పద్మ ప్లగ్ ఇన్
స్వరూపం
ఇది ఒక ఫైర్‌ఫాక్స్ ప్లగ్‌ఇన్. దీనిని నాగార్జున వెన్న 2005 లో తయారు చేశారు. దీని ద్వారా స్వంత ఖతులు వాడే తెలుగు వార్తాపత్రికలు లినక్స్లో ఫైర్‌ఫాక్స్ విహరిణి ద్వారా చదువుకోడానికి వీలయ్యింది. దీనిని తరువాత ఇతర భారతీయ భాషలకు విస్తరించారు. ప్రస్తుతం తెలుగు దినపత్రికలలో ఈనాడు మాత్రమే స్వంత ఖతి వాడుతున్నది. దాదాపు మిగతా దిన పత్రికలు యూనికోడ్ లో ప్రచురించటం 2010 లో మొదలుపెట్టాయి. అందువలన దీని వినియోగం తగ్గింది.
0.4.13 విడుదల లోటుపాట్లు
[మార్చు]- అక్షరాలు విండోస్ విహరిణిలో కంటే పెద్దవిగా కనపడుతాయి.
- తెలుగు అక్షరానికి ఐత్వము వచ్చినపుడు, తలకట్టుతోబాటు ఐత్వపు గుర్తు వస్తుంది.
తెలుగు ఫాంట్లు తోడ్పాటు
[మార్చు]ఫాంటు ఫైలు పేరు | ఫాంటు (ఖతి) పేరు |
---|---|
eenadu.ttf | Eenadu |
SHREE900.TTF | SHREE-TEL-0900 |
TLWMONT.TTF | TLW-TTHemalatha |
vaartha.sit | Vaartha |