పరాశర సరస్సు
పరాశర సరస్సు లేదా కమ్రునాగ్ సరస్సు | |
---|---|
ప్రదేశం | మండీ జిల్లా |
అక్షాంశ,రేఖాంశాలు | 31°45′15″N 77°06′05″E / 31.75426°N 77.10141°E |
సరస్సులోకి ప్రవాహం | వర్షపు నీరు |
వెలుపలికి ప్రవాహం | భాష్పీభవనం |
ఉపరితల వైశాల్యం | 1 హె. (2.5 ఎకరం) |
సరాసరి లోతు | కనుగొనబడలేదు |
గరిష్ట లోతు | కనుగొనబడలేదు |
ఉపరితల ఎత్తు | 2,730 మీ. (8,960 అ.) |
మూలాలు | Himachal Pradesh Tourism Dep. |
పరాశర సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నగారానికి తూర్పున 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని కమ్రునాగ్ సరస్సు అని కూడా అంటారు. పరాశరుడు అనే సాధువు ఈ ప్రదేశంలో ధ్యానం చేయడం వలన ఈ సరస్సుకు అతడి పేరు వచ్చింది.[1]
భౌగోళికం
[మార్చు]ఈ సరస్సు సముద్ర మట్టానికి 2,730 మీ (8,960 అడుగులు) ఎత్తులో ఉంది. దీని చుట్టూ వేగంగా ప్రవహించే బియాస్ నది, మంచుతో కప్పబడిన పర్వతాలు ఉన్నాయి.[2]
ప్రత్యేకత
[మార్చు]సరస్సును మండీ నుండి లేదా కుల్లు జిల్లాలోని బజౌరా నుండి చేరుకోవచ్చు. సరస్సులో ఒక గుండ్రని, తేలియాడే భూభాగం ఉంది. ఈ భూభాగం కొన్ని మొక్కలతో, కుళ్ళిపోయిన వివిధ పదార్ధాలతో కూడి ఉంటుంది. ఈ తేలియాడే ద్వీపం సరస్సులోని అన్ని దిశల్లోకి కదులుతుంది. ఇది సరస్సు మొత్తం విస్తీర్ణంలో 7% ఆవరించి ఉంటుంది. ఈ సరస్సు లోతును ఇప్పటి వరకూ ఎవరూ లెక్కించలేదు. తుఫానులు, సునామీలు వచ్చినపుడు చుట్టుపక్కల ఉన్న అనేక పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు ఇందులో పడి పూర్తిగా మునిగిపోయాయి.[3]
పురాణాలు,నమ్మకాలు
[మార్చు]మహాభారతంలోని పాండవ సోదరులలో ఒకరైన భీముడు ఈ సరస్సును సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. కురుక్షేత్ర మహాభారత యుద్ధం తరువాత, పాండవులు కమ్రునాగ్ అనే సాధువుతో కలిసి వస్తున్నప్పుడు, ఈ ప్రదేశానికి చేరుకుంటారు. అపుడు కమ్రునాగ్ ఇక్కడి ప్రశాంతమైన పరిసరాలను చూసి ఇష్టపడతాడు. ఎప్పటికీ ఇక్కడే నివసించాలని నిర్ణయించుకున్నాడు. అపుడు భీముడు, కమ్రునాగ్ నివసించడానికి తన మోచేతితో ఒక పెద్ద కొండను కదిలిస్తాడు తద్వారా ఈ సరస్సు ఏర్పడుతుంది. కాబట్టి ఈ సరస్సు మోచేతి ఆకారంలో ఉంటుంది. పూర్వ కాలంలో చాలా మంది భక్తులు ఈ సరస్సును పవిత్రమైనదిగా భావించి, ఇక్కడికి వచ్చి అనేక నగలు, ఆభరణాలు వంటి వాటిని ఈ సరస్సులో వదిలేసి మొక్కు తీర్చుకునేవారు. కాబట్టి ఇప్పుడు ఈ సరస్సు కింద అపారమైన సంపద దాగి ఉందని ప్రజల నమ్మకం.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Mandi - Prashar route". OpenStreetMap.org. Retrieved 20 Jan 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Bajaura - Prashar route". OpenStreetMap.org. Retrieved 20 Jan 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Temples in the Clouds", film by Jim Mallinson and Chicco Patuzzi, 2008, http://www.filmsouthasia.org/archive/details.php?id=1016[permanent dead link]
- ↑ Vinayak, Akshatha (April 24, 2018). "Mysterious Stories of Prashar Lake in Mandi". nativeplanet.com. Retrieved 20 Jan 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)