బాగేశ్వర్
బాగేశ్వర్ | |||
---|---|---|---|
పట్టణం | |||
శివుని విగ్రహం | |||
Coordinates: 29°50′17″N 79°46′16″E / 29.838°N 79.771°E | |||
దేశం | India | ||
రాష్ట్రం | దస్త్రం:..Uttarakhand Flag(INDIA).png Uttarakhand | ||
డివిజను | కుమావోన్ | ||
జిల్లా | బాగేశ్వర్ | ||
విస్తీర్ణం | |||
• Total | 5.50 కి.మీ2 (2.12 చ. మై) | ||
Elevation | 935 మీ (3,068 అ.) | ||
జనాభా (2011) | |||
• Total | 9,079 | ||
• జనసాంద్రత | 1,700/కి.మీ2 (4,300/చ. మై.) | ||
భాషలు | |||
• అధికారిక | హిందీ | ||
Time zone | UTC+5:30 (IST) | ||
PIN | |||
Vehicle registration | UK-02 |
బాగేశ్వర్ ఉత్తరాఖండ్ రాష్ట్రం, బాగేశ్వర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది దేశ రాజధాని ఢిల్లీ నుండి 470 కి.మీ. దూరంలోను, రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ నుండి 332 కి.మీ.దూరంలోనూ ఉంది. [1] బాగేశ్వర్, సుందరమైన వాతావరణం, హిమానీనదాలు, నదులు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. [2]
భౌగోళికం, శీతోష్ణస్థితి
[మార్చు]బాగేశ్వర్ 29°29′N 79°27′E / 29.49°N 79.45°E నిర్దేశాంకాల వద్ద ఉంది. [3] జాతీయ రాజధాని న్యూఢిల్లీకి ఈశాన్యంగా 470 కి.మీ., రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌కి ఆగ్నేయంగా 332 కి.మీ.దూరంలో కుమాన్ డివిజన్లో ఉంది. [4] బాగేశ్వర్ మధ్య హిమాలయ శ్రేణిలోని కుమావోన్ కొండల లోయలో ఉంది. [5] సముద్ర మట్తం నుండి దీని సగటు ఎత్తు 934మీటర్లు. చిర్ పైన్, హిమాలయన్ సైప్రస్, పిండ్రో ఫిర్, ఆల్డర్, సాల మొదలైన వృక్షాలు, సైందన్. సున్నపురాయి, ఇసుకరాయి, స్లేట్, గ్నీస్ గ్రానైట్ మొదలైన శిలలతో ఇక్కడి భౌగోళిక నిర్మాణం ఉంటుంది.
బాగేశ్వర్‌లో వార్షిక సగటు ఉష్ణోగ్రత 20.4°C. సగటు ఉష్ణోగ్రత 27.3 °C తో జూన్ నెల అత్యంత వెచ్చగా ఉంటుంది. ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 38 °C, 2017 జూన్ 5 న నమోదైంది. [6] అత్యంత చల్లని నెలైన జనవరిలో సగటు ఉష్ణోగ్రత 11°C ఉంటుంది. బాగేశ్వర్‌లో వార్షిక సగటు వర్షపాతం 1221.7 మి.మీ. సగటున అత్యధిక వర్షపాతం ఉన్న నెల జూలై. ఈ నెలలో 330.2 మి.మీ. వర్షం పడుతుంది. అత్యల్ప వర్షపాతం ఉన్న నెల నవంబరు.ఏడాదికి సగటున 63.6 రోజుల పాటు అవపాతం ఉంటుంది
వాతావరణ పట్టిక
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Bageshwar, India | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 17.2 (63.0) |
19.5 (67.1) |
25.0 (77.0) |
30.7 (87.3) |
33.7 (92.7) |
32.9 (91.2) |
29.4 (84.9) |
28.9 (84.0) |
28.7 (83.7) |
27.4 (81.3) |
23.6 (74.5) |
19.1 (66.4) |
26.4 (79.5) |
రోజువారీ సగటు °C (°F) | 11.0 (51.8) |
13.1 (55.6) |
18.1 (64.6) |
23.6 (74.5) |
26.8 (80.2) |
27.4 (81.3) |
25.4 (77.7) |
26.8 (80.2) |
24.2 (75.6) |
21.3 (70.3) |
16.8 (62.2) |
12.7 (54.9) |
20.5 (68.9) |
సగటు అల్ప °C (°F) | 4.9 (40.8) |
