Jump to content

పారాహుషార్

వికీపీడియా నుండి

పారాహుషార్ కార్టూనిస్ట్ శేఖర్ వ్రాసిన తెలుగు కార్టూన్ పుస్తకం. శేఖర్ కార్టూన్లు నవ్వించేవే కాదు, లోతుగా ఆలోచింపజేస్తాయి కూడా. పారాహుషార్ పుస్తకం రాజకీయ నేపథ్యంతో చురకలు వేస్తూ కార్టూన్లను పుస్తక రూపంలో తీసుకు వచ్చాడు శేఖర్.

సమాజాన్ని పట్టిపీడిస్తున్న చీడపురుగుల గురించి, సమాజ మార్పుకోసం ఉపయొగ పడే అద్భుతమైన కార్టూన్ లు పారాహుషార్ అనే ఈ పుస్తకంతో మనకు అందిస్తున్నాడు శేఖర్. పారాహుషార్ పుస్తకం లోని కార్టూన్లు మొహం పై నవ్వు పుట్టించి, గుండె లోతుల్లో ఆలోచన పుట్టించి, మనల్సి మౌనంగా వెంటాడే కవితలే ఈ కార్టూన్లు. ప్రజాశక్తి, ఆంధ్ర ప్రభ దిన పత్రికలలొ వేసిన కార్టూన్లలో ఎంపిక చేసినవి శేఖర్ పారాహుషార్ లో పొందుపరిచాడు. పారాహుషార్ పుస్తకంలోని కార్టూన్లు దాదాపుగా నేటి ప్రపంచంలొని అన్నీ అంశాలను స్మ్రుశిస్తున్నాయి. రాజకీయాంశాలపై చురుకుమనే నవ్వుల తునకలను పారాహుషార్ పుస్తకం ద్వారా శేఖర్ మనకు అందించాడు.

చరిత్ర

[మార్చు]

పారాహుషార్ కార్టూనిస్ట్ శేఖర్ నవంబర్ 2003 న వ్రాసాడు. 2004లో మొదటి ముద్రణ వెలువడింది. చేతన పబ్లిషర్స్ పబ్లిష్ చేసారు. పారాహుషార్ పుస్తకాన్ని కె.వి. రమణా చారి, ఐ. వెంకట్రావు ఆవిష్కరించాడు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]