పర్ణశాల (నవల)
స్వరూపం
పర్ణశాల | |
కృతికర్త: | యండమూరి వీరేంద్రనాథ్ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రచురణ: | |
విడుదల: |
పర్ణశాల యండమూరి వీరేంద్రనాధ్ యొక్క అనేక నవలలో అత్యధిక పాఠకుల ఆదరణ పొందిన పుస్తకం.
కథనం, పాత్రలు
[మార్చు]- కిరణ్మయి... డబ్బుంటేనే లేదా డబ్బుతోనే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పుడతాయి ప్రదర్శించబడతాయి.
- చైతన్య... ప్రేమ, ఆప్యాయతలకు డబ్బొకటే కారణం కాదు.
- కాంతిమతి... డబ్బు లేనపుడు సుఖాలకోసం డబ్బున్నవైపు పరుగెట్టడం తప్పుకాదు.
- శారద... డబ్బులేకుడా కూడా ప్రేమ, ఆప్యాయతలు నిలుపుకోవచ్చు.
- రవి... డబ్బు మనను కాపాడినంతవరకూ పర్వాలేదు. డబ్బును మనం కాపాడటంతోనే సమస్యంతా.
- కౌసల్య... డబ్బుతో నిమిత్తం లేకుండా అందరూ మంచివారే.
ఇలా ప్రవర్తించే పాత్రలు చివరికి వారి ఆలోచనలకు విరుద్దమైన అభిప్రాయాలను ఏర్పరుచుకొనేలా సాగేలా రచించబడిన నవల పర్ణశాల. విశాఖ సముద్రతీరాన్ని నేపద్యంగా తీసుకొని రచయిత మనుషులు కూడా సముద్రంలో వాతావరణాన్ని అనుసరించి వలసలు సాగించే రొయ్యలలా తమ స్వార్ధం కోసం జీవితంలో ఎలా మారిపోతూసాగుతారో వివరిస్తాడు.