Jump to content

బాబా బాలక్ నాథ్

వికీపీడియా నుండి
మహంత్ బాలక్‌నాథ్ యోగి
బాబా బాలక్ నాథ్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023 డిసెంబరు 3
ముందు సందీప్ యాదవ్
నియోజకవర్గం తిజారా

పదవీ కాలం
2019 మే 23 – 2023 డిసెంబరు 3
ముందు కరణ్ సింగ్ యాదవ్
నియోజకవర్గం అల్వార్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1984-04-16) 1984 ఏప్రిల్ 16 (వయసు 40)
కోహ్రానా, రాజస్థాన్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భాజపా
నివాసం తిజారా, రాజస్థాన్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు
ఆధ్యాత్మిక గురువు

మహంత్ బాలక్‌నాథ్ యోగి (జననం 1984 ఏప్రిల్ 16) భారతీయ రాజకీయ నాయకుడు, ఆధ్యాత్మిక గురువు. ఆయన రాజస్థాన్‌లోని అల్వార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పదిహేడవ పార్లమెంటుకు సభ్యుడు.[1] 2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో ఆయన తిజారా నియోజకవర్గం నుండి పోటీచేసి గెలుపొందాడు.[2]

ఆయన బాబా మస్త్‌నాథ్ విశ్వవిద్యాలయం (BMU) ఛాన్సలర్ కూడా.[3] రోహ్‌తక్‌లోని మస్త్‌నాథ్‌ మఠానికి ఆయన ఎనిమిదో మహంత్‌.[4] నాథ్‌ సంప్రదాయానికి చెందిన అతి పెద్ద మఠాల్లో ఇది ఒకటి. ఈ మఠం వివిధ విద్యా సంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తుంది.

2016 జూలై 29న యోగి ఆదిత్యనాథ్, బాబా రామ్‌దేవ్‌లు హాజరైన వేడుకలో ఆయనను తన వారసుడిగా మహంత్ చంద్‌నాథ్ ప్రకటించాడు.[5][6][7]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆయన బెహ్రోర్ తహసీల్‌లోని కొహ్రానా గ్రామంలో ఒక హిందూ యాదవ కులం లో జన్మించాడు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఆయన ఆరు సంవత్సరాల వయస్సులో సన్యాసంలో తన మొదటి అడుగులు వేసాడు, ఇంటిని విడిచిపెట్టి ఆశ్రమంలో చేరాడు.[8] అక్కడ గురువు బాబా ఖేతనాథ్ ఆయనకు గురుముఖ్ అని పేరు పెట్టాడు.[9] అతను 1985 నుండి 1991 వరకు మత్స్యేంద్ర మహారాజ్ ఆశ్రమంలో నివసించాడు, ఆ తర్వాత అతను మహంత్ చంద్‌నాథ్‌తో కలిసి హనుమాన్‌ఘర్ జిల్లాలోని నాథవాలి తేరి గ్రామంలోని మఠానికి మారాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బాలక్ నాథ్ రాజకీయ ప్రస్థానం అతని గురువు, అల్వార్ మాజీ పార్లమెంటు సభ్యుడు మహంత్ చంద్‌నాథ్ అడుగుజాడలతో మొదలైంది. బాలక్ నాథ్ అతని తర్వాత హర్యానాలోని బాబా మస్త్‌నాథ్ మఠానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టాడు. యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ మద్దతు కూడా ఆయనకు ఉంది.[10]

రాజస్థాన్‌లోని అల్వార్ నుండి లోక్‌సభకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేట్ అయిన ఆయన 2019 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన భన్వర్ జితేంద్ర సింగ్‌ను 3 లక్షల ఓట్ల తేడాతో ఓడించి గెలుపొందాడు.[11]

2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఆయన తిజారా శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలుపొందాడు.

మూలాలు

[మార్చు]
  1. "ALWAR LOK SABHA ELECTION RESULT 2019".
  2. "Mahant Balaknath: మరో 'యోగి' అవుతారా |". web.archive.org. 2023-12-04. Archived from the original on 2023-12-04. Retrieved 2023-12-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "The Beacons of Society" (PDF). Archived from the original (PDF) on 27 August 2018. Retrieved 12 October 2018.
  4. "Cong expects tough contest in pampered constituency". Hindustan Times. 12 September 2014. Retrieved 12 October 2018.
  5. "महंत चांदनाथ ने तय किया अपना उत्तराधिकारी, मौजूद रहे बाबा रामदेव". अमर उजाला. Retrieved 12 October 2018.
  6. "Baba Mast Nath Matth gets New Mahant". Tribuneindia News Service. tribuneindia.com. Archived from the original on 12 అక్టోబరు 2018. Retrieved 12 October 2018.
  7. "Alwar MP dies, three CMs attend 'samadhi' ceremony". www.tribuneindia.com. Archived from the original on 2019-01-24.
  8. "Rajasthan CM Candidate: Who Is Mahant Balak Nath Yogi, BJP's Probable Choice?". News18 (in ఇంగ్లీష్). 2023-12-03. Retrieved 2023-12-03.
  9. "महंत बालकनाथ ने 6 साल की उम्र में ही ले लिया था संन्यास, जानिए उनके संन्यासी बनने से लेकर राजनीति में कदम रखने की कहानी | Mahant Balaknath Yogi History Alwar Loksabha Seat Candidate Balaknath". 30 March 2019.
  10. "Mahant Balak Nath Yogi: All you need to know about BJP candidate from Rajasthan's Tijara constituency". The Times of India. 2023-12-03. ISSN 0971-8257. Retrieved 2023-12-03.
  11. "अलवर सीट पर भाजपा ने महंत बालकनाथ को बनाया प्रत्याशी, जानिए क्या है यहां का समीकरण". 29 March 2019.