Jump to content

పెంచికల్‌పేట్ మండలం (కొమరంభీం జిల్లా)

వికీపీడియా నుండి
పెంచికల్‌పేట్
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, పెంచికల్‌పేట్ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, పెంచికల్‌పేట్ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, పెంచికల్‌పేట్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం పెంచికల్‌పేట్
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ 504296


పెంచికల్‌పేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1] 2016లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 17 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది. ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 36 కి. మీ. దూరంలో ఉంది. సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం పరిధి క్రిందకు వస్తుంది. ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు

[మార్చు]

ఇంతకుముందు పెంచికల్‌పేట్ గ్రామం అదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోని బెజ్జూరు మండల పరిధిలో ఉంది. 2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెంచికల్‌పేట్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన కొమరంభీం జిల్లా, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+17 (పద్నెనిమిది) గ్రామాలతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]

గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 213 చ.కి.మీ. కాగా, జనాభా 15,038. జనాభాలో పురుషులు 7,521 కాగా, స్త్రీల సంఖ్య 7,517. మండలంలో 3,737 గృహాలున్నాయి.[5]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అగర్‌గూడ
  2. కమ్మెర్‌గావ్
  3. కొండపల్లి
  4. కోయచిచల్
  5. గన్నారం
  6. గుండేపల్లి
  7. గుంట్లపేట్
  8. జిల్లెడ
  9. నందిగావ్
  10. పెంచికల్‌పేట్
  11. పోతేపల్లి
  12. బొంబాయిగూడ
  13. మురళిగూడ
  14. యెల్కపల్లి
  15. యెల్లూర్
  16. చెద్వాయి
  17. లోద్‌పల్లి

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-27.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]