స్త్రీ

స్త్రీ లేదా మహిళ అనగా ఆడ మనిషి. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. యుక్తవయసు వచ్చేంతవరకు ఆడపిల్లలను బాలికలు అనడం సాంప్రదాయం. మహిళా హక్కులు (Woman Rights) మొదలైన కొన్ని సందర్భాలలో దీనిని వయస్సుతో సంబంధం లేకుండా వాడతారు.
జీవశాస్త్రంలో స్త్రీ
[మార్చు]

జీవశాస్త్రం ప్రకారం, స్త్రీ జననేంద్రియాలు ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగపడతాయి. అండాశయాలు హార్మోనులను తయారు చేయడమే కాకుండా అండం విడుదలకు మూలం. ఫలదీకరణంలో భాగంగా అండం, పురుష శుక్ర కణాలతో సంయోగం చెంది, పిండంగా మారడానికి గర్భం చేరి, తద్వారా కొత్త తరం జీవులను తయారు చేస్తాయి. గర్భాశయం పెరుగుతున్న పిండాన్ని రక్షించి కొంత పెరుగుదల వచ్చిన తర్వాత కండరాల సహాయంతో బయటకు పంపిస్తుంది. యోని పురుష సంయోగానికి, పిండం జన్మించడానికి తోడ్పడుతుంది. వక్షోజాలు వంటి ద్వితీయ స్త్రీలింగ లక్షణాలు పిల్లల పోషణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చర్మ గ్రంధుల నుండి అభివృద్ధిచెందిన పాల గ్రంధులు క్షీరదాల ముఖ్యమైన లక్షణము. ఎక్కువమంది స్త్రీల కారియోటైపు 46, XX, అదే పురుషుల కారియోటైపు 46, XY. ఇందువలన X క్రోమోసోము, Y క్రోమోసోములను క్రమంగా స్త్రీ, పురుష క్రోమోసోములు అంటారు.

అయితే కొజ్జాలలో (Intersex) ఈ విధమైన జీవ లక్షణాలు మాత్రమే సరిపోవు. జన్యు నిర్మాణం, జననేంద్రియ నిర్మాణాలతో సహా వారి సాంఘిక, వ్యక్తిగత విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. చాలా మంది స్త్రీలు ఋతుచక్రం ప్రారంభమైన సమయం (రజస్వల) నుండి గర్భం దాల్చగలరు.[1] ఇది సామాన్యంగా పురుషుని వీర్యకణాల వలన జరిగినా, శాస్త్ర అభివృద్ధి వలన ఆధునిక కాలంలో కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా కూడా గర్భం దాల్చే అవకాశం కలిగింది. ఋతుచక్రాలు పూర్తిగా ఆగిపోయిన మెనోపాస్ తర్వాత అండాల తయారీ ఆగిపోయి స్త్రీ గర్భం దాల్చే అవకాశం ఉండదు. స్త్రీల వ్యాధుల శాస్త్రాన్ని గైనకాలజీ (Gynaecology), గర్భ సంబంధమైన శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు. స్త్రీ పురుషులిద్దరూ ఒకే రకమైన వ్యాధులు వస్తాయి. అయితే కొన్ని రకాల వ్యాధులు స్త్రీలలో ఎక్కువగా వస్తాయి. ఉదా: అవటు గ్రంధి సంబంధ వ్యాధులు.
