అక్షాంశ రేఖాంశాలు: 18°56′14.75″N 72°49′52.36″E / 18.9374306°N 72.8312111°E / 18.9374306; 72.8312111

బాంబే జింఖానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాంబే జింఖానా
ఎస్ప్లనేడ్ మైదాన్
ఆజాద్ మైదాన్
బాంబే జింఖానా
ప్రదేశందక్షిణ ముంబై
వాస్తుశిల్పిక్లాడ్ బాట్లే
ఆపరేటర్బాంబే జింఖానా
వాడుతున్నవారుఇండీయన్ రగ్బీ జట్టు
స్థానిక క్లబ్బులు

బాంబే జింఖానా, ముంబై నగరంలోని ప్రధానమైన ప్రైవేట్ సభ్యుల క్లబ్బులలో ఒకటి.[1] దీన్ని 1875 లో స్థాపించారు.

ఇది దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో ఆజాద్ మైదాన్ త్రిభుజాకార చివరలో ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు సమీపంలో ఉంది. ఇది మొదట బ్రిటిషర్లకు మాత్రమే అనుమతి ఉన్న జెంటిల్‌మెన్ క్లబ్‌గా నిర్మించారు. దీనిని ఇంగ్లీష్ ఆర్కిటెక్ట్ క్లాడ్ బాట్లీ రూపొందించారు. [2]

క్లబ్ మైదానం రగ్బీ, ఫుట్‌బాల్, క్రికెట్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, స్క్వాష్, దాని సభ్యుల ఫిట్‌నెస్ సెంటర్ కోసం వివిధ క్రీడా సౌకర్యాలను అందిస్తుంది. క్లబ్ తన సభ్యుల కోసం క్రమం తప్పకుండా క్రీడా కార్యక్రమాలు, టోర్నమెంట్‌లను నిర్వహిస్తుంది. క్లబ్‌లో ప్రవేశం సభ్యత్వం ద్వారా రిజర్వ్ చేయబడుతుంది. బాంబే జింఖానా రగ్బీ క్లబ్ (రగ్బీ యూనియన్) ఇక్కడి అద్దెదారు.

క్రీడలు

[మార్చు]

లాబీ, టేబుల్ టెన్నిస్ ప్రాంతం, బ్యాడ్మింటన్ కోర్ట్, రెస్టారెంట్, లాంజ్‌గా పనిచేసే పొడవైన భవనం రెండు రోడ్లను కలుపుతూ ఉంటుంది. భవనానికి, లేన్‌కూ మధ్య ఉన్న ప్రాంతం పెద్ద మైదానం. ఈ ప్రత్యేకమైన క్లబ్‌లో సభ్యత్వం పొందడం చాలా కష్టం. [3]

ఇక్కడ చలికాలంలో క్రికెట్ ఆడతారు. వర్షాకాలంలో రగ్బీ, ఫుట్‌బాల్ ఆడతారు. పూర్వపు బాంబే పెంటాంగ్యులర్ క్రికెట్ మ్యాచ్‌లకు ఇది ప్రధాన కేంద్రంగా ఉండేది. 1933 డిసెంబరు 15న [4] CK నాయుడు కెప్టెన్‌గా ప్రారంభమైన భారతదేశపు మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన ఘనత ఈ మైదానానికి ఉంది. రికార్డు స్థాయిలో 50,000 మంది జనం ఉండేలా గ్రౌండ్‌లో తాత్కాలిక స్టాండ్‌లు ఏర్పాటు చేసారు. టిక్కెట్లు సాధారణ ధర కంటే ఐదు రెట్లు ఎక్కువకు అమ్ముడయ్యాయి. [5] ఈ మ్యాచ్ లాలా అమర్‌నాథ్ చేసిన సెంచరీకి గుర్తుండిపోతుంది. ఇది భారత క్రికెట్‌లో ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి. [6] 1937లో బ్రాబోర్న్ స్టేడియం ఆవిర్భవించినప్పటి నుండి ఈ మైదానం సీనియర్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేదు. ఈ మైదానాన్ని బాంబే పెంటాంగ్యులర్, అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికగా మార్చారు. [7]


2002 డిసెంబరు 10 న భారతదేశం, ఇంగ్లండ్ మధ్య వికలాంగులు ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన ఘనత కూడా ఈ మైదానానికి ఉంది. ఆ వన్డే మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది.

1996 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్‌తో తలపడటానికి ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రాక్టీస్ చేయడానికి ఈ మైదానాన్ని ఉపయోగించుకుంది. 2004 లో బాంబే జింఖానాలో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో వన్డే ఇంటర్నేషనల్ ఆడింది.[8] 2010 మార్చిలో ముంబై ఇండియన్స్ IPL సీజన్‌కు ముందు ఈ మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. [9] ఆ తర్వాత సంవత్సరంలో కెనడా, 2011 ప్రపంచ కప్‌కు సిద్ధపడేందుకు బొంబాయి జింఖానా జట్టుతో మ్యాచ్ ఆడింది [10]

ఈ మైదానం జాతీయ రగ్బీ పోటీని కూడా నిర్వహిస్తారు. HSBC సెవెన్స్ ఆసియా సర్క్యూట్‌లో భాగంగా శ్రీలంక, ఇతర దక్షిణాసియా జట్లతో మ్యాచ్‌లను నిర్వహించింది. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్‌లను కూడా నిర్వహించారు.

