పుట్టింటి గౌరవం (1996 సినిమా)
స్వరూపం
పుట్టింటి గౌరవం (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయనిర్మల |
---|---|
తారాగణం | కృష్ణ, సౌందర్య |
సంగీతం | యమ్. సురేష్ |
నిర్మాణ సంస్థ | సాయి మహేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పుట్టింటి గౌరవం 1996 ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు సినిమా. సాయి మహేష్ ప్రొడక్షన్స్ పతాకం కింద జి.ఉమామహేష్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. కృష్ణ సౌందర్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.[1]
ఒక కన్నడ చిత్రం ఆధారంగా తీసిన ఈ చిత్రానికి కథానాయకుడు కృష్ణ. సిద్ధాంత అనే పాత్రలో తన భార్య జ్యోతి (సౌందర్య) పుట్టింటి గౌరవం నిలపడానికి, కాపాడటానికి చేసిన త్యాగమే ఈ కథా రూపం. చిత్రం భార్యా భర్తలు ఇరువురి మరణంతో దుఃఖాంతంగా ముగుస్తుంది.
చిత్రాన్ని సంగీత భరితంగా రూపు దిద్దాలన్న ఆకాంక్షతో దర్శకురాలు విజయనిర్మల దాదాపు తొమ్మిది పాటలని దీనిలో పొందుపరిచారు.
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- సౌందర్య
- జె.వి. సోమయాజులు
- తనికెళ్ళ భరణి
- ప్రసాద్ బాబు
- చంద్రమోహన్
- పి.ఎల్. నారాయణ
- ఎ. వి. ఎస్
- కాంతా రావు
- అన్నపూర్ణ (నటి)
- విజయలలిత
- సిల్క్ స్మిత
- సుధ
- లతాశ్రీ
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: పరచూరి బ్రదర్స్
- సంగీతం: మాధవపెద్ది సురేష్
- ఫోటోగ్రఫీ: వి.శ్రీనివాసరెడ్ది
- నిర్మాత: జి.ఉమామహేష్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయనిర్మల
మూలాలు
[మార్చు]- ↑ "Puttinti Gowravam (1996)". Indiancine.ma. Retrieved 2023-07-29.