అక్షాంశ రేఖాంశాలు: 25°29′N 80°20′E / 25.483°N 80.333°E / 25.483; 80.333

బాందా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాందా
పట్టణం
బాందా is located in Uttar Pradesh
బాందా
బాందా
Coordinates: 25°29′N 80°20′E / 25.483°N 80.333°E / 25.483; 80.333
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబాందా
విస్తీర్ణం
 • Total443.1 కి.మీ2 (171.1 చ. మై)
Elevation
123 మీ (404 అ.)
జనాభా
 (2011)[1]
 • Total1,54,428
 • జనసాంద్రత350/కి.మీ2 (900/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
210001
టెలిఫోన్ కోడ్91-5192
లింగనిష్పత్తి881[1] /
అక్షరాస్యత82.05%

బాందా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో, యమునా నదికి దక్షిణాన ఉన్న పట్టణం. ఇది బాందా జిల్లా ముఖ్య పట్టణం కూడా. ఇది బుందేల్‌ఖండ్ ప్రాతంలో తూర్పు కొసన ఉన్న జిల్లా.

బాందా నుండి ముఖ్యమైన పట్టణాలు నగరాలకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి. ఈ పట్టణం కేన్ నది కుడి ఒడ్డున,[3] అలహాబాద్‌కు నైరుతి దిశలో 95 కి.మీ.దూరంలో ఉంది. బాందా బ్రిటిష్ పరిపాలనలో యునైటెడ్ ప్రావిన్స్‌లోని అలహాబాద్ విభాగంలో ఒక ముఖ్యమైన పట్టణంగా ఉండేది. 1901 లో పట్టణ జనాభా 22,565. గతంలో ఇక్కడ సైనిక కంటోన్మెంటుండేది. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది.

జనాభా వివరాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బాందా జనాభా 1,54,428, వీరిలో పురుషులు 82,116, మహిళలు 72,312. ఆరేళ్ళ లోపు పిల్లలు 18,621. బాందాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1,11,432, ఇది జనాభాలో 72.16%, పురుషుల్లో 77.4% అక్షరాస్యత ఉండగా, స్త్రీలలో 66.2%గా ఉంది. బాందాలో ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 82.1%. ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 87.9% స్త్రీ అక్షరాస్యత రేటు 75.4%. లింగ నిష్పత్తి 881. షెడ్యూల్డ్ కులాల జనాభా 18,539, షెడ్యూల్డ్ తెగల జనాభా 17. 2011 నాటికి పట్టణంలో 27,987 గృహాలు ఉన్నాయి.[1]

చరిత్ర

[మార్చు]

షంషేర్ బహదూర్ I (కృష్ణారావు) బాందా రాజ్యానికి మరాఠా పాలకుడు. అతను బాజీరావ్ I, మస్తానీల కుమారుడు.[4][5][6] తన తండ్రి ఆధిపత్యంలో ఉన్న బాందా, కల్పిలో కొంత భాగాన్ని అతడు పొందాడు. 1761 లో, మరాఠాలు, ఆఫ్ఘన్లకు మధ్య జరిగిన మూడవ పానిపట్టు యుద్ధంలో అతను, అతని సైన్యం (పేష్వాతో కలిసి పోరాడారు) పాల్గొన్నారు. అతను ఆ యుద్ధంలో గాయపడి, కొన్ని రోజుల తరువాత డీగ్ వద్ద మరణించాడు.[7] షంషేర్ వారసుడు అలీ బహదూర్ (కృష్ణ సింగ్) బుందేల్‌ఖండ్‌లోని పెద్ద భాగంపై తన అధికారాన్ని స్థాపించుకున్నాడు. బాందాలో పేష్వాకు సుబేదారయ్యాడు. షంషేర్ బహదూర్ వారసులు మరాఠా రాజ్యం పట్ల తమ విధేయతను కొనసాగించారు. అతని మనవడు, షంషేర్ బహదూర్ II, 1803 నాటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఆంగ్లేయులతో పోరాడాడు.[8]

బుందేల్‌ఖండ్ కేసరి, దేవాన్ శత్రుఘ్న సింగ్ & రాణి రాజేంద్ర కుమారి నాయకత్వంలో బాందా ప్రాంతం భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంది.

రవాణా

[మార్చు]

రోడ్డు రవాణా

[మార్చు]

టాక్సీలు, సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు నగరంలో అందుబాటులో ఉన్న బహుళ రవాణా మార్గాలు. జాతీయ రహదారి 76 బాందా గుండా వెళుతుంది. ఇది పట్టణాన్ని ఝాన్సీ, అలహాబాద్ లతో కలుపుతుంది. రాష్ట్ర రహదారి 92, బాందాను ఫతేపూర్తో కలుపుతుంది. రాష్ట్ర రహదారి 76 అలహాబాద్‌తోటి, జాతీయ రహదారి 86 కాన్పూర్‌తోటీ కలుపుతుంది. సుదూర సేవలే కాకుండా, రాష్ట్రంలోని సమీప ప్రదేశాలకు పట్టణం అనేక బస్సు సేవలు ఉన్నాయి. కాన్పూర్, అలహాబాద్, ఢిల్లీ, సాగర్, లక్నో, ఝాన్సీ, ఖజురహో మొదలైన పట్టణాలకు రోజువారీ బస్సులు చాలా ఉన్నాయి. రోడ్ బారా గాలౌలి, పైలాని రోడ్ ద్వారా కాన్పూర్ చేరుకోవచ్చు.

బాందా రైల్వే స్టేషన్, ఉత్తర మధ్య రైల్వే జోన్, ఝాన్సీ రైల్వే డివిజన్ పరిధిలో ఉంది.[9] కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, లక్నో, భోపాల్, బిలాస్‌పూర్, గ్వాలియర్, జబల్పూర్, రాయ్‌పూర్, వారణాసి, ఆగ్రా వంటి అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడి నుండి రైళ్ళున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Census of India: Banda". www.censusindia.gov.in. Retrieved 30 December 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 23 నవంబరు 2020.
  3.  One or more of the preceding sentences incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). "Banda". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 3 (11th ed.). Cambridge University Press.
  4. Bhawan Singh Rana (1 January 2005). Rani of Jhansi. Diamond. pp. 22–23. ISBN 978-81-288-0875-3.
  5. Chidambaram S. Srinivasachari (dewan bahadur) (1951). The Inwardness of British Annexations in India. University of Madras. p. 219.
  6. Rosemary Crill; Kapil Jariwala (2010). The Indian Portrat, 1560–1860. Mapin Publishing Pvt Ltd. p. 162. ISBN 978-81-89995-37-9.
  7. Henry Dodwell (1958). The Cambridge History of India: Turks and Afghans. CUP Archive. pp. 407–. GGKEY:96PECZLGTT6.
  8. Jadunath Sarkar (1 January 1992). Fall of the Mughal Empire: 1789–1803. Sangam. pp. 11–. ISBN 978-0-86131-749-3.
  9. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 15 January 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బాందా&oldid=3969132" నుండి వెలికితీశారు