బాంబే జింఖానాలో మూడు బ్యాడ్మింటన్ కోర్టులు, ఐదు స్క్వాష్ కోర్టులు, ఆరు టెన్నిస్ కోర్టులు, బిలియర్డ్స్, స్నూకర్ కోసం ఆరు టేబుల్స్, ఒక స్విమ్మింగ్ పూల్, ఫిట్‌నెస్ సెంటరూ ఉన్నాయి. [1]

కొన్ని సంవత్సరాల క్రితం వరకు, క్లబ్‌లో పురుషులు మాత్రమే సభ్యత్వం ఉండేది. 2000 ల ప్రారంభం నుండి మహిళలను కూడా చేర్చుకుంటున్నారు.

బొంబాయి జింఖానా జెండా

రోడ్డు విస్తరణ వివాదం

[మార్చు]

2016 లో BMC ( బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ), మైదానం ప్రక్కనే ఉన్న హజారిమల్ సోమాని మార్గ్‌ను విస్తరించాలని తలపెట్టింది. సుమారు 5809 చ.మీ బొంబాయి జింఖానాకు చెందిన భూమి అవసరం పడింది. [11] జింఖానా దీన్ని వ్యతిరేకించింది.[1] సీఈఓ బంగ్లా, వైన్ షాపుతో సహా అదనపు భవనాలను అక్రమంగా నిర్మించినందుకు కూడా జింఖానాపై అభియోగాలు మోపారు. [12]

అంతర్జాతీయ శతకాలు

[మార్చు]

టెస్టులు

[మార్చు]

ముంబైలోని బాంబే జింఖానాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో సాధించిన సెంచరీల జాబితా ఇది:[13]

నం. స్కోర్ ఆటగాడు జట్టు సత్రాలు. ప్రత్యర్థి జట్టు తేదీ ఫలితం
1 136 బ్రయాన్ వాలెంటైన్  ఇంగ్లాండు 2  భారతదేశం 15 డిసెంబర్ 1933 గెలిచింది
2 118 లాలా అమర్‌నాథ్  భారతదేశం 3  ఇంగ్లాండు 15 డిసెంబర్ 1933 కోల్పోయిన

ఐదు వికెట్లు తీసిన వారి జాబితా

[మార్చు]

పరీక్షలు

[మార్చు]
నం. బౌలర్ తేదీ జట్టు ప్రత్యర్థి జట్టు ఇన్ ఓవర్లు పరుగులు వికెట్లు ఎకానమీరేటు ఫలితం
1 మహ్మద్ నిస్సార్ 15 December 1933  భారతదేశం  ఇంగ్లాండు &&&&&&&&&&&&&&02.&&&&&02 &&&&&&&&&&&&&033.50000033.5 &&&&&&&&&&&&&090.&&&&&090 &&&&&&&&&&&&&&05.&&&&&05 &&&&&&&&&&&&&&02.6600002.66 కోల్పోయిన
2 స్టాన్ నికోలస్ 15 December 1933  ఇంగ్లాండు  భారతదేశం &&&&&&&&&&&&&&03.&&&&&03 &&&&&&&&&&&&&023.50000023.5 &&&&&&&&&&&&&055.&&&&&055 &&&&&&&&&&&&&&05.&&&&&05 &&&&&&&&&&&&&&02.3000002.30 గెలిచింది

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Sarkar, Arita (21 August 2016). "Once Upon A Time: Bombay Gymkhana was first club to bring multiple sports together". The Indian Express. Archived from the original on 4 September 2018. Retrieved 3 September 2018.
  2. "Bombay gymkhana plans to shut kitchens: The History". Mid-Day. Archived from the original on 20 March 2012. Retrieved 2009-06-17.
  3. "New clubs on the block". Daily News and Analysis. Archived from the original on 5 December 2009. Retrieved 2009-06-17.
  4. "Gymkhana Ground: Test Matches". ESPN Cricinfo. 17 June 2011. Archived from the original on 16 December 2011. Retrieved 17 June 2011.
  5. "When Test cricket came to India". ESPNCricinfo. 29 April 2006. Archived from the original on 29 September 2012. Retrieved 28 February 2012.
  6. "Pure romantic, Byron of Indian cricket". The Hindu. 6 August 2000. Archived from the original on 15 September 2013. Retrieved 28 February 2012.
  7. Anandji Dossa, Vasant Raiji (1987). CCI & the Brabourne Stadium, 1937-1987. Cricket Club of India. pp. 29–30.
  8. "Mithali Raj steers India home". ESPNCricinfo. 17 December 2004. Archived from the original on 10 March 2014. Retrieved 28 February 2012.
  9. "Tendulkar rewinds time at the Bombay Gymkhana". ESPNCricinfo. 9 March 2010. Archived from the original on 5 March 2014. Retrieved 28 February 2012.
  10. "Canada to tour India for World Cup preparations". ESPNCricinfo. 15 November 2010. Archived from the original on 11 December 2010. Retrieved 28 February 2012.
  11. "Mumbai: BMC wants 6,000 sq m of Bombay Gymkhana land". Archived from the original on 26 August 2016. Retrieved 2016-08-23.
  12. "Bombay Gymkhana row: CEO's bungalow, wine shop built without nod, says Collector". 2016-08-11. Archived from the original on 13 August 2016. Retrieved 2016-08-23.
  13. "Statistics - Statsguru - Test Matches - Batting Records". ESPN Cricinfo. Archived from the original on 5 October 2021. Retrieved 29 August 2019.

ఇతర పఠనాలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]

18°56′14.75″N 72°49′52.36″E / 18.9374306°N 72.8312111°E / 18.9374306; 72.8312111