Jump to content

పంజాబీ కేలండరు

వికీపీడియా నుండి
Seal of Punjab India
Coat of Arms Punjab Pakistan
Seal of Punjab India (left) Coat of Arms Punjab Pakistan (right)

పంజాబీ కేలండరు విక్రమాదిత్య రాజు నుండి వచ్చిన బిక్రమి కేలండరు ఆధారంగా రూపొందించబడి క్రీ.పూ 57 నుండి మొదలయింది. ఈ కేలండరు బిక్రమి కేలండరులోని సౌర అంశాల కోసం ఉపయోగపడుతుంది. దీనిలో వైశాఖిలోని మొదటి రోజును పంజాబీలు కొత్త సంవత్సర దినంగా "వైశాఖి"గా జరుపుకుంటారు.

పంజాబీ నెలలు (సౌర)

[మార్చు]

పంజాబీ కేలండరులో వివిధ నెలలు ఈ విధంగా ఉంటాయి.

సం. పేరు పంజాబ్ గురుముఖి పంజాబ్ షాముఖి పశ్చిమాది నెలలు
1 వైశాఖ్ ਵੈਸਾਖ ویساکھ ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు
2 జెత్ ਜੇਠ جیٹھ మే మధ్య నుండి జూన్ మధ్య వరకు
3 హర్ ਹਾੜ ہاڑھ జూన్ మధ్య నుండి జూలై మధ్య వరకు
4 సావన్ ਸਾਵਣ ساون జూలై మధ్య నుండి ఆగస్టు మధ్య వరకు
5 భదాన్ ਭਾਦੋਂ بھادوں ఆగస్టు మధ్య నుండి సెప్టెంబరు మధ్య వరకు
6 అస్సు ਅੱਸੂ اسو సెప్టెంబరు మధ్య నుండి అక్టోబరు మధ్య వరకు
7 కట్టెక్ ਕੱਤਕ کاتک అక్టోబరు మధ్య నుండి నవంబరు మధ్య వరకు
8 మఘర్ ਮੱਘਰ مگھر నవంబరు మధ్య నుండి డిసెంబరు మధ్య వరకు
9 పోహ్ ਪੋਹ پوہ డిసెంబరు మధ్య నుండి జనవరి మధ్య వరకు
10 మాఘ్ ਮਾਘ ماگھ జనవరి మధ్య నుండి ఫిబ్రవరి మధ్య వరకు
11 ఫాగున్ ਫੱਗਣ پھگن ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు
12 చెత్ ਚੇਤ چیت మార్చి మధ్య నుండి ఏప్రిల్ మధ్య వరకు

పంజాబీ చాంద్రమాన కేలండరు

[మార్చు]

పంజాబీ చాంద్రమాన కాలెండరు చైత్ తో మొదలవుతుంది. ఈ మాసం మొదటి రోజు కొత్త చంద్ర సంవత్సరం యొక్క ప్రారంభ దినం కాదు. ఈ నెలలో వచ్చే అమావాస్య నుండి ప్రారంభమవుతుంది. పంజాబీ చాంద్రమాన కేలండరులో ప్రతీ మాసం ఆ నెలలోని పౌర్ణమి తరువాత రోజు ప్రారంభమై తరువాత నెల పౌర్ణమి ముందురోజు అంతమవుతుంది. అందువలన చైత్ మాసం రెండు భాగాలుగా రెండు సంవత్సరాలకు విడిపోతుంది. అయినప్పటికీ చైత్ కొత్త సంవత్సరం పంజాబీ అధికార కొత్త సంవత్సరం కాదు. కానీ చాంద్రమాన సంవత్సరం చైత్ నుండి ప్రారంభమవుతుంది. పంజాబీ ఫోక్ కవితలు, బరాహ్హ్ మహా, సంవత్సరం మొదలుతో ప్రారంభమవుతాయి. పంజాబీ క్యాలెండర్లో చాంద్రమాన కారక అనేక పంజాబీ పండుగలను నిర్ణయిస్తుంది.

2014/2015 యొక్క చాంద్రమాన కేలండరు ఈ దిగువనీయబడింది.[1]

వ.సం. చాంద్రమాసం పేరు తేదీ ఋతువు (అధికారిక) [2] ఋతువు (పంజాబీ) పౌర్ణమి అమావాస్య
1. చెతర్ 17 మార్చి 2014 వసంత ఋతువు బసంత్ 15 ఏప్రిల్ 2014 30 మార్చి 2014
2. విశాఖ్ 16 ఏప్రిల్ 2014 వసంత ఋతువు బసంత్ 14 మే 2014 29 ఏప్రిల్ 2014
3. జెత్ 15 మే 2014 గ్రీష్మ ఋతువు రోహీ 13 జూన్ 2014 28 మే 2014
4. హర్ 14 జూన్ 2014 గ్రీష్మ ఋతువు రోహీ 12 జూలై 2014 27 జూన్ 2014
5. సావన్ 13 జూలై 2014 వర్ష ఋతువు బర్సాత్ 10 ఆగస్టు 2014 26 జూలై 2014
6. భదోన్ 11 ఆగస్టు 2014 వర్ష ఋతువు బర్సాత్ 8 సెప్టెంబరు 2014 25 ఆగస్టు 2014
7. అసూజ్ 10 సెప్టెంబరు 2014 శరదృతువు పాట్‌జర్ 8 అక్టోబరు 2014 23 సెప్టెంబరు 2014
8. కట్టెక్ 9 అక్టోబరు 2014 శరదృతువు పాట్‌జర్ 6 నవంబరు 2014 23 అక్టోబరు 2014
9. మఘర్ 7 నవంబరు 2014 హేమంత ఋతువు సియాల్ 6 డిసెంబరు 2014 22 నవంబరు 2014
10. పోహ్ 7 డిసెంబరు 2014 హేమంత ఋతువు సియాల్ 4 జనవరి 2015 21 డిసెంబరు 2014
11. మాఘ్ 6 జనవరి 2015 శిశిర ఋతువు సియాల్ 3 ఫిబ్రవరి 2015 20 జనవరి 2015
12. ఫగ్గన్ 4 ఫిబ్రవరి 2015 శిశిర ఋతువు సియాల్ 5 మార్చి 2015 18 ఫిబ్రవరి 2015

పంజాబీ పండుగలు

[మార్చు]

పంజాబీ జానపద మతం: పండుగలు

[మార్చు]

పంజాబీ లో రోజులు

[మార్చు]
సం. పశ్చిమాది కేలండరులో రోజు పంజాబీ రోజు[3]
1. సోమవారం సోమవార్
2. మంగళవారం మంగలవార్
3. బుధవారం బుధ్‌వార్
4. గురువారం వీరవార్
5. శుక్రవారం శుక్రవార్
6. శనివారం శనీఛ్చర్ వార్
7. ఆదివారం ఎత్వార్

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Adarsh Mobile Applications LLP. "2015 Purnima Days, Pournami Days, Full Moon Days for San Francisco, California, United States".
  2. Faiths, Fairs and Festivals of India by C H Buck Rupa & CoISBN 81-7167-614-6
  3. Bhatia, Tej (1993) Punjabi. Routledge