Jump to content

పత్తిపాక మోహన్

వికీపీడియా నుండి
(పత్తిపాక మోహన్‌ నుండి దారిమార్పు చెందింది)
డా. పత్తిపాక మోహన్
ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా 2018, మార్చి 21న హైదరాబాదులోని రవీంద్రభారతిలో మాట్లాడుతున్న పత్తిపాక మోహన్
జననం1972, జనవరి 5
జాతీయతభారతీయుడు
వృత్తిబాల సాహితీవేత్త, కవి, సాహిత్య విమర్శకుడు
జీవిత భాగస్వామిసిరిసిల్ల చందన
తల్లిదండ్రులుగంగాబాయి - లక్ష్మీరాజం
పురస్కారాలుకేంద్ర సాహిత్య అకాడ‌మీ బాల‌సాహిత్య పుర‌స్కారం (2022)

పత్తిపాక మోహన్‌, తెలంగాణకు చెందిన బాల సాహితీవేత్త, కవి, సాహిత్య విమర్శకుడు.[1] నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ హైదరాబాదు ప్రాంతీయ సంపాదకుడిగా పనిచేస్తున్నాడు.[2] ‘బాలల తాత బాపూజీ’ గేయ కథకు కేంద్ర సాహిత్య అకాడ‌మీ 2022 బాల‌సాహిత్య పుర‌స్కారాన్ని అందుకున్నాడు.[3]

జీవిత విశేషాలు

[మార్చు]

పత్తిపాక మోహన్ 1972, జనవరి 5న గంగాబాయి - లక్ష్మీరాజం దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామంలో జన్మించాడు.[4] వారి కుటుంబం పూర్వీకుల నుండి చేనేత వృత్తిని చేసేవారు. తొలినాళ్ళలో చేనేత నేపథ్యంలోనే కవిత్వం రాశాడు. తెలుగు సాహిత్యంలో ఎంఏ, పీహెచ్ డీ చేశాడు. 'తెలుగులో గజల్ ప్రక్రియ - సమగ్ర పరిశీలన' అనే అంశంమీద తొలి పరిశోధన చేశాడు. 1998- 2001 వరకు కొమురంభీం జిల్లా సిర్పూర్‌ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మోహన్ కు సిరిసిల్ల చందనతో వివాహం జరిగింది. చందన ఎస్సీఈఆర్టీలో హిందీ భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నది.

సాహిత్య ప్రస్థానం

[మార్చు]

చిన్నతనం నుండి మోహన్ కు సి. నారాయణరెడ్డితో సన్నిహిత సంబంధాలుండేవి. ప్రతి పుట్టినరోజుకు హన్మాజీ పేటకు వెళ్ళి సినారేను కలిసేవాడు. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుడు టంకశాల దేవదాసరావు తెలుగు గురువు. ఏడో తరగతిలోనే మోహన్, ఓటుపై ఒక కవిత రాసి గురువుల మెప్పును పొందాడు. విద్యార్థి దశలోనే పాఠశాల, కళాశాలల్లో వ్యాఖ్యాతగా కూడా పేరు తెచ్చుకున్నాడు.[5]

రచయితగా సుమారు 15 పుస్తకాలు రాసాడు. అతను వివిధ భాషల్లోని కథలు తెలుగులోకి అనువాదం చేశాడు. ‘ముత్తుకలలు’ తోకలు, మంచి విత్తులు, టిప్పు సుల్తాన్, ప్రాణ స్నేహితులు మొ॥వి తెలుగులోనికి అనువదించాడు. 14 బాల సాహిత్య సంకలనాలు, 28 బాలసాహిత్య అనువాదాలు, ఖడ్గధార, సముద్రం తదితర రచనలు సహా పలు సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. 2001లో చేనేత కార్మికుల ఇతివృత్తంతో 40 పేజీల దీర్ఘ కవితను రాసి, చేనేత కవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కవిత్వంలో విశేష ప్రాచుర్యం పొందిన నానీల ప్రక్రియలోనూ 2009లో కఫన్‌ (శవంపై కప్పే గుడ్డ) పేరుతో కవిత్వీకరించాడు. మానేరు రచయితల సంఘం వ్యవస్థాపకుడిగా పనిచేశాడు.[6]

రచనలు

[మార్చు]
  • 'ఆకుపచ్చని పాట': ఇది స్వచ్చ సర్వేక్షణ్‌లో భాగంగా పిల్లలకు పర్యావరణ స్పృహను తెలిపే 'బాలగీత'
  • 'ఒక్కేసి పువ్వేసి చందమామ': ఇది బాలల బతుకమ్మ గేయాల సంకలనం.
  • చందమామ రావే: బాలల గేయాల పుస్తకం[7]
  • పిల్లలకోసం మనకవులు
  • సహస్ర భాగవత సప్తాహదీప్తి
  • వెన్నముద్దలు
  • అఆ ఇఈ

పురస్కారాలు

[మార్చు]
వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం-2018(ఎడమ నుండి కుడికి) డా.పత్తిపాక మోహన్, వేదకుమార్,విహారి, దేవులపల్లి ప్రభాకర్, మామిడి హరికృష్ణ, వాణిశ్రీ మరియు సుధామ

తెలుగు సాహిత్యంలో కృషిచేస్తున్న మోహన్ పలు పురస్కారాలు, సత్కారాలను అందుకున్నాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Telugu, ntv (2022-08-24). "Pathipaka Mohan: కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారానికి పత్తిపాక మోహన్‌ ఎంపిక". NTV Telugu. Archived from the original on 2022-08-24. Retrieved 2022-08-24.
  2. "డాక్టర్‌ పత్తిపాక మోహన్‌".[permanent dead link]
  3. telugu, NT News (2022-08-24). "ప‌త్తిపాక మోహ‌న్‌కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ బాల‌సాహిత్య పుర‌స్కారం". Namasthe Telangana. Archived from the original on 2022-08-24. Retrieved 2022-08-24.
  4. "జాతీయ కవి సమ్మేళనాలకు పత్తిపాక మోహన్‌".
  5. 5.0 5.1 "తెగిన పోగుల చిరునామా..!!!". NavaTelangana. 2017-08-30. Archived from the original on 2019-01-19. Retrieved 2022-08-26.
  6. "Pathipaka Mohan: పత్తిపాక మోహన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు". EENADU. 2022-08-25. Archived from the original on 2022-08-25. Retrieved 2022-08-26.
  7. "కరీంనగర్ జిల్లా బాలసాహిత్యం". Archived from the original on 2018-03-05. Retrieved 2018-10-21.
  8. "కేంద్ర అకాడమీ అవార్డు దక్కడం ఆనందకరం". EENADU. 2022-11-14. Archived from the original on 2022-11-14. Retrieved 2022-11-21.
  9. "'బాలగీత' పత్తిపాక మోహన్‌ 'ఆకుపచ్చని పాట'". Archived from the original on 2018-10-14. Retrieved 2018-10-21.

బయటి లంకెలు

[మార్చు]