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమితురాలై, బిజ్నోర్‌కు జిల్లా మేజిస్ట్రేట్‌గా బదిలీ అయింది. బిజ్నోర్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నప్పుడు, బిజ్నోర్‌లోని సహస్‌పూర్‌లో స్లాటర్ హౌస్‌ను తిరిగి ప్రారంభించినందుకు ఆమె విమర్శలకు గురయింది. 2016, సెప్టెంబరు 15న మీరట్ జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమితురాలయింది.

2017లో నీళ్ళు, పరిశుభ్రత మద్యపానం మంత్రిత్వశాఖలో[8] ఫిర్యాదులన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 242 గ్రామాల్లో దాదాపు 20 వేల మరుగుదొడ్లను నిర్మించింది. స్వచ్ భారత్ మిషన్ కింద డిప్యూటి సెక్రటరీ పదవిపై డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది.[9]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బిఏ రెండవ సంవత్సరం చదువుతున్న సమయంలోనే చంద్రకళకు రాంసాగర్ ప్రాజెక్ట్‌లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములుతో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (కీర్తిచంద్ర) ఉంది. 

మూలాలు

[మార్చు]
  1. "An IAS officer known for corruption crackdown in UP now in focus for all the wrong reasons". ThePrint. 12 January 2019.
  2. 2.0 2.1 "B Chandrakala: How a 'dabangg' IAS officer landed into illegal mining quagmire". Hindustan Times (in ఇంగ్లీష్). 9 January 2019.
  3. Qureshi, Siraj (7 January 2019). "B Chandrakala, accused in illegal mining case, was Lady Dabangg of Mathura". India Today (in ఇంగ్లీష్).
  4. By Harish Tiwari, Harish (9 February 2019). "'Absconding' Chandrakala busy penning verses for social media". My Nation.
  5. Sharma, Tridev Kumar (5 January 2019). "IAS B. Chandrakala/ बी. चंद्रकला एक बार फिर सुर्खियों में; जानिए यूपी कैडर की इस महिला IAS के बारे में जरूरी बातें". Dainik Bhaskar.
  6. Sakshi Education (13 December 2021). "Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..'తగ్గేదే లే'". Archived from the original on 16 జనవరి 2022. Retrieved 16 January 2022.
  7. "IAS officer B Chandrakala, a rage on social media for her videos, raided in UP mining scam". Hindustan Times (in ఇంగ్లీష్). 5 January 2019.
  8. "मर्दों को भेजकर मां-बहन की फोटो ख‍िचवाऊं?...पढ़ें इस IAS के चर्च‍ित बयान". Dainik Bhaskar. 1 April 2017.
  9. "Illegal sand mining case: IAS officer B Chandrakala skips summons but submits documents to Enforcement Directorate". Firstpost. 24 January 2019.