Jump to content

పరశురామ జయంతి

వికీపీడియా నుండి

పరశురాముడు విష్ణుమూర్తి దశావతారములలో ఆరవవాడు. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించాడని స్కాంద పురాణం, బ్రహ్మాండ పురాణం తెలియజేస్తున్నాయి. పరశురామ జయంతి నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానం చేయవలెనని వ్రత గ్రంథాలు ద్వారా తెలుస్తుంది.[1] పరశురాముడు విష్ణుమూర్తి ఆరవ అవతారంగా భావించి, వైష్ణువులు అతనిని భక్తిప్రపత్తులతో కొలుస్తారు. ఆయన వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ నాడు జన్మించినందున, ఆ రోజును పరశురామ జయంతిగా జరుపుకుంటారు.

పరశురాముడు ఇరువదియొక్క మార్లు భూమిని రాక్షస రాజుల నుండి రక్షించాడని హిందూ పురాణాల చెపుతున్నాయి. ఈ రాజుల రక్తంతోనే సామంతపంచక క్షేత్రంలోని సరస్సులను నింపాడని ప్రజలు ఇప్పటికి నమ్ముతారు. పరశురాముడు ఎందరో పేద, అమాయక, బలహీన ప్రజల రక్షకుడుగా అవతరించాడని నమ్ముతారు. పరశురామ జయంతి దినాన్ని పురస్కరించుకుని చాలామంది ప్రజలు ఉపవాసం ఉంటారు. పూజలు, హవనాలు నిర్వహిస్తారు. కొంతమంది "భాండారా" పేరుతో పేదలకు, భక్తులకు అన్నదానం చేస్తారు.[2]

మూలాలు

[మార్చు]
  1. హిందువుల పండుగలు-పర్వములు: తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 2004.
  2. Devupalli, Gayatri (2018-04-13). "అక్షయ తృతీయ నాడే పరశురామ జయంతి కూడా అని మీకు తెలుసా!". telugu.boldsky.com. Retrieved 2020-05-21.[permanent dead link]