Jump to content

నేనోరకం

వికీపీడియా నుండి
నేనోరకం
దర్శకత్వంసుదర్శన్ సాలేంద్ర
నిర్మాతశ్రీకాంత్ రెడ్డి
తారాగణం
సంగీతంమహిత్ నారాయణ్
విడుదల తేదీ
17 మార్చి 2017
దేశంభారతదేశం
భాషతెలుగు

నేనోరకం, 2017 మార్చి 17న విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీకాంత్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో సుదర్శన్ సాలేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిరాం శంకర్, రేష్మి మీనన్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చాడు.[1][2] సినీ హాస్యనటుడు ఎం. ఎస్. నారాయణకు ఇది చివరి సినిమా కాగా, అతను మరణించిన రెండు సంవత్సరాల తరువాత విడుదలయింది.[3] గత సినిమాల్లోకంటే ఈ సినిమాలో సాయిరాం శంకర్ నటనలో పరిణితి కనబరిచాడు.[4]ఈ సినిమా ప్రముఖ హాస్య నటుడు ఎం. ఎస్. నారాయణ కు చివరి చిత్రం.

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చాడు.[5]

  1. పిడికెడు నడుము (గానం: జస్సీ గిఫ్ట్)
  2. చూడకుండా (గానం: ప్రకాష్ పరిగోష్)
  3. ఐ యామ్ సో క్రేజీ (గానం: స్వరాగ్ కీర్తన)
  4. హబ్బూ పబ్బూ (గానం: భార్గవి పిళ్ళై)
  5. నా చెలి ఏది (గానం: రాహుల్ సిప్లిగంజ్)

విడుదల

[మార్చు]

సిఫీ ఈ సినిమాకి 3.75/5 రేటింగ్ ఇచ్చింది. "నేనోరకం సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది" అని రాసింది.[6] ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ సినిమా రెండవ భాగం సినిమాటోగ్రఫీ, కథా మలుపుల కోసం చూడవచ్చు" అని పేర్కొంది.[7]

మూలాలు

[మార్చు]
  1. kavirayani, suresh (January 8, 2017). "Sai Ram Shankar still waiting for a break". Deccan Chronicle. Retrieved 2021-02-23.
  2. kavirayani, suresh (March 15, 2017). "Sairam Shankar is looking for a hit". Deccan Chronicle. Retrieved 2021-02-23.
  3. "Late MS Narayana to be seen in a cameo appearance in Nenorakam - Times of India". The Times of India. Retrieved 2021-02-23.
  4. kavirayani, suresh (March 24, 2017). "Sairam Shankar on cloud nine!". Deccan Chronicle. Retrieved 2021-02-23.
  5. "Nenorakam Mp3 Songs". SenSongsMp3.Co.In. 2017-03-08. Archived from the original on 2020-09-19. Retrieved 2021-02-23.
  6. "Nenorakam review: Lack of intensity dampens the story". Sify. Retrieved 2021-02-23.
  7. "Nenorakam Movie Review {2/5}: Critic Review of Nenorakam by Times of India". Retrieved 2021-02-23 – via timesofindia.indiatimes.com.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నేనోరకం&oldid=3981459" నుండి వెలికితీశారు