6.7 (44.1) |
11.2 (52.2) |
16.5 (61.7) |
19.8 (67.6) |
21.8 (71.2) |
21.5 (70.7) |
21.3 (70.3) |
19.8 (67.6) |
15.2 (59.4) |
10.0 (50.0) |
6.3 (43.3) |
14.6 (58.3) |
సగటు అవపాతం mm (inches) | 32.9 (1.30) |
35.1 (1.38) |
30.1 (1.19) |
24.4 (0.96) |
43.7 (1.72) |
157.0 (6.18) |
328.9 (12.95) |
328.2 (12.92) |
178.4 (7.02) |
42.5 (1.67) |
6.0 (0.24) |
13.6 (0.54) |
1,220.8 (48.06) |
సగటు అవపాతపు రోజులు | 2.7 | 2.9 | 2.8 | 2.1 | 3.0 | 8.1 | 14.2 | 15.3 | 8.3 | 2.3 | 0.8 | 1.1 | 63.6 |
రోజువారీ సరాసరి ఎండ పడే గంటలు | 10.9 | 11.6 | 12.4 | 13.3 | 14.1 | 14.5 | 14.3 | 13.6 | 12.7 | 11.8 | 11.1 | 10.7 | 12.6 |
Source: Weatherbase[7] |
జనాభా వివరాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బాగేశ్వర్‌లో 4,711 మంది పురుషులు, 4,368 మంది మహిళలతో మొత్తం 9,079 జనాభా ఉంది. జనాభాలో పురుషులు దాదాపు 55%, స్త్రీలు 45%. బాగేశ్వర్ లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1090 మంది స్త్రీలు, [8] ఇది జాతీయ సగటు 940/1000 కంటే ఎక్కువ. [9] లింగ నిష్పత్తి పరంగా ఉత్తరాఖండ్‌లో నగరం 4వ స్థానంలో ఉంది. [10] బాగేశ్వర్ సగటు అక్షరాస్యత రేటు 80%. ఇది జాతీయ సగటు 72.1% కంటే ఎక్కువ; 84% పురుషులు 76% స్త్రీలు అక్షరాస్యులు. జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. 2,219 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు కాగా, షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజల జనాభా 1,085.
2001 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా 7803. [11] 1991 జనాభా లెక్కల ప్రకారం 5,772.
దేవాలయాలు
[మార్చు]బాగేశ్వర్‌లో 93.34% మంది హిందూమతాన్ని ఆచరిస్తున్నారు. బాగేశ్వర్‌లో ఉన్న వివిధ దేవాలయాలు: [12]
- బాగ్నాథ్ ఆలయం
గోమతి, సర్జు నదుల సంగమం వద్ద శంఖాకార గోపురంతో ఒక పెద్ద ఆలయం ఉంది. ఇక్కడ బాగేశ్వర్ లేదా వ్యాగ్రీశ్వరుని మందిరం ఉంది. ఈ ఆలయాన్ని కుమౌన్ రాజు, లక్ష్మీ చంద్, సుమారు సా.శ. 1450 లో నిర్మించాడు. [13] అక్కడ చాలా పూర్వ కాలానికి చెందిన సంస్కృత శాసనం ఉంది. ఏటా శివరాత్రి సందర్భంగా ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. ఇక్కడ భైరవ దేవాలయం, దత్తాత్రేయ మహారాజ్, గంగా మాయి దేవాలయం, హనుమాన్ దేవాలయం, దుర్గా దేవాలయం, కాళికా దేవాలయం, తింగల్ భిరవ దేవాలయం, పంచమ జునాఖర, వనేశ్వరాలయం ఉన్నాయి
- బైజ్నాథ్ ఆలయం
బైజ్నాథ్ ఆలయం గోమతి నదికి ఎడమ ఒడ్డున ఉంది. ఇది ఒక బ్రాహ్మణ వితంతువు నిర్మించిన శివాలయం. [14]
- చండికా దేవాలయం
ఈ ఆలయం బాగేశ్వర్ నుండి అర కిలోమీటరు దూరంలో ఉంది. ప్రతి సంవత్సరం, నవరాత్రుల సమయంలో పూజలు చేయడానికి భక్తులు ఇక్కడకు చేరుకోవడంతో ఆలయం సందడిగా ఉంటుంది.
రవాణా
[మార్చు]పంత్నగర్ లో ఉన్న పంత్నగర్ విమానాశ్రయం ఇక్కడికి సేవలందించే సమీప విమానాశ్రయం. ఢిల్లీలో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.
