పచ్చయప్ప కళాశాల
నినాదం | Mens Agitat Molem |
---|---|
ఆంగ్లంలో నినాదం | (Mind Moves Matter) |
స్థాపితం | 1842 |
ప్రధానాధ్యాపకుడు | డా. పి.గజవరదన్, M.Sc.,M.Phil.,Ph.D. |
స్థానం | చెన్నై, తమిళనాడు, భారతదేశం 13°4′23.25″N 80°13′59.05″E / 13.0731250°N 80.2330694°E |
కాంపస్ | పట్టణ |
పచ్చయప్ప కళాశాల (ఆంగ్లం: Pachaiyappa's College) మద్రాసు లోని ప్రాచీనమైన విద్యా సంస్థ. ఇది 1842 సంవత్సరంలో పచ్చయప్పా ముదలియార్ వీలునామాను అనుసరించి స్థాపించబడింది.
నేపథ్యం
[మార్చు]పచ్చయ్యప్ప కళాశాలను విద్యాదాత పచ్చయప్ప మొదలియార్ తన వీలునామాలో విద్యాదానం కొరకు కేటాయించిన సొమ్ముతో నిర్మించారు. పచ్చయప్ప మరణానంతరం వారు వ్రాసిన విల్లుకు వ్యతిరేకంగా, పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన లక్షలాది రూపాయల సొమ్మును వారసులు తినివేశారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ చెన్నై సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ కాంప్టన్, ఆయన అనంతరం వచ్చిన మరొక అడ్వకేట్ జనరల్ నార్టన్ పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన సొమ్మును న్యాయపరంగా వెలికితీయించారు. ఆ వెలికి తీసిన సొమ్మును పచ్చయప్ప వీలునామా మేరకు ధర్మకార్యాలకు ఖర్చుచేసేందుకు 1832లో ధర్మకర్తల బోర్డు ఏర్పాటుచేశారు. ఆ బోర్డులో పోలీసు సూపరింటెండెంటు, దాత వెంబాకం రాఘవాచార్యులు అధ్యక్షునిగా, విద్యాదాత కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై ఒకానొక ధర్మకర్తగా ఉన్నారు. 1842లో వెంబాకం రాఘవాచార్యులు మరణించాకా అప్పటి నుంచి శ్రీనివాసపిళ్ళై అధ్యక్షుడై 1852లో తాను మరణించేవరకూ కొనసాగారు. ఈ క్రమంలోనే ఆ ధర్మనిధితో పచ్చయప్ప కళాశాలను నిర్మించారు.[1]
పచ్చయప్పా ముదలియార్
[మార్చు]ప్రధానోపాధ్యాయులు
[మార్చు]- జాన్ ఆడమ్ (1884 -1894)
- ఎరిక్ డ్రూ (1906 - 1912)
- సి.ఎల్.రెన్ (1920 - 1921)
- ఎం.రుతునాస్వామి (1921 - 1927)
- కె.చిన్న తంబిపిళ్ళై (1927 - 1935)
- పి.ఎన్.శ్రీనివాసాచారి (1935 -1938)
- డి.ఎస్.శర్మ (1938 -1941)
- వి.తిరువెంగటసామి (1942-1942)
- బి.వి.నారాయణస్వామి నాయుడు (1942-1947)
- ఆర్.కృష్ణమూర్తి (1947-1961)
- సి.డి.రాజేశ్వరన్ (961-1963)
- టి.ఎస్.శంకరనారాయణ పిళ్ళై (1963-1966)
- ఎస్.పి.షణ్ముగనాథన్ (1966-1982)
- ఎం.కె.దశరథన్ (1982-1984)
- టి.ఆర్.రామచంద్రన్ (1984-1985)
- జి.నాగలింగం (1985-1986)
- ఎన్.పి.కళ్యాణం (1986-1987)
- ఎన్.కె.నారాయణన్ (1989)
- ఏ.పి.కమలాకర రావు
ప్రముఖులైన పూర్వ విద్యార్ధులు
[మార్చు]కళాశాల అధికారిక వెబ్‌సైట్ లో చాలా మంది ప్రముఖ పూర్వవిద్యార్థులను పేర్కొన్నారు.[2] వారిలో కొందరు:
- కాసు బ్రహ్మానంద రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
- మురసోలీ మారన్, రాజకీయనాయకుడు
- కె.సి.రెడ్డి, మొదటి మైసూరు ముఖ్యమంత్రి
- బొడ్డేపల్లి రాజగోపాలరావు, పార్లమెంటు సభ్యుడు.
- సి.ఎన్.అన్నాదురై, తమిళనాడు ముఖ్యమంత్రి
- మామిడిపూడి వేంకటరంగయ్య, చరిత్ర పరిశోధకులు
- వైరాముత్తు, కవి
- తాపీ ధర్మారావు, తెలుగు పాత్రికేయుడు
- ఎ.ఎం.రాజా, సినీ గాయకుడు
- పిట్టమండలం వెంకటాచలపతి, భారతదేశపు తొలి డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత
- పరవస్తు చిన్నయసూరి, తెలుగు కవి, పండితుడు
- రాబిన్ సింగ్, భారత క్రికెట్ క్రీడాకారుడు
- భరత్ రెడ్డి, భారత క్రికెట్ క్రీడాకారుడు
- శ్రీనివాస రామానుజన్, గణితవేత్త
- దామరాజు పుండరీకాక్షుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, నాటకకర్త.
- పి.చంద్రశేఖరరెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు.
మూలాలు
[మార్చు]- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ "Pachaiyappa's College Alumni". Pachaiyappa's College. Archived from the original on 2012-04-03. Retrieved 2012-03-20.
బయటి లింకులు
[మార్చు]- పచ్చయప్పా కళాశాల అధికారిక వెబ్ సైటు. Archived 2009-04-08 at the Wayback Machine