గృహలక్ష్మి స్వర్ణకంకణము
స్వరూపం
20వ శతాబ్దంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు కె.యన్. కేసరి స్త్రీల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేరు. 1924 లో గృహలక్ష్మి మాసపత్రిక స్థాపించి స్త్రీవిద్యకీ, రచనావ్యాసంగానికి కృషి చేసేరు. 1934లో స్వర్ణకంకణము పురస్కారము ప్రారంభించి సాహిత్య, సాంస్కృతిక, తదితర రంగాలలో విశిష్టసేవ చేసిన స్త్రీలను సత్కరిస్తున్నారు. ఆధునిక యుగంలో స్త్రీలని క్రమపద్ధతిలో ఏటా సత్కరించడం ఈ స్వర్ణకంకణముతో మొదలయింది. స్వర్ణకంకణముతో సత్కారం పొందిన మహిళలు
- కనుపర్తి వరలక్ష్మమ్మ (1934)
- చిలకపాటి సీతాంబ (1935)
- కాంచనపల్లి కనకమ్మ (1936)
- పులవర్తి కమలావతి (1937)
- బాలాంత్రపు శేషమ్మ, రత్నాల కమలాబాయి (1938)
- వి. రాధామనోహరి, చేబ్రోలు సరస్వతీదేవి (1940)
- బత్తుల కామాక్షమ్మ (1941)
- ఉన్నవ లక్ష్మీబాయమ్మ (1948)
- బెంగుళూరు నాగరత్నమ్మ (1949)
- గిడుగు లక్ష్మీకాంతమ్మ (1951)
- స్థానాపతి రుక్మిణమ్మ (1952)
- ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ (1953)
- పొణకా కనకమ్మ(1955)
- కొమ్మూరి పద్మావతీదేవి (1956)
- కె. రామలక్ష్మి(1957)
- దేశిరాజు భారతీదేవి(1958)
- గుడిపూడి ఇందుమతీదేవి (1959)
- కానుకొల్లు చంద్రమతి(1960)
- ఎ. కనకదుర్గా రామచంద్రన్ (1961)
1962, 1963 సంవత్సరాలలో బహుమతులు ఇవ్వలేదు.
- ఇల్లిందల సరస్వతీదేవి (1964)
- తెన్నేటి హేమలత (1965)
- ద్వివేదుల విశాలాక్షి (1966)
- కోడూరి కౌసల్యాదేవి (1967)
- ముప్పాళ్ళ రంగనాయకమ్మ (1968)
- యద్దనపూడి సులోచనారాణి (1969)
- ఐ.వి.యస్. అచ్యుతవల్లి (1970)
- డి. కామేశ్వరి (1971)
- సి. ఆనందారామం (1972)
- కోడూరి లీలావతి (1974)
- ద్వారక పార్థసారథి (1975)
- వాసిరెడ్డి సీతాదేవి (1976)
- గుళ్ళపల్లి సుందరమ్మ (1977)
- మాదిరెడ్డి సులోచన (1978)
- తురగా జానకీరాణి (1982)
- అవసరాల (వింజమూరి) సీతాదేవి (1984)
- జె.భాగ్యలక్ష్మి (1986)
- నాయని కృష్ణకుమారి
- వేదుల మీనాక్షీదేవి
- మాలతీ చందూర్
- ఉన్నవ విజయలక్ష్మి
- పోలాప్రగడ రాజ్యలక్ష్మి
- శారదా అశోకవర్థన్
- వాసా ప్రభావతి
వనరులు
[మార్చు]- కె.యన్. కేసరి. చిన్ననాటి ముచ్చట్లు, కేసరి కుటీరము, మద్రాసు, 1999
- కె. రామలక్ష్మి. ఆంధ్ర రచయిత్రుల సమాచారసూచిక. ఆంధ్రప్రదేశ్ ఎకాడమీ, 1968
- యద్దనపూడి సులోచనారాణి, వాసా ప్రబావతి. నేనూ, నారచనలు. లేఖిని ప్రచురణ, 2013
బయటి లింకులు
[మార్చు]- కె.యన్. కేసరిగారి చిన్ననాటి ముచ్చట్లు
- గృహలక్ష్మి స్వర్ణకంకణము
- గూడ సుమిత్రాదేవి. స్వర్ణకంకణం గ్రహీతలు. సిద్ధాంత గ్రంథం. 1988.
- గృహలక్ష్మీ స్వర్ణకంకణం గ్రహీతలమీద లక్ష్మీదేవి వ్యాసం.