సమాజంలో స్త్రీల పాత్ర
[మార్చు]ముదిత అనగా స్త్రీ . ముదితల్ నేర్వగా రాని విద్య కలదే ముద్దర నేర్పించినన్ ఎక్కడితే స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశం సస్యస్యామలంగ వుంటుంది. అందుకే ఒక కవి స్త్రీ గురించి ఇలా రాసాడు బ్రతుకు ముల్లబాటలోన్ జతగా స్నేహితురాలవయ్తివి....కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి....వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యవైతివి....పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి.....అని అన్నారు. కష్టంలో ముందుండి.... సుఖంలో క్రిందుండి....విజయంలో వెనకుండి ....ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ. స్త్రీని పూర్వ కాలంలో అబల అనగా బలం లేనిది అనేవారు. పూర్వం స్త్రీలు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు చేసుకొనేవారు. వివాహితలు ఇంటిని చక్కదిద్దుకుంటూ భర్త, పిల్లల యొక్క బాగోగులు చూసుకొనేవారు. ఆ విధంగా గృహిణి పాత్ర నూరు శాతం వహించేది. యుద్ధానికి వెళ్ళే పురుషులను ఆశీర్వదించేవారు. కాని నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ, పురుషుల పరిమితమైన విజయాల్ని సైతం దక్కించుకుంటున్నారు, పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఆధునిక కాలంలో ఆడది అబల కాదు 'సబల' అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు. నేటి స్త్రీ ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొకుంటోంది. అయితే స్త్రీ సాధికారత వల్ల గృహిణి పాత్ర మాత్రం కాస్త తక్కువైందని, పిల్లలకు తల్లి శిక్షణ కొరవడిందని, స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ దుర్వినియోగం వల్ల కుటుంబ వ్యవస్థ కాస్త బలహీన పడింది అని చెప్పవచ్చు.
ప్రతి సంవత్సరం అక్టోబరు 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించబడుతోంది.[2]
స్థానిక సంస్థల్లో స్త్రీలకు 50 శాతం సీట్లు
[మార్చు]
స్థానిక సంస్థల్లో యాభై శాతం స్థానాలు మహిళలకు కేటాయిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ రాజ్యాంగపరంగా స్థానిక సంస్థల్లో ఉన్న33 శాతం స్థానాలను యాభై శాతం వరకు పెంచే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఛత్తీస్‌గఢ్, బీహార్, మహారాష్ట్ర రాష్ట్రాలు 33 శాతం కంటే ఎక్కువగా పెంచాయి. ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒక మహిళ తప్పనిసరిగా ఉండే పరిస్థితులు రానున్నాయి.పురుషులతో పోలిస్తే మహిళలు ఆచితూచి అడుగువేస్తారు. విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉంటారు. దీర్ఘకాలిక ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తారు. ఏకాభిప్రాయసాధకులుగా, అందరినీ సమాధాన పరచగలిగే వారథులుగా మహిళలది ప్రత్యేక శైలి. అదివారికి జన్మతః వచ్చిన లక్షణం.[3]
తగ్గుతున్న స్త్రీల జనాభా
[మార్చు]మాతృస్వామ్యంలో అవతరించి పితృస్వామ్య వ్యవస్థకు మారింది దేశీయ సంస్కృతి. మహిళల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. పురుషాధిక్యత పెరుగుతోంది. గతంలో ఎవరింట్లోనైనా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోయేవారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటి భావిస్తున్నారు. ఆడపిల్లలైతే చదువులు, కట్నాలు ఇచ్చి వివాహం చేయాలని అనంతరం ఏ సమస్య తలెత్తినా తామే పరిష్కరించాల్సి వస్తుందని తల్లిదండ్రులు భావించడంతో ఆడపిల్లల పై ప్రేమానురాగాలు తగ్గాయి. ఇదే తరుణంలో మగపిల్లల పై మోజు పెరిగింది. విద్యాబుద్ధులు నేర్పిస్తే ఉద్యోగం చేసి తమను పోషిస్తాడని అంతేకాక లక్షలాది రూపాయల కట్నం తెస్తాడని, తమను పున్నామ నరకం నుండి రక్షిస్తాడని భావించారు. దీంతో తల్లి గర్బంలోనే పిండం ప్రాణం పోసుకుంటున్న దశలో స్కానింగ్‌లు తీయించి పాప అయితే గర్భవిచ్ఛిన్నం చేయించుతున్నారు.
- ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను క లిగి ఉన్న భారత్... స్త్రీ, పురుషులను సమానంగా చూసేవిషయంలో మాత్రం అట్టడుగున ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన సూచి వెల్లడించింది. భారత్‌లో ఆడ శిశువులను గర్భంలోనే చంపేస్తున్నారని, 2.5 కోట్ల మంది ఆడపిల్లలు భూ మ్మీదకు రాకముందే హత్యకు గు రయ్యారని నోబెల్ బహుమతి గ్ర హీత అమర్త్యసేన్ వెలిబుచ్చిన ఆందోళనలను ఇది నిర్ధారించింది. 134 దేశాలపై రూపొందించిన ఈ సూచిలో భారత్ 114వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్, శ్రీలంక, నే పాల్ దేశాలు సైతం ఈ సూచీలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.[4]
- పురుషులతో పోలిస్తే మహిళలకే వ్యవసాయ భూములు తక్కువగా ఉన్నాయి. చాలాచోట్ల అసలు మహిళలకు వ్యవసాయ భూమి అనేదే లేదు.. తమ పేరుమీద వ్యవసాయ భూములున్నవారు మనదేశంలో మొత్తం 119 లక్షల మంది ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 9.21 శాతంగా మాత్రమే[5]
ఆంధ్రప్రదేశ్ లో
[మార్చు]- ఆడజన్మపై ద్వేషం పెరుగుతోంది.1901లో 1,000 మంది పురుషులకుగాను 985 మంది మహిళలు ఉండేవారు. వందేళ్ల తరువాత... అంటే 2001లో ఈ నిష్పత్తి 978కి తగ్గిపోయింది. కానీ 2001 నుంచి 2010 మధ్యకాలంలో ఇది ఏకంగా 876కు పడిపోయింది.[6]
స్త్రీవాదం
[మార్చు]తెలుగు సాహిత్యంలో రెండు ఉద్యమాలు వ్యాప్తిచెందాయి. అందులో ఒకటి స్త్రీవాద ఉద్యమం లేదా స్త్రీవాదం (Feminism). స్త్రీవాద ఉద్యమం సాహిత్యానికి పరిమితమై స్త్రీలకు సామాజికపరమైన న్యాయం కోసం మొదలయ్యాయి.
భారతదేశ జనాభాలో సగంమంది స్త్రీలున్నా సాంఘికంగా స్త్రీ సమాజంలో మోసగింపబడుతోంది. కేవలం ఒక పనిముట్టుగా చూడబడుతుంది. వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉండటం లేదు. మత గ్రంథాలలోను, సాహిత్యంలో కూడా స్త్రీ నీచంగా చిత్రించబడింది. వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీని ఒక ఆటబొమ్మగా సెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు. అన్ని చోట్లా పురుషాధిక్యత తాండవిస్తోంది. కాబట్టి స్త్రీకి సాంఘిక న్యాయం చేకూరాలని స్త్రీవాదం బయలుదేరింది.
మహిళా అర్చకులు
[మార్చు]- మహిళలను బిషప్‌లుగా అనుమతించాలని ఇంగ్లండ్ చర్చి నిర్ణయించింది.[7]
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఋగ్వేదకాలం స్త్రీలు
- నోబెల్ బహుమతి పొందిన స్త్రీలు
- ఆదర్శ వనితలు
- ఫార్చ్యూన్ 500 కంపెనీలు మహిళా (సిఈఒ) జాబితా
- భారతదేశంలో మహిళలు
- గృహలక్ష్మి స్వర్ణకంకణము
- తెలుగు సాహిత్యంలో మహిళలు
మూలాలు
[మార్చు]- ↑ Menarche and menstruation are absent in many of the intersex and transgender conditions mentioned above and also in primary amenorrhea.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (11 October 2019). "నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం". www.andhrajyothy.com. Archived from the original on 11 October 2020. Retrieved 11 October 2020.
- ↑ (ఈనాడు6.9.2010)
- ↑ ఆంధ్రజ్యోతి11.11.2009
- ↑ ఈనాడు 22.2.2010
- ↑ సాక్షి 17.8.2010
- ↑ ఈనాడు 14.7..2010