Jump to content

నడింపల్లి కృష్ణంరాజు

వికీపీడియా నుండి

నడింపల్లి కృష్ణంరాజు ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత. ఇతడు నవతా కృష్ణంరాజుగా ప్రసిద్ధుడు. ఇతడు తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన వన్నె చింతలపూడి గ్రామంలో ఒక సంపన్న భూస్వాముల కుటుంబంలో జన్మించాడు[1]. ఇతడు ఏలూరులో డిగ్రీ చేశాడు. హైస్కూలులో చదువుతున్నప్పుడే ఇతనికి సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడింది. ఎం.ఎన్.రాయ్, రస్సెల్ ల తాత్విక చింతనను అలవరచుకుని అభ్యుదయవాదిగా గుర్తింపు పొందాడు. ఇతడు సినిమా రంగంలో ప్రవేశించే ముందు అమలాపురంలో సిమెంట్, ఎరువులు, ముడి ఇనుము వ్యాపారం చేశాడు. కొన్నాళ్ళు విశాఖపట్టణంలో కాంట్రాక్టు వ్యాపారం చేశాడు.

సినిమా రంగం

[మార్చు]

ఇతడు మొదట 1964లో మంచి మనిషి సినిమాకు భాగస్వామిగా చిత్రరంగంలో ప్రవేశించాడు. నవతా ఆర్ట్ పిక్చర్స్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ర్‌గా ఉంటూ పలు సినిమాలు నిర్మించాడు. ఈ సంస్థ పేరు మీదుగా ఇతని పేరు నవతా కృష్ణంరాజుగా స్థిరపడిపోయింది. ఇతడు స్తోమత, దక్షత, పథకం, పద్దతీ ఉన్న నిర్మాతగా పేరుగడించాడు. అమెరికా అమ్మాయి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం వంటి చిత్రాలను తీసి అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు నవత కృష్ణంరాజు.[2] ఆయన ఇ.వి.వి.సత్యన్నారాయణను కనకాల దేవదాసు క్రింద ఓ ఇంటి భాగోతం సినిమాకు సహాయదర్శకునిగా అవకాశం ఇప్పించాడు.[3]

ఇతడు నిర్మించిన కొన్ని సినిమాల జాబితా:

మూలాలు

[మార్చు]
  1. జి.వి.జి. (3 June 1981). "నిర్మాత: ఎన్.కృష్ణంరాజు". ఆంధ్ర పత్రిక దినపత్రిక. p. 5. Retrieved 10 October 2016.[permanent dead link]
  2. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నిర్మాతలు[permanent dead link]
  3. ఇ.వి.వి.సత్యనారాయణ on April 8, 2015[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]