Jump to content

పుష్పదంతుడు

వికీపీడియా నుండి

పుష్పదంతుడు మాహా పేరుగాంచిన జైన కవి. ఇతడు సా.శ 9 వ శతాబ్దము ఉత్తరభాగములో జీవించినట్లు చెప్పుదురు. ఇతడు తొలుత శైవ బ్రాహ్మణుడు. కాశ్యప గోత్రుడు. తండ్రి కేశావభట్టు; తల్లి ముగ్ధాదేవి. ఇతనికే ఖండు డను నామాంతర ముండెను. నాడు "మన్యఖేటము" రాష్ట్రకూటములకు ముఖ్య పట్టణం. మూడవ కృష్ణ రాయడు రాజు. అతని మంత్రి భరతుడు. పుష్పదంతుడు వీరి ఆదరముచే పలు రచనలు వ్రాసినాడు. ఆకాలమున పుష్పదంతుడు మహాప్రసిద్ధుడు. అతనికి సుమారొక పదిపదునేడు బిరుదులుండేవట. అన్నిటికన్నను ముఖ్యముగ "అభిమానమేరు" డను బిరుదు ఎక్కువగా ప్రాచుర్యత పొందినది.

జ స హ ర చ రి వు

[మార్చు]

పుష్పదంతుడు వ్రాసిన వాటిలో పెక్కు పేరుగాంచిన రచనలలో ముఖ్యమైనది ఈ జసహరచరివు. దీనినే యశోధర చరిత్ర అంటారు. ఇది యశోధరుడను రాజు జైనుడిగా మారిన కథ. దీనిక్ జకినవాజ్మయమున గల వ్యాపృతి చాల పెద్దది. ఇది ఒక చక్కని గేయకావ్యమని అనవచ్చును. ఆ గేయములకు అపభ్రంశమున "కదావకము" లని పేరు. అవికాక కొన్ని గీతములంటివే అగు "దువయీ" వృతాములను, అక్కడక్కడ "ఘత్తా" చందములను ఉన్నాయి. ఈ "ఘత్తా" చందములు గీర్వాణమున ఆర్యావృత్తములంటివి. ఈ కావ్యంతయు ఒక పాటవలె చల్లని వెన్నెలలో హాయిగా పాడుకొనుటకు అనుకూలముగా నుండును.

పుష్పదంతుడు సమయానుకూల రచనయందు జాల గడుసరి. విషయమునకు తగినట్లు శైలినెకాక చందములను కూడా మార్చగల నేర్పరి. ఈ కావ్యమునందు కనబడు మరియొక ఆశ్చర్యకర గుణము సంకుచీకరణము (Brevity) " అల్ప శబ్దములను అనల్పార్ధ రచన కల్పించుట" ఈకవికిష్టమైనది. ఒక్క పదము వ్యర్ధము కాకుండా, నొక వాక్యమే సుమారొక ఘట్టమునకంతకు దీప్తినిచ్చును.

పుష్పదంతుడు మహాకవి. అపభ్రంశము - ముఖ్యముగా ప్రాకృతములు ప్రచలిత భాషలుగా అవునేమో అని భయపడి ఏమో గాని మనకు ఇప్పుడు ఈ భాషలయందు రచించిన సుందరమగు కావ్యములు అలభ్యములైనవి.

మూలాలు

[మార్చు]
  • పుష్పదంతుని గురించి [1]
  • పుష్పదంతుని గురించి [2]
  • పుష్పదంతుని గురించి [3][permanent dead link]