Jump to content

ప్రతిమా భూమిక్

వికీపీడియా నుండి
ప్రతిమా భూమిక్
ప్రతిమా భూమిక్


కేంద్ర సామాజిక న్యాయ & సాధికారత శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
7 జూలై 2021 – 11 జూన్ 2024
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు రతన్ లాల్ కటారియా

పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు శంకర్ ప్రసాద్ దత్తా
తరువాత విప్లవ్‌కుమార్ దేవ్
నియోజకవర్గం త్రిపుర పశ్చిమ

త్రిపుర శాసనసభ సభ్యురాలు
పదవీ కాలం
2 మార్చి 2023 – 15 మార్చి 2023
ముందు మాణిక్ సర్కార్
తరువాత బిందు దేబ్‌నాథ్
నియోజకవర్గం ధన్‌పూర్ నియోజకవర్గం

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి , త్రిపుర
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
6 జనవరి 2016
అధ్యక్షుడు విప్లవ్‌కుమార్ దేవ్
మాణిక్ సాహా

వ్యక్తిగత వివరాలు

జననం (1969-05-28) 1969 మే 28 (వయసు 55)
బర్నారాయణ్, సెపాహిజాల, త్రిపుర, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం అగర్తల, త్రిపుర , భారతదేశం
పూర్వ విద్యార్థి మహిళా కళాశాల, అగర్తల
మూలం [1]

ప్రతిమా భూమిక్ (జననం 28 మే 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె త్రిపుర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో త్రిపుర పశ్చిమ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై 7 జులై 2021 నుండి 11 జూన్ 2024 వరకు కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత శాఖ సహాయ మంత్రిగా పని చేసింది.[1][2]

ప్రతిమా భౌమిక్ త్రిపుర రాష్ట్రం నుండి కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చిన మొదటి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రతిమ భౌమిక్ 1991లో బిజెపి పార్టీలో చేరి ఆ తర్వాత బిజెపి రాష్ట్ర కమిటీలో సభ్యురాలిగా నియమితురాలైంది. ఆమె 1993లో బీజేపీ పార్టీ ధన్‌పూర్ మండల్‌కు చీఫ్‌గా, పార్టీ యువజన & మహిళా విభాగానికి ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి ఆ తర్వాత 2016లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైంది. ప్రతిమ భౌమిక్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో త్రిపుర పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి శంకర్ ప్రసాద్ దత్తాపై 305,689 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై 7 జులై 2021 నుండి 11 జూన్ 2024 వరకు కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత శాఖ సహాయ మంత్రిగా పని చేసింది.

ప్రతిమ భౌమిక్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ధన్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం 2023 మార్చి 15న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది.[4] ఆమెకు 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు.[5]

మూలాలు

[మార్చు]
  1. India Today (7 July 2021). "Modi cabinet rejig: Full list of new ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
  2. "Who is Pratima Bhoumik — Union minister who could be first woman Tripura CM? 10 things". 5 March 2023. Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
  3. The Indian Express (7 July 2021). "Pratima Bhowmik: First Tripura resident to make it to Union cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
  4. News18 (15 March 2023). "Union Minister Pratima Bhoumik Quits as MLA in Tripura" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. TimelineDaily (6 March 2024). "BJP Drops Pratima Bhoumik For Biplab Kumar Deb For Tripura West Lok Sabha Seat" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.