Jump to content

పెపె జీన్స్

వికీపీడియా నుండి
పెపె జీన్స్
తరహా'వస్త్రాలు
స్థాపనలండన్ (1973)
ప్రధానకేంద్రముసాన్ ఫెలియు డి ల్లోబ్రెగాట్, స్పెయిన్
పెపె జీన్స్

పెపె జీన్స్ లండన్ ఐరోపాకు చెందిన ఒక వస్త్ర వ్యాపార సంస్థ. 1989 లో స్థాపింపబడినప్పటి నుండి చాలా దేశాలకు ఈ సంస్థ వ్యాపింపబడింది.

చరిత్ర

[మార్చు]

1973 లో జీన్స్ దుస్తుల వ్యాపారవేత్త అయిన శాంతిలాల్ ప్రమర్ చమురు అంగడిలో పనిచేస్తున్న నితిన్ షాను వాయిదాల పద్ధతిలో జీన్స్ అమ్మకందారుగా మార్చాడు. జీన్స్ దుస్తుల వ్యాపారంలోని ఉతుకుట, వస్త్ర ఎంపిక, కుట్టటంలో మెళకువలను నేర్పాడు. దాని తర్వాత తన సొంత వ్యాపార స్థాపనకి నితిన్‌కు అతని సోదరులు అరుణ్, మిలన్ షాలు సహాయపడ్డారు. కెన్యాలో పుట్టిన ఈ సోదర త్రయం షోల్ మే లిమిటెడ్, పెపె జీన్స్ (Sholemay Ltd, Pepe Jeans) ని స్థాపించాలనే అలోచనకు వచ్చారు. కేవలం "పెపె" అయితే ఇంపుగా ఉంటుందని నిర్ణయించుకొన్నారు.

పశ్చిమ లండన్ లోని పోర్ట్ బెలో మార్గంలోని వ్యాపార సముదాయం లోని ఒక దుకాణంలో వారాంతాలు మాత్రం అమ్మకం జరిపేవారు. (అప్పటికి ముగ్గురికీ ఉద్యోగాలు ఉండేవి.) వారి వ్యాపారం వృద్ధి చెందటం గమనించిన శాంతిలాల్ ప్రమర్ (నితిన్ కి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి) వారి దుకాణంలో జీన్స్ ని అమ్మకానికి ఇచ్చేవాడు. 1975 కి లండన్ లోని నాలుగు ప్రదేశాల్లో వీరి దుకాణాలు ఉండేవి. జీన్స్ కి అప్పట్లో ఉన్న ఆదరణకి వారు పెపె జీన్స్ బొటీక్ ని కింగ్స్ మార్గంలో తెరిచారు. కార్నబీ స్ట్రీట్ లో 25,000 అడుగుల స్థలంలో మరొక బొటీక్ ని, ఆవన్ మోర్ ట్రేడింగ్ ఎస్టేట్ లో కార్మాగారాన్ని నెలకొల్పారు. 1980 నాటికి ఐరోపా లోనే పేరొందింది. 1989 కి అన్ని అమెరికన్ బ్రాండులని మించిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న చిహ్నము 1992 లో రూపొందించబడింది.

ఇతర జీన్స్ బ్రాండుల వలె కాకుండా పెపె వస్త్రాలను స్వయంగా తయారు చేస్తుంది.

భారతదేశం లోని ప్రజానీకానికి అందుబాటులో ఉన్న పెపె జీన్స్ వస్త్ర శ్రేణి

[మార్చు]

పురుషులకు

[మార్చు]
  • కంఫర్ట్: రెగ్యులర్, రిలాక్స్డ్, స్ట్రెయిట్
  • హోల్బోర్నె: లో, స్లిం, స్ట్రెయిట్
  • లండన్: లో, రెగ్యులర్, స్ట్రెయిట్

స్త్రీలకు

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]