Jump to content

పులపర్తి నారాయణ మూర్తి

వికీపీడియా నుండి
పులపర్తి నారాయణ మూర్తి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2019
నియోజకవర్గం పి.గన్నవరం నియోజకవర్గం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1996 – 1999
నియోజకవర్గం నగరం శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1954
ముంగండ, పి.గన్నవరం మండలం, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2022 జులై 7
అమలాపురం
విశ్రాంతి స్థలం ముంగండ
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
సంతానం ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు

పులపర్తి నారాయణ మూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పి.గన్నవరం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

మరణం

[మార్చు]

పులపర్తి నారాయణ మూర్తి గుండెపోటు రావడంతో అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2022 జులై 7 మరణించాడు. ఆయనకు భార్య, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

పులపర్తి నారాయణ మూర్తి రాజకీయాల్లోకి రాకముందు 21 ఏళ్ల పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేశాడు. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1996లో నగరం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2004లో తెదేపా - బీజేపీ పొత్తులో భాగంగా నగరం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

పులపర్తి నారాయణ మూర్తి 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పి.గన్నవరం నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయనకు 2019లో టీడీపీ టికెట్ కేటాయించకపోవడంతో భారతీయ జనతా పార్టీలో చేరాడు.

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (7 July 2022). "మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి కన్నుమూత". Archived from the original on 7 July 2022. Retrieved 7 July 2022.
  2. Prajasakti (7 July 2022). "పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి మృతి" (in ఇంగ్లీష్). Archived from the original on 7 July 2022. Retrieved 7 July 2022.