Jump to content

లంగా

వికీపీడియా నుండి
(పరికిణి నుండి దారిమార్పు చెందింది)
లంగా ధరించిన భారతీయ నటి అంజనా సుఖానీ
నీలం, ఎరుపు రంగుల లంగాలు ధరించిన బాలికలు

లంగా భారతీయ స్త్రీలు ధరించే ఒక రకమైన దుస్తుల లో ఒకటి. దీనిని గాగ్రా లేదా చనియా, పావడై అని కూడా ప్రాంతాలను బట్టి పిలుస్తారు. ఇది నడుం నుండి పాదాల వరకు మహిళలు ధరించే స్కట్ వంటింది.[1] [2] ఇది భారత ఉపఖండంలో అనేక ప్రాంతాలలో ధరిస్తారు.[3]

విశేషాలు

[మార్చు]

లంగాకు నాడాలు ఉంటాయి. ముడి నడుముకి కుడివైపు వచ్చేలా కడతారు. ఈ ముడిని నడుము కుడి భాగం నుండి ఎడమ భుజం వైపుకి వెళ్ళే పైట కప్పివేస్తుంది. లంగాలు రెండు రకాలు. లోపలి లంగా, పై లంగా (పావడ/పరికిణీ) . హిందూ మతంలో బాలికలు ధరించే సంప్రదాయక దుస్తులలో కూడా లంగా ఒకటి.

పెళ్ళైనవారు చీర లోపల కనిపించకుండా ధరిస్తారు. ఇది సామాన్యంగా నూలుతో చేసినదై ఉంటుంది.

అయితే పెళ్ళికి ముందు లంగా ఓణిలు కలిపి ధరించడం ఆంధ్రదేశంలో సాంప్రదాయంగా ఉండేది. ఇవి పండుగలలో పట్టుతో చేసి వివిధ రంగులలో అంచులతో అందంగా కనిపిస్తాయి. పైలంగాలను పైట లోపల, బయటికి కనిపించేలా (లోపలి లంగా పైన) ధరిస్తారు.

ముఖ్యంగా బాలీవుడ్ గా ప్రసిద్ది చెందిన భారతీయ హిందీ చిత్ర పరిశ్రమ ప్రభావం కారణంగా మహిళలు ధరిస్తుంటారు. [4]

చిత్ర మాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "lehnga". OxfordDictionaries.com. Oxford University Press. 2018. Archived from the original on 2018-06-26. Retrieved 2018-06-26.
  2. Fashions from India - Tom Tierney
  3. "Indian Lehenga Choli - Its Origin, History And More". Utsavpedia. 2017-03-18. Retrieved 2020-12-14.
  4. John, Jose Kalapura (2000). Proceedings of the Indian History Congress, Vol. 61. Indian History Congress. p. 1018.
"https://te.wikipedia.org/w/index.php?title=లంగా&oldid=4340252" నుండి వెలికితీశారు