కత్గోడం రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. కత్గోడం ఈశాన్య రైల్వే యొక్క బ్రాడ్ గేజ్ మార్గంలో చివరి స్టేషను. ఇది కుమావున్‌ను ఢిల్లీ, డెహ్రాడూన్, హౌరాలతో కలుపుతుంది. బాగేశ్వర్‌ను తనక్‌పూర్‌తో కలిపే కొత్త రైలుమార్గం ఈ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్. [15] [16] [17] తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు లింకు గురించి 1902 లోనే యోచించారు. [18] అయితే రైలు మార్గం యొక్క వాణిజ్య సాధ్యత లేని కారణంగా [18] 2016 లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును నిలిపివేసింది. [19] బాగేశ్వర్ నుండి గరూర్ మీదుగా చౌఖుటియాకు అనుసంధానం చేసే మరొక రైలు మార్గం గురించి కూడా ఆలోచనలు ఉన్నాయి. [20]
బాగేశ్వర్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తర భారతదేశంలోని ప్రధాన గమ్యస్థానాలకు రోడ్డు సౌకర్యం ఉంది. బాగేశ్వర్ గుండా వెళ్లే ప్రధాన రహదారులలో NH 109K, NH 309A, బరేలీ -బాగేశ్వర్ హైవే, [21] బాగేశ్వర్- సోమేశ్వర్ - ద్వారహత్ రోడ్డు ఉన్నాయి. ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బాగేశ్వర్ బస్ స్టేషన్ నుండి ఢిల్లీ, డెహ్రాడూన్, బరేలీ, అల్మోరాలకు బస్సులను నడుపుతుంది. [22]
మూలాలు
[మార్చు]- ↑ Indusnettechnologies, Goutam Pal, Dipak K S, SWD. "Location: District of Bageshwar, Uttarakhand, India". bageshwar.nic.in. Retrieved 3 August 2016.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Bageshwar PinCode". citypincode.in. Archived from the original on 8 December 2015. Retrieved 2014-03-17.
- ↑ Falling Rain Genomics, Inc. - Bageshwar
- ↑ Kumaon Himalaya (in ఇంగ్లీష్). Shree Almora Book Depot. ISBN 9788190020992.
- ↑ Illustrated Atlas of the Himalaya (in ఇంగ్లీష్). India Research Press. 2006. ISBN 9788183860376.
- ↑ "सोमवार को सबसे गर्म रही बागेश्वर घाटी". Haldwani Bureau (in హిందీ). Bageshwar: Amar Ujala. 5 June 2017. Retrieved 24 June 2017.
- ↑ "Bageshwar, India Travel Weather Averages (Weatherbase)". Weatherbase. Archived from the original on 2017-10-26. Retrieved 2022-01-13.
- ↑ "bageshwar-district-glance". Retrieved 5 August 2016.
- ↑ "लिंगानुपात की स्थिति चिंताजनक- Amarujala". Retrieved 5 August 2016.
- ↑ "Uttarakhand: Sex Ratio as per Census 2011". 15 February 2014. Retrieved 5 August 2016.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ Indusnettechnologies, Goutam Pal, Dipak K S, SWD. "Temples: District of Bageshwar, Uttarakhand, India". bageshwar.nic.in. Archived from the original on 20 July 2016. Retrieved 5 August 2016.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Bagnath Temple (Bageshwar)". onlytravelguide.com.
- ↑ "Temples in Bageshwar".
- ↑ Prashant, Shishir. "Demand for Tanakpur-Bageshwar railway line resurfaces". Retrieved 4 August 2016.
- ↑ "Tanakpur-Bageshwar rail project need of the hour". www.dailypioneer.com. Retrieved 4 August 2016.
- ↑ "ex mp tamta demands three railway lines". Archived from the original on 20 ఆగస్టు 2016. Retrieved 4 August 2016.
- ↑ 18.0 18.1 "Rail ministry stalls Tanakpur-Bageshwar link project - Times of India". Retrieved 4 August 2016.
- ↑ "Tanakpur-Bageshwar rail line commercially not viable: Suresh Prabhu – RailNews Media India Ltd". www.railnews.co.in. Archived from the original on 21 August 2016. Retrieved 4 August 2016.
- ↑ "चौखुटिया-गरुड़ से बागेश्वर आएगी रेल: टम्टा" (in హిందీ). Bageshwar: Hindustan. 11 September 2017. Retrieved 15 September 2017.
- ↑ Tiwari, Mrigank (18 October 2015). "CM opens much-awaited gateway to U'khand, enjoys ride too". The Times of India. Bareilly. TNN. Retrieved 11 April 2017.
- ↑ Dehradun, NIC, Uttarakhand State Unit. "Routes". utc.uk.gov.in. Archived from the original on 9 August 2016. Retrieved 5 August 2016.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link)