నాగర్‌కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
నాగర్‌కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | తమిళనాడు |
కాల మండలం | UTC+05:30 |
అక్షాంశ రేఖాంశాలు | 8°10′12″N 77°25′48″E |
రద్దు చేసిన తేది | 2008 |
నాగర్‌కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. తమిళనాడు తొలి ముఖ్యమంత్రి కె. కామరాజ్ ఇక్కడి నుండి లోక్‌సభకు రెండుసార్లు ఎన్నికయ్యాడు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | చిత్రం | పార్టీ | ద్వితియ విజేత | పార్టీ |
---|---|---|---|---|---|
1951 | మార్షల్ ఎ. నెసమోని | తమిళనాడు కాంగ్రెస్ | శివథాను పిళ్లై | స్వతంత్ర | |
1957 | పి. తనులింగ నాడార్ | భారత జాతీయ కాంగ్రెస్ | చెల్లస్వామి | స్వతంత్ర | |
1962 | మార్షల్ ఎ. నెసమోని | భారత జాతీయ కాంగ్రెస్ | పి. వివేకానంద | స్వతంత్ర | |
1967 | మార్షల్ ఎ. నెసమోని | భారత జాతీయ కాంగ్రెస్ | M. మథియాస్ | స్వతంత్ర పార్టీ | |
1969 (ఉప ఎన్నిక) | కె.కామరాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ | M. మథియాస్ | స్వతంత్ర | |
1971 | కె.కామరాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ (సంస్థ) | MC బాలన్ | డీఎంకే | |
1977 | కుమారి అనంతన్ | భారత జాతీయ కాంగ్రెస్ (సంస్థ) | M. మోసెస్ | కాంగ్రెస్ | |
1980 | ఎన్. డెన్నిస్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) | పొన్. విజయరాఘవన్ | జనతా పార్టీ | |
1984 | ఎన్. డెన్నిస్ | కాంగ్రెస్ | పొన్. విజయరాఘవన్ | జనతా పార్టీ | |
1989 | ఎన్. డెన్నిస్ | కాంగ్రెస్ | డి. కుమారదాస్ | జనతాదళ్ | |
1991 | ఎన్. డెన్నిస్ | కాంగ్రెస్ | పి. మహమ్మద్ ఇస్మాయిల్ | జనతాదళ్ | |
1996 | ఎన్. డెన్నిస్ | తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్) | పొన్. రాధాకృష్ణన్ | భారతీయ జనతా పార్టీ | |
1998 | ఎన్. డెన్నిస్ | తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్) | పొన్. రాధాకృష్ణన్ | భారతీయ జనతా పార్టీ | |
1999 | పొన్ రాధాకృష్ణన్ | భారతీయ జనతా పార్టీ | ఎన్. డెన్నిస్ | కాంగ్రెస్ | |
2004 | AV బెల్లార్మిన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | పొన్. రాధాకృష్ణన్ | భారతీయ జనతా పార్టీ |
2008లో నాగర్‌కోయిల్ నియోజకవర్గం పేరును కన్యాకుమారిగా మార్చారు. కన్యాకుమారి (లోక్‌సభ నియోజకవర్గం)
మూలాలు
[మార్చు]- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2008-10-31. Retrieved 2008-10-13.