బిభూతి భూషణ్ దాస్ గుప్తా
బిభూతి భూషణ్ దాస్ గుప్తా, ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. దాస్ గుప్తా 1904 జనవరిలో దక్కా జిల్లా (బంగ్లాదేశ్) లోని సోనారంగ్ గ్రామంలోజన్మించాడు.[1] అతను రిషి నిబరన్ చంద్రదాస్ గుప్తాకుమారుడు.[1] దాస్ గుప్తా ఫరీద్‌పూర్‌లోని రజీంద్ర కళాశాలలో చదువుకున్నాడు. [2] అతను తన కళాశాల విద్యను పూర్తి చేయలేదు. దానిని మధ్యలోఆపి, భారతస్వాతంత్ర్య పోరాటంలో చేరాడు. [1]
రాజకీయాలు
[మార్చు]1921లో అతను భారత జాతీయ కాంగ్రెస్ గ్రామస్థాయి కార్యదర్శిగా పనిచేశాడు.[1]1922,1948 మధ్య అతను మన్భుమ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ, బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా పనిచేసాడు.[1]దాస్ గుప్తా 1938,1948 మధ్య భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడుగా ఉన్నాడు [1]
ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి అరెస్టయిన మంభుమ్‌లోని కాంగ్రెస్ నాయకులలో దాస్‌గుప్తా ఒకడు. [3] జైలు నుండి విడుదలైన తరువాత దాదాపు 1931-1932 ప్రాంతంలో అతను నిబరాంచంద్ర దాస్ గుప్తాతో కలిసి లోక్ సేవక్ సంఘ్, స్వరాజ్, సామాజిక సంస్కరణ కోసం పనిచేస్తున్న గాంధేయ ఉద్యమాన్ని స్థాపించాడు.[3] వారు అగ్రవర్ణ హిందువులతో సమానంగా సామాజిక, రాజకీయ జీవితంలో పాల్గొనవలసిందిగా ఆదివాసీలు, దళితులకు బోధించడంతో వారుకుల సోపానక్రమాలను సవాలు చేశారు.[3] కుష్టురోగులపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడటానికి సంస్థ ప్రయత్నించింది.[3]
1938-1939లో అతను పురులియా మునిసిపాలిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేశాడు.[1] [2] క్విట్ ఇండియా ఉద్యమంలో అతడిని అరెస్టు చేశారు.[4] అతను 1948లో లోక్ సేవక్ సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చడంలో పాల్గొన్నాడు.దాని ప్రధాన కార్యదర్శి అయ్యాడు.[1]దాస్ గుప్తా 1957 భారత సార్వత్రిక ఎన్నికల్లో పురులియాస్థానం నుండి లోకసభకు (రాజ్యసభ) ఎన్నికయ్యాడు.[5]దాస్ గుప్తా 1967 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో పురులియా నియోజకవర్గం నుంచి గెలిచాడు.[6]ఎన్నికల తరువాత దాస్ గుప్తా మొదటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో పంచాయితీలు, సాంఘిక సంక్షేమ మంత్రిగా పనిచేసాడు. [7] [8]1969 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో దాస్ గుప్తా పురులియా స్థానాన్నినిలబెట్టుకున్నాడు.[6]1969లో ఏర్పడిన రెండవ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో అతను పంచాయితీల మంత్రిగా ఎంపికయ్యాడు.[6]
అతను ముక్తి ఎడిటర్‌గా పనిచేశాడు.[1] అతను పురులియాలోని శిల్పాశ్రమంలో నివసించాడు. [1]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 India Who's who. INFA Publications. 1973. p. 284.
- ↑ 2.0 2.1 Lok Sabha. Second Lok Sabha Members Bioprofile Archived 20 డిసెంబరు 2016 at the Wayback Machine
- ↑ 3.0 3.1 3.2 3.3 West Bengal (India); Jatindra Chandra Sengupta (1985). West Bengal district gazetteers. Vol. 12. State editor, West Bengal District Gazetteers. pp. 104–105.
- ↑ Sajal Basu; Indian Institute of Advanced Study (1992). Regional movements: politics of language, ethnicity-identity. Indian Institute of Advanced Study. p. 113.
- ↑ Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1957 TO THE SECOND LOK SABHA - VOLUME I (NATIONAL AND STATE ABSTRACTS & DETAILED RESULTS)
- ↑ 6.0 6.1 6.2 Communist Party of India (Marxist). West Bengal State Committee. Election results of West Bengal: statistics & analysis, 1952-1991. The Committee. pp. 379, 440.
- ↑ Asian Recorder. Vol. 13. 1967. p. 7634.
- ↑ Subhash C. Kashyap (1974). The politics of power: defections and state politics in India. National Pub. House. p. 509.