Jump to content

జి. ఎం. సిద్దేశ్వర

వికీపీడియా నుండి
జి. ఎం. సిద్దేశ్వర
జి. ఎం. సిద్దేశ్వర


కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
9 నవంబర్ 2014 – 12 జులై 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు పొన్ రాధాకృష్ణన్
తరువాత బాబుల్ సుప్రియో

పదవీ కాలం
26 మే 2014 – 9 నవంబర్ 2014
ముందు కే. సి. వేణుగోపాల్
తరువాత మహేష్ శర్మ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004
ముందు గౌడరా మల్లికార్జునప్ప
నియోజకవర్గం దావణగెరె

వ్యక్తిగత వివరాలు

జననం (1952-07-05) 1952 జూలై 5 (వయసు 72)
చిత్రదుర్గ, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి జి. ఎస్. గాయిత్రి
సంతానం 2
వెబ్‌సైటు Official Website

గౌడర మల్లికార్జునప్ప సిద్దేశ్వర (జననం 5 జూలై 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటకలోని దావంగెరె స్థానం నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సిద్దేశ్వర తన తండ్రి మాజీ ఎంపీ జి. మల్లికార్జునప్ప అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తండ్రి రెండు సార్లు 1996–1998 & 1999–2002 పార్లమెంటు సభ్యుడిగా పని చేశాడు. సిద్దేశ్వర ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా రాజకీయ జీవితంలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ క్రియాశీల సభ్యుడిగా సభ్యత్వం తీసుకున్నాడు. ఆయన కర్ణాటక రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా (2009-2010), బీజేపీ జాతీయ పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా (2004-2014) పని చేశాడు.

సిద్దేశ్వర 2004లో తొలిసారి దావంగెరె నుండి లోక్‌సభకు తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కోసం పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, ఆర్థిక పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. సిద్దేశ్వర 2009లో రెండోసారి ఎంపీగా ఎన్నికై జలవనరులపై పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా, ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా, వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.

సిద్దేశ్వర 2014లో మూడోసారి ఎంపీగా ఎన్నికై 26 మే 2014 నుండి 9 నవంబర్ 2015 వరకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా, 9 నవంబర్ 2014 నుండి 12 జూలై 2016 వరకు భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సహాయ మంత్రిగా పని చేశాడు.[2] ఆయన 2019లో నాలుగోవసారి దావంగెరె నుండి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2022). "Gowdar Mallikarjunappa Siddeshwara". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  2. India Today (12 July 2016). "Najma Heptulla, G M Siddeshwara resign from Modi Cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.