Jump to content

నరేన్ తమ్హానే

వికీపీడియా నుండి
నరేన్ తమ్హానే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నరేన్ శంకర్ తమ్హానే
పుట్టిన తేదీ(1931-08-04)1931 ఆగస్టు 4
బొంబాయి, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2002 మార్చి 19(2002-03-19) (వయసు 70)
ముంబై
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 72)1955 జనవరి 1 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1960 డిసెంబరు 30 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 21 93
చేసిన పరుగులు 225 1,459
బ్యాటింగు సగటు 10.22 18.23
100లు/50లు 0/1 1/5
అత్యధిక స్కోరు 54* 109*
వేసిన బంతులు 66
వికెట్లు 2
బౌలింగు సగటు 21.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/43
క్యాచ్‌లు/స్టంపింగులు 35/16 174/79
మూలం: CricInfo, 2022 నవంబరు 20

నరేంద్ర శంకర్ తమ్హానే (1931 ఆగస్టు 4 - 2002 మార్చి 19) 1955 నుండి 1960 వరకు 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారతీయ క్రికెటరు. అతను వికెట్ కీపర్- బ్యాట్స్‌మెన్.

అతని ఫస్ట్-క్లాస్ కెరీర్ 1951-52 నుండి 1968-69 వరకు విస్తరించింది. 1953-54 నుండి 1963-64 వరకు బొంబాయి తరపున రంజీ ట్రోఫీలో ఆడాడు.

తరువాత అతను ముంబై, భారతదేశం కోసం ఎంపిక కమిటీలలో పనిచేశాడు. ఆ ఎంపిక కమిటీయే సచిన్ టెండూల్కర్‌ను ఫస్ట్-క్లాస్, అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపిక చేసింది.

తమ్హానే ముంబైలోని ఫోర్ట్‌లోని సిద్ధార్థ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో చదివాడు. [1]

ఫస్ట్ క్లాస్ క్రికెట్

[మార్చు]

నరేన్ తమ్హానే యొక్క ఫస్ట్-క్లాస్ ఆట జీవితం 1951-52 సీజన్ నుండి 1968-69 సీజన్ వరకు కొనసాగింది. 1953-54 నుండి 1963-64 సీజన్ వరకు రంజీ ట్రోఫీలో బాంబే జట్టు తరపున ఆడాడు.

ఒక్కసారిగా వికెట్ కీపర్ వైపు దూసుకెళ్లాడు. వాస్తవానికి, అతను తన క్రీడా జీవితంలో ప్రారంభంలో స్లో బౌలర్‌గా ఉద్భవించాడు. క్లబ్ జట్టుకు ఆడుతున్నప్పుడు మామూలుగా ఆడే వికెట్ కీపర్ అందుబాటులో లేకపోవడంతో అతనికి వికెట్ కీపింగ్‌లోకి వెళ్లాడు. 22 ఏళ్ల వయసులో బొంబాయి తరఫున రంజీ ట్రోఫీలో అడుగుపెట్టాడు.

అతను మొత్తం 93 ఫస్ట్ క్లాస్ గేమ్‌లలో 175 క్యాచ్‌లు, 78 స్టంపింగులు చేశాడు. బాంబే ట్రోఫీలో 100 ఔట్‌లను నమోదు చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. అతను 18.23 సగటుతో, ఒక సెంచరీతో 1,459 పరుగులు చేశాడు. మధ్యలో అతను 1958-59 సీజన్‌లో బాంబే జట్టు సభ్యునిగా బరోడాపై 109 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ని ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

నరేన్ తమ్హానే తన క్రీడా జీవితంలో ఇరవై ఒక్క టెస్టుల్లో ఆడాడు. అతను 1955 జనవరి 1 న ఢాకాలో ఆతిథ్య పాకిస్థాన్ జట్టుపై టెస్ట్ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. అతను 1960 డిసెంబరు 30 న కోల్‌కతాలో అదే జట్టుతో తన చివరి టెస్టు ఆడాడు.

