నాగులచవితి (సినిమా)
స్వరూపం
నాగులచవితి (1956 తెలుగు సినిమా) | |
1956 మార్చి చందమామ లో ప్రచురించబడిన సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | చిత్రపు నారాయణమూర్తి |
నిర్మాణం | ఏ.వి.మెయ్యప్పన్ |
తారాగణం | షావుకారు జానకి, ఆర్.నాగేంద్రరావు |
నిర్మాణ సంస్థ | ఏ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నాగులచవితి 1956లో విడుదలైన తెలుగు సినిమా. ఇది ఎ.వి.మెయిప్పన్ నిర్మాణ సారధ్యంలో ఏ.వి.యం. ప్రొడక్షన్స్ ద్వారా విడుదలై ఘనవిజయం సాధించింది. దీనికి చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించారు.
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]- మానసాదేవి గా షావుకారు జానకి
- విపుల గా జమున
- పార్వతి గా కె.మాలతి
- రాణీ సనక గా రమాదేవి
- రాణీ హేమ గా కమలాదేవి
- నేత గా వి. ఎస్. రంభ
- నర్తకి గా ఇ.వి.సరోజ
- నారదుడు గా కె. రఘురామయ్య
- చంద్రధరుడు గా ఆర్. నాగేంద్రరావు
- శశిధరుడు గా ఎ. వి. సుబ్బారావు
- విదూషకుడు గా ఆర్. పద్మనాభం
- శివుడు గా సి. నాగభూషణం
- మహామంత్రి గా ఎ. ఎల్. నారాయణ
- లక్ష్మేంద్రకుమారుడు గా కె. మోహన్
సాంకేతిక బృందం
[మార్చు]- దర్శకుడు - చిత్రపు నారాయణమూర్తి
- నిర్మాత - ఎ.వి.మెయిప్పన్
- స్టుడియో - ఎ.వి.యం. స్టుడియోస్
- ఛాయాగ్రహణము - మాధవ బుల్ బులే
- కళాదర్శకుడు - హెచ్. శాంతారాం
- ఎడిటింగ్ - ఎస్. సూర్య
- నాట్యదర్శకుడు - కె.ఎన్.దండాయుధపాణి
- సంగీతదర్శకులు - ఆర్.సుదర్శనం & ఆర్.గోవర్ధనం
- నేపధ్యగాయకులు - టి.ఎస్.భగవతి, పి.సుశీల, టి.సత్యవతి, ఎం.ఎల్.వసంతకుమారి, మాధవపెద్ది సత్యం, పి.బి.శ్రీనివాస్ & సౌమిత్రి.
పాటలు
[మార్చు]- ఓ దేవ ఫణీశా శరణమయా నా నాధుని బ్రోవమయా - పి.సుశీల
- ఓం నమో నమో నటరాజ నమో హర జూఠజూఠధరా శంభో - టి.ఎస్.భగవతి బృందం
- కదలి వచ్చె త్రిపురారి కరుణచూపె త్రిపురారె - మాధవపెద్ది సత్యం
- గర్భశోకమే నాపరమాయె కడుపె కాల్చెరా - సత్యవతి
- జో జో జో జో తనయా జొజో వర తనయ జో జో - టి.ఎస్.భగవతి, పి.సుశీల బృందం
- తన సర్వశ్వము ఈశ్వర్పణముగా తద్పాదనివేజ సేవనమే (పద్యం) - కె. రఘురామయ్య
- తన సంతానము నష్థమైనయపుడే కాన్పించునా ప్రేమలో (పద్యం) - కె. రఘురామయ్య
- తొలి జన్నంబున నాదు వర్తనంబు దోషంబు (పద్యం) - పి.సుశీల
- ధనధాన్యంబులు భోగ భాగ్యములు తద్దాంపత్య సౌభాగ్యము (పద్యం) - సత్యవతి
- నటరాజు తలదాల్చు నాగదేవ నల్లనయ్యశయ్య నీవె నాగదేవ - ఎం. ఎల్. వసంతకుమారి
- పతియే దైవమటంచు నే..నిలచినదే సూర్యరధంబు (పద్యం,పాట) - పి.సుశీల, మాధవపెద్ది
- పతివ్రతమె సంజీవిని సతికి పతియే గతి కులసతికి - పి.సుశీల
- ప్రభూ నీపాద ఆరధనే తపోసాధన సందర్శ ఆనందమే సదానందము - పి.సుశీల
- ప్రభూ నీదు మహిమ తెలియగ వశమా అభవా బహు నటనా - కె. రఘురామయ్య
- మది ఉదయించె భావసుధలేవో మధుర్య - సత్యవతి బృందం
- మును దాంపత్యములెన్ని గూల్చితినో నా మూలముగా (పద్యం) - పి.సుశీల
- వనితా వివాహం వదిలె వైధవ్యం హేతువాయె - ఎం.ఎస్.రామారావు,సత్యవతి
- శివ శివ శంభో భవ భయహర శంభో - పి.బి. శ్రీనివాస్
- శ్రీసతి మోహనా పాహిమాం దేవా ఆశ్రిత బాంధవా - కె. రఘురామయ్య
- సకల సంతానము నష్టమైనప్పుడే (పద్యం) - కె. రాఘురామయ్య
- సాగరమీదుట నీదరి జేరుట శంభో నీలీల విధియే మారుట - పి.బి. శ్రీనివాస్
- సురమ్యశీలే పరిశోషనాన్వితే విరజమానాం (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్ బృందం