నిమ్రద్ కటకం
నిమ్రద్ కటకం | |
---|---|
పదార్థం | పారదర్శక శిల |
పరిమాణం | వ్యాసం: 38 mమీ. (1.5 అం.) మందం: 23 mమీ. (0.9 అం.)[1][2] |
తయారైన కాలం | 750–710 BC |
యుగం/సంస్కృతి | నియో-అస్సీరియన్ |
ప్రాంతం | వాయువ్య పాలెస్, Room AB |
ప్రస్తుతం ఉన్న చోటు | బ్రిటిష్ మ్యూజియం, లండన్ |
Identification | మూస:British-Museum-db |
నిమ్రద్ కటకం (లాయర్డ్ కటకం) 3000 సంవత్సరాల వయస్సు గల రాతితో చేయబడిన కటకం. ఇది 1850 లో నవీన ఇరాక్ లోని నిమ్రద్ యొక్క ఆస్సీరియన్ భవనంలో త్రవ్వకాల్లో ఆస్టన్ హన్రీ లాయర్డ్ కనుగొన్నాడు. [3] [4] ఇది కేంద్రీకరణ కటకము లేదా బర్నింగ్ గ్లాస్ గా వాడబడేది. దీనితో సూర్యకాంతిని కేంద్రీకరించి మంటలను సృష్టించవచ్చు. ఇది ఒక చట్రలో అలంకరణ వస్తువుగా ఉపయోగించబడేది. [3]
వర్ణన
[మార్చు]ఇది దీర్ఘవృత్తారారంలో ఉండి పాక్షికంగా రాతి చక్రంపై సాన చేయబడింది.[1] ఆ కటకం యొక్క నాభీయ బిందువు సమతల వైపు నుండి 11 సెంటీమీటర్లు (4.5 అంగుళాలు) ఉంది. దీని నాభ్యాంతరం సుమారు 12 సెంటీమీటర్లు ఉంది. [1][2][3] ఈ కటకం 3× కేంద్రీకరణ కటకాన్ని పోలి ఉంటుంది. ఈ కటకం యొక్క ఉపరితలం 12 చీలికలను కలిగి ఉంది. ఈ చీలికలు సాన పెట్టినపుడు విడిపోతాయి. ఈ సందులలో నాఫ్తా లేదా ఇతర ద్రవాన్ని కలపడానికి ఉపయోగించారు. ఈ కటకం సూర్య కాంతిని కచ్చితంగా కేంద్రీకరించగలదు. ఈ కటకం సహజసిద్ధమైన రాతి స్ఫతికాలనుపయోగించి తయారుచేయబడినందువలన కటకం యొక్క పదార్థం కాలక్రమేణా బాగా క్షీణించబడలేదు. [1] ఈ కటకాన్ని బ్రిటిష్ మ్యూజియంలో చూడవచ్చు.
వివరణ
[మార్చు]కొంతమంది రచయితలు ఈ కటకం దృశా శాస్త్రంలో వాడబడేదని మరి కొంతమంది దీనిని అలంకరణ వస్తువుగా వాడబడేవారని తెలియజేస్తున్నందున దీనిని ఆ కాలంలో దేనికి ఉపయోగించారో సరిగ్గా తెలియదు. అస్సీరియన్ శిల్పకారులు క్లిష్టమైన శిల్పాలను తయారుచేసేవారు. వాటిలో ఈ కటకం ఒకటి.[5][1] రోమ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్త "గివాన్ని పెట్టినాటో" ఈ కటకాన్ని ప్రాచీన ఆస్సీరియన్లు వారికి గల ఖగోళశాస్త్ర జ్ఞానాన్ని వివరించడానికి, వారిచే వాడబడే టెలిస్కోపులో ఒక భాగంగా ఉపయోగించేవారని ప్రతిపాదించాడు. [5]ఆస్సీరియన్ పురావస్తు శాస్త్ర నిపుణులు ఈ కటకం ఎక్కువాగా వాడబడేదనడానికి దాని నాణ్యతను అనుమానించారు. ప్రాచీన ఆస్సీరియన్లు వలయాలతో కూడిన శని గ్రహాన్ని దేవునిగా భావించారు. దీనికి కారణం "పెట్టినాటో" చెప్పినట్లు వారు టెలిస్కోప్ ఉపయోగించి శని గ్రహం చుట్టూ ఉన్న వలయాలను చూసారు. [6] ఇతర నిపుణులు చెప్పినదాని ప్రకారం అస్సీరియన్ పురాణాలలో ఎక్కువగా సర్పాల గూర్చి కనిపిస్తుందనీ, టెలిస్కోప్ గూర్చి ఏ ఖగోళ శాస్త్ర గ్రంథాలలో కూడా ప్రస్తావన లేదనీ చెబుతారు. [5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Layard, Austen Henry (1853). Discoveries in the ruins of Nineveh and Babylon: with travels in Armenia. G.P. Putnam and Co. pp. 197–8, 674.
- ↑ 2.0 2.1 D. Brewster (1852). "On an account of a rock-crystal lens and decomposed glass found in Niniveh". Die Fortschritte der Physik (in German). Deutsche Physikalische Gesellschaft.
{{cite journal}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 3.0 3.1 3.2 "The Nimrud lens / the Layard lens". Collection database. The British Museum. Retrieved Oct 21, 2012.
- ↑ Villiers, Geoffrey de; Pike, E. Roy (2016-10-16). The Limits of Resolution (in ఇంగ్లీష్). CRC Press. ISBN 9781315350806.[permanent dead link]
- ↑ 5.0 5.1 5.2 Whitehouse, David (July 1, 1999). "World's oldest telescope?". BBC News. Retrieved May 10, 2008.
If one Italian scientist is correct then the telescope was not invented sometime in the 16th century by Dutch spectacle makers, but by ancient Assyrian astronomers nearly three thousand years earlier. According to Professor Giovanni Pettinato of the University of Rome, a rock crystal lens, currently on show in the British museum, could rewrite the history of science. He believes that it could explain why the ancient Assyrians knew so much about astronomy.
- ↑ "World's oldest telescope?". EXN Science Wire. June 29, 1999. Archived from the original on Sep 29, 2007. Retrieved 2008-05-10.
Pettinato believes the lens was used by Assyrian astronomers as a telescope more than three thousand years ago. They saw more in the night sky than was possible with the naked eye alone. For example, the Assyrians saw the planet Saturn as a god surrounded by a ring of serpents. Pettinato says that would be a logical assumption to make if they saw Saturn's rings through a primitive telescope.
గ్రంథావళి
[మార్చు]- A. H. Layard, Discoveries in the Ruins of Nineveh and Babylon (London, 1853), p. 197–98.