Jump to content

బాబుల్ సుప్రియో

వికీపీడియా నుండి
బాబుల్ సుప్రియో
బాబుల్ సుప్రియో


సహాయ మంత్రి
పదవీ కాలం
31 మే 2019 – 7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు మహేష్ శర్మ
పదవీ కాలం
12 జులై 2016 – 30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు జి. ఎం. సిద్దేశ్వర
తరువాత అర్జున్ రామ్ మేఘవాల్
పదవీ కాలం
9 నవంబర్ 2014 – 12 జులై 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
23 మే 2014 – 22 అక్టోబర్ 2021
ముందు బన్సా గోపాల్ చౌధురి
నియోజకవర్గం అస‌న్‌సోల్

పార్లమెంట్ లో పర్యాటక సాంస్కృతిక కమిటీ సభ్యుడు
పదవీ కాలం
1 సెప్టెంబర్ 2014 – 9 నవంబర్ 2014
నియమించిన వారు సుమిత్ర మహాజన్
లోక్ సభ స్పీకర్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-12-15) 1970 డిసెంబరు 15 (వయసు 54)
ఉత్తరపరా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీ అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (2021– ప్రస్తుతం)[1]
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (2014–2021)
జీవిత భాగస్వామి
  • రియా
    (m. 1995; విడాకులు 2015)
  • రచన శర్మ
    (m. 2016)
[2]
పూర్వ విద్యార్థి కలకత్తా యూనివర్సిటీ (బి.కామ్)
సంతకం బాబుల్ సుప్రియో's signature

బాబుల్ సుప్రియో భారతదేశానికి చెందిన సినీ గాయకుడు, రాజకీయ నాయకుడు. ఆయన అస‌న్‌సోల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమల, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, అటవీ, పర్యావరణ శాఖల స‌హాయ మంత్రిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బాబుల్ సుప్రియో 2014లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అస‌న్‌సోల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన పార్లమెంట్ లో పర్యాటక, సాంస్కృతిక కమిటీ సభ్యుడిగా, కేంద్ర భారీ పరిశ్రమల, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల స‌హాయ మంత్రిగా పనిచేశాడు. బాబుల్ సుప్రియో 2019లో రెండోసారి లోక్‌సభ ఎంపీగా ఎన్నికై అటవీ, పర్యావరణ శాఖల స‌హాయ మంత్రిగా పనిచేసి 2021లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించారు.[3]

బాబుల్ సుప్రియో 2021లో జరిగిన పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టోలీగంజ్ నియోజ‌క‌వ‌ర్గం నుండి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. బాబుల్ సుప్రియో 2021 సెప్టెంబరు 18న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి అక్టోబరు 19న లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.[4][5] బెంగాల్‌లోని బాలిగంజ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జరిగే ఉప ఎన్నిక‌లో తృణ‌మూల్ అభ్య‌ర్థిగా టీఎంసీ అధినేత మ‌మ‌తా బెన‌ర్జీ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్రకటించింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "2 months after he was dropped at Centre, BJP MP Babul Supriyo joins TMC". Atri Mitra , Liz Mathew. The Indian Express. 19 September 2021. Retrieved 19 September 2021.
  2. Sakshi (7 July 2022). "సీఎం పగ్గాల తర్వాత లగ్గం చేసుకుంది వీళ్లే!". Archived from the original on 7 July 2022. Retrieved 7 July 2022.
  3. 10TV (8 July 2021). "రాజీనామా చేయమన్నారు.. అవినీతి మరకల్లేకుండా బయటకొచ్చా.. సంతోషమే! | Babul Supriyo Resignation" (in telugu). Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. 10TV (17 October 2021). "ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా!" (in telugu). Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Andhra Jyothy (19 October 2021). "ఎంపీ పదవికి రాజీనామా చేసిన బాబుల్ సుప్రియో" (in ఇంగ్లీష్). Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
  6. telugu (13 March 2022). "తృణ‌మూల్ త‌రపున ఉప ఎన్నిక‌ల అభ్య‌ర్థులుగా బ‌బుల్ సుప్రియో, శ‌త్రుఘ్న సిన్హా". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.