పంకజ్ చౌదరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంకజ్ చౌదరి
పంకజ్ చౌదరీ


ఆర్థిక శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 జూలై 2021 (2021-07-07)
Serving with [[భగవత్ కరాద్]]
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు అనురాగ్ సింగ్ ఠాకూర్

లోక్‌సభ సభ్యుడు
మహారాజగంజ్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2014
ముందు హర్షవర్ధన్
పదవీ కాలం
మే 2004 – మే 2009
ముందు అఖిలేష్ కుమార్ సింగ్
తరువాత హర్షవర్ధన్
పదవీ కాలం
జూన్ 1991 – ఏప్రిల్ 1999 (3 సార్లు)
ముందు హర్షవర్ధన్
తరువాత అఖిలేష్ కుమార్ సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-11-15) 1964 నవంబరు 15 (వయసు 59)
గోరఖ్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు
  • భగవతి ప్రసాద్ చౌదరి (తండ్రి)
  • ఉజ్జ్వల చౌదరి (తల్లి)
జీవిత భాగస్వామి
భాగ్యశ్రీ చౌదరి
(m. 1990)
సంతానం 2
నివాసం 20, క్యానింగ్ లేన్, ఫిరోజ్ షా రోడ్ , న్యూఢిల్లీ
పూర్వ విద్యార్థి గోరఖ్‌పూర్ యూనివర్సిటీ
వృత్తి
  • పారిశ్శ్రమికవేత్త
  • వ్యవసాయదారుడు
  • రాజకీయ నాయకుడు
మూలం [1]

పంకజ్‌ చౌదరీ  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరు సార్లు ఎంపీగా ఎన్నికై 2019 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి,[2] 2024 జూన్ 9 నుండి మోదీ మంత్రివర్గంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

పంకజ్ చౌదరీ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998లో గోరఖ్‌పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి 1990లో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 1991లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహారాజగంజ్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 1996,1998 ఎన్నికల్లో గెలిచి ఎంపీగా హ్యాట్రిక్ సాధించాడు.

పంకజ్ చౌదరీ 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగోవసారి ఎంపీగా ఎన్నికై 2009లో ఓడిపోయి 2014లో ఐదోసారి, 2019లో ఆరోసారి ఎంపీగా ఎన్నికై 7 జూలై 2019 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[4]

నిర్వహించిన స్థానాలు

[మార్చు]
  • 1989–91 : సభ్యుడు, మున్సిపల్ కార్పొరేషన్, గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్
  • 1990–91 : డిప్యూటీ మేయర్, మున్సిపల్ కార్పొరేషన్, గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్
  • 1990 నుండి భారతీయ జనతా పార్టీ (BJP) వర్కింగ్ కమిటీ సభ్యుడు
  • 1991 : 10వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
  • 1991–96 : సభ్యుడు, టేబుల్‌పై వేసిన పేపర్స్ కమిటీ & సభ్యుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం & అడవులపై కమిటీ
  • 1996 : 11వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వసారి)
  • 1996–97 : సభ్యుడు, కమ్యూనికేషన్స్ కమిటీ & సభ్యుడు, జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్
  • 1998 : 12వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)
  • 1998–99 : సభ్యుడు, రైల్వేస్ కమిటీ; సభ్యుడు, పిటిషన్లపై కమిటీ & సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
  • 2004 : 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)

సభ్యుడు, సైన్స్ అండ్ టెక్నాలజీపై కమిటీ, పర్యావరణం & అడవులు సభ్యుడు, పార్లమెంటు సభ్యులపై కమిటీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం సభ్యుడు, టూరిజంపై కమిటీ

  • 2007 నుండి సభ్యులు, MPLADSపై కమిటీ
  • 2014 : 16వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)
  • 2019 : 17వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (6వసారి)
  • 2021 : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి[5]

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2019). "Pankaj Chaudhary". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  2. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  3. EENADU (10 June 2024). "రామ్మోహన్‌నాయుడికి పౌరవిమానయానం.. మంత్రులకు కేటాయించిన శాఖలివే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  4. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
  5. The Hindu (10 June 2024). "Full list of ministers with portfolios in Modi 3.0 government: Who gets what" (in Indian English). Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.