Jump to content

ప్రేమంటే ఇదేరా

వికీపీడియా నుండి
ప్రేమంటే ఇదేరా
దర్శకత్వంజయంత్ సి. పరాంజీ
రచనదీనారాజ్ (కథ) పరుచూరి సోదరులు (మాటలు)
నిర్మాతబూరుగుపల్లి శివరామకృష్ణ,
కొల్లా అశోక్ కుమార్
తారాగణంవెంకటేష్,
ప్రీతి జింటా
ఛాయాగ్రహణంజయంత్ విన్సెంట్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంరమణ గోగుల
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
అక్టోబరు 30, 1998 (1998-10-30)[1]
సినిమా నిడివి
168 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రేమంటే ఇదేరా 1998 లో జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో దగ్గుబాటి వెంకటేష్, ప్రీతి జింటా ముఖ్యపాత్రలు పోషించారు. రమణ గోగుల సంగీతాన్నందించాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాను కన్నడంలో ఓ ప్రేమవే అనే పేరుతో పునర్నిర్మించారు.

మురళి పట్నంలో వైద్య విద్యనభ్యసిస్తూ ఉంటాడు. తన స్నేహితుడు సత్యం పెళ్ళి కోసం మరో ఊరు వెళ్ళి అక్కడ శైలజ అమ్మాయితో పరిచయం అవుతుంది. శైలజ తాతకు ఉన్నట్టుండి వైద్య సహాయం కోసం పట్నం వెళ్ళవలసి వస్తుంది. సమయానికి వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో విద్యార్థిగా ఉన్న మురళినే శస్త్రచికిత్స చేసి ఆయన ప్రాణాలు కాపాడతాడు. మురళి, శైలజ ఒకరినొకరు ఇష్టపడతారు. ఈ లోపు శైలజ తండ్రి ఆమెకు తెలియకుండానే నిశ్చితార్థం ఏర్పాటు చేయిస్తాడు. అతని పేరు కూడా మురళినే. అతని తండ్రి శైలజ తండ్రిని కాపాడి ప్రాణాలు విడిస్తే ఆయన కృతజ్ఞతగా మురళిని పెంచి చదివించి పోలీసును చేస్తాడు. కుమార్తెనిచ్చి పెళ్ళి చేయడానికి నిశ్చయిస్తాడు. కానీ శైలజ మాత్రం డాక్టర్ మురళినే ప్రేమిస్తుంటుంది.

డాక్టర్ మురళి కూడా విషయం తెలుసుకుని బాధపడతాడు. కానీ ఎలాగైనా తన ప్రేమను దక్కించుకోవాలని శైలజ ఇంట్లోనే మకాం పెడతాడు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ పాటలు రాయగా రమణ గోగుల సంగీత దర్శకత్వం వహించాడు. అన్ని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.

  • ప్రేమంటే ఇదేరా
  • నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • ఏమో ఎక్కడుందో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • నైజాం బాబులు , రచన: చంద్రబోస్, గానం. మనో, స్వర్ణలత
  • బొంబాయి బొమ్మ సూడరో , రచన: చంద్రబోస్, గానం. రమణ గోగుల
  • వయసా చూసుకో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,చిత్ర
  • మనసే ఎదురు తిరిగి , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • ఓ మేరీ బుల్ బుల్ తారా , రచన:చంద్రబోస్ , గానం. రమణ గోగుల
  • థీమ్ మ్యూజిక్, గానం.రమణ గోగుల .

మూలాలు

[మార్చు]
  1. Prabhu (2019-10-30). "Venkatesh Premante Idera Completes 21 Years | Telugu Filmnagar". Thetelugufilmnagar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-17.