నగునూరు కోట
నగునూరు కోట తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, కరీంనగర్ గ్రామీణ మండలం లోని నగునూరు గ్రామంలో ఉన్న కోట. కరీంనగర్‌కు ఉత్తరాన 8 కి.మీ. దూరంలో ఉన్న ఈ కోటను కాకతీయులు నిర్మించారు.[1]
చరిత్ర
[మార్చు]400 దేవాలయాలతