ఫ్రెడరిక్ బాంటింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్ ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్
జననం(1891-11-14)1891 నవంబరు 14
ఒంటారియో, కెనడా
మరణం1941 ఫిబ్రవరి 21(1941-02-21) (వయసు 49)
న్యూఫౌండ్ లాండ్, ప్రస్తుత కెనడా
జాతీయతకెనడా
రంగములువైద్య పరిశోధనలు
చదువుకున్న సంస్థలుటొరంటో విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిఇన్సులిన్ ఆవిష్కరణ
ముఖ్యమైన పురస్కారాలునోబెల్ బహుమతి (1923)

సర్ ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్ (ఆంగ్లం Sir Frederick Grant Banting) (జ: నవంబరు 14, 1891; మ: ఫిబ్రవరి 21, 1941) కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత.

జీవిత విశేషాలు

[మార్చు]

బాంటింగ్ వైద్యవిద్య టోరంటో విశ్వవిద్యాలయం నుండి 1916లో పూర్తిచేసిన తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆర్మీ మెడికల్ కార్ప్స్ ద్వారా దేశానికి సేవలందించాడు. ఆ తర్వాత ఎముకల శస్త్రచికిత్సలో నైపుణ్యం సంపాదించాడు. యూనివర్సిటీలో వైద్య విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ బయట వైద్యసేవలందించేవాడు. మధుమేహంతో బాధపడుతున్న రోగుల బాధల్ని బాపేందుకు లండన్ నుండి టొరాంటోకు మకాం మార్చాడు. అక్కడ 1921 లో జాన్ జేమ్స్ రిచర్డ్ మెక్లియాడ్ (John James Richard Macleod) పర్యవేక్షణలో టొరాంటో యూనివర్సిటీలో పరిశోధనలు మొదలుపెట్టాడు. చార్లెస్ బెస్ట్ (Charles Best) ఇతనికున్న ఏకైక శిష్యుడు.

ఇన్సులిన్ తయారీ

[మార్చు]

బాంటింగ్ కుక్కలలో క్లోమ నాళాన్ని బంధించి ఉంచి, కొంతకాలం తర్వాత వాటినుండి క్లోమాన్ని వేరుచేసి వాటి రసాన్ని మధుమేహంతో బాధపడుతున్న కుక్కలకు ఎక్కించి పరీక్షించాడు. దీని ఆధారంగా జరిపిన విస్తృత పరిశోధనల మూలంగా మెక్లియాడ్ పర్యవేక్షణలో 1921-22 ప్రాంతంలో ఇన్సులిన్ ను వేరుచేశారు.

ఇది ఆనాటి కాలంలో వైద్యశాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైన అభివృద్ధి. ఇన్సులిన్ ను వేరుచేయడమే కాకుండా కొన్ని నెలల కాలంలోనే దాన్ని అధిక మొత్తంలో తయారుచేసి, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరప్రసాదంగా మారింది.

1923 సంవత్సరంలో బాంటింగ్, మెక్లియాడ్ ఇద్దరు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. బాంటింగ్ తనకు వచ్చిన ధనాన్ని తన శిష్యుడు బెస్ట్ తో పంచుకున్నాడు. జార్జి రాజు V (King George V) 1934 సంవత్సరంలో సర్ బిరుదాన్ని బహూకరించారు.

మధుమేహ దినోత్సవం

[మార్చు]

మధుమేహం (షుగర్ వ్యాధి) వ్యాధి నియంత్రణకోసం కృత్రిమ ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్తవ్రేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజైన నవంబరు 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకుంటారు.[1][2][3]

బాంటింగ్ రచనలు

[మార్చు]
  • The Discovery of Insulin by Michael Bliss, University of Chicago Press, 1982, ISBN 0-226-05897-2.
  • Banting as an Artist by A.Y. Jackson, Ryerson Press, 1943.
  • Discoverer of Insulin - Dr. Frederick G. Banting by I.E. Levine, New York: Julian Messner, 1962.
  • Frederick Banting by Margaret Mason Shaw, Fitzhenry & Whiteside, 1976, ISBN 0-88902-229-1.
  • Sir Frederick Banting by Lloyd Stevenson, Ryerson Press, 1946.
  • Banting's miracle; the story of the discoverer of insulin by Seale Harris, Lippincott, 1946.
  • Elixir by Eric Walters, Puffin Canada, 2005, ISBN 0-14-301641-5.

మూలాలు

[మార్చు]
  1. us, Contact; Federation, International Diabetes. "World Diabetes Day | Diabetes: protect your family".
  2. "The history of the discovery of insulin". Portsmouth Daily Times. Archived from the original on 8 నవంబరు 2017. Retrieved 14 November 2019.
  3. ఆంధ్రభూమి, ఈ వారం స్పెషల్ (11 November 2017). "తేనె పూసిన కత్తి". www.andhrabhoomi.net. కృష్ణతేజ. Archived from the original on 15 జనవరి 2018. Retrieved 14 November 2019.

బయటి లింకులు

[మార్చు]