రంజీ ట్రోఫీ పోటీలో ఒక సీజన్ పాల్గొన్న తర్వాత భారత జట్టు 1954-55 సీజన్‌లో మొదటిసారి పాకిస్థాన్‌ను సందర్శించింది. ఆ సీరీస్‌లో సుభాష్ గుప్తే లెగ్ స్పిన్, వినూ మన్కడ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగుకు అతను సహజమైన వికెట్ కీపరుగా స్థిరపడ్డాడు. ఏడు స్టంపింగ్‌లతో సహా 19 ఔట్‌లు చేసాడు. అలాగే, రెండో టెస్టులో 54 పరుగులతో అజేయ ఇన్నింగ్స్‌ను ఆడాడు. అతను 10.22 సగటుతో పరుగులు సేకరించాడు. ఆ స్థాయి క్రికెట్‌లో తన బ్యాటింగు నైపుణ్యాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేకపోయాడు. భారత్ తరఫున తర్వాతి 13 టెస్టుల్లో, రెండు మినహా అన్నిటిలో అతను ఆడాడు. ఆ తరువాత జట్టు సెలెక్టర్లు నానా జోషి, బుద్ధి కుందరన్ ల మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా అతను జట్టు బయటే ఉండవలసి వచ్చింది.[2]

1959లో హెడ్డింగ్లీ, ఓవల్ టెస్ట్‌లలో, అతను ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత, అతను కాన్పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన జట్టులో మళ్లీ ఎంపికయ్యాడు. అందులో అతను కేవలం ఒక్క ఔట్‌ని మాత్రమే సాధించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో జాసూ పటేల్‌ బౌలింగులో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ కొలిన్ మెక్‌డొనాల్డ్‌ను స్టంపౌట్ చేయడం ఆటకే హైలైట్‌గా నిలిచింది. జాసూ పటేల్ ఆఫ్ స్పిన్ బౌలింగ్‌ను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగల అతికొద్ది మంది ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో అతను ఒకడు. ఆ టెస్టులో పటేల్ 14 వికెట్లు పడగొట్టి భారత జట్టును 119 పరుగుల తేడాతో గెలిపించాడు. ఆ తర్వాత 1960-61 సీజన్‌లో పాకిస్థాన్‌తో మరో రెండు టెస్టుల్లో మాత్రమే పాల్గొనే అవకాశం నరేన్‌కి లభించింది. అంతర్జాతీయ క్రికెట్ తరువాత, దేశీయ క్రికెట్‌లో మరో మూడు సీజన్లు ఆడాడు. అతను మొత్తం 21 టెస్టుల్లో వికెట్ కీపింగ్‌ చేసాడు. 35 క్యాచ్‌లు, 16 స్టంపింగులు చేశాడు. ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ వాలీ గ్రౌట్, అతన్ని ప్రముఖ వికెట్ కీపర్ డాన్ టోలోన్‌తో పోల్చాడు.

రిటైరయ్యాక

[మార్చు]

ఆట జీవితం నుండి రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా అతను క్రికెట్ ఆటలో నిమగ్నమై ఉన్నాడు. ఈ దశలో, అతను ముంబై జట్టు, ఇండియా జట్ల సెలెక్టర్లలో సభ్యునిగా పనిచేశాడు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడం ఆయన ద్వారానే జరిగింది. 1980లలో, అతను జాతీయ జట్టు సెలెక్టర్‌గా నామినేట్ అయ్యాడు. 1991-92 సీజన్‌లో, అతను సెలెక్షను బోర్డు అధ్యక్షుడిగా పనిచేశాడు.

నరేన్ తమ్హానే 2002 మార్చి 19 న, 70 ఏళ్ల వయసులో, ముంబైలో కన్నుమూశాడు.

మూలాలు

[మార్చు]
  1. "About". Siddharth College of Arts, Science and Commerce. Archived from the original on 6 డిసెంబరు 2022. Retrieved 6 December 2022.
  2. "Naren Tamhane Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-28.