Jump to content

పల్లా శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
పల్లా శ్రీనివాస రావు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 14 - ప్రస్తుతం
ముందు కింజరాపు అచ్చెన్నాయుడు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు తిప్పల నాగిరెడ్డి
నియోజకవర్గం గాజువాక

వ్యక్తిగత వివరాలు

జననం 1969
గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజా రాజ్యం పార్టీ
తల్లిదండ్రులు పల్లా సింహాచలం
జీవిత భాగస్వామి లావణ్య దేవి
సంతానం అంజనా కృష్ణశ్రీ, దేవ్ శ్రీకృష్ణ సింహ
నివాసం డో.నెం. 9-1-177, హై స్కూల్ రోడ్, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్షుడు
వృత్తి రాజకీయ నాయకుడు

పల్లా శ్రీనివాస రావు యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గాజువాక నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

పల్లా శ్రీనివాస రావు ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా విశాఖపట్నం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి చేతిలో 66,686 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పని చేశాడు.

పల్లా శ్రీనివాస రావు 2014లో జరిగిన శాసనససభ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై 21,712 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆ తరువాత 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ తిప్పల నాగిరెడ్డి చేతిలో 16,753 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2012లో జరిగిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వార్డ్ నెం 67 నుండి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు.[3] ఆయన విశాఖ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా 2020 నుంచి 2024 ఎన్నికల వరకు పని చేశాడు.  పల్లా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం నిర్వహించాడు.

పల్లా శ్రీనివాస రావు 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గాజువాక నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ గుడివాడ అమర్‌నాథ్‌పై 95235 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[4][5] ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా నిలిచాడు.[6] ఆయనను 2024 జూన్ 14న ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్ఠానం నియమించింది.[7][8]  

మూలాలు

[మార్చు]
  1. Prajasakti (4 June 2024). "గాజువాకలో పల్లా విజయం". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. "ORDINARY ELECTIONS TO URBAN LOCAL BODIES - 2021" (PDF). 14 June 2024. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2023. Retrieved 14 June 2024.
  4. Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Gajuwaka". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  5. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  6. NTV Telugu (5 June 2024). "ఏపీలో మెజారిటీ వారీగా గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే.. టాప్ 3లో నారా లోకేష్!". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  7. Prabha News (14 June 2024). "టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు." Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  8. Eenadu (17 June 2024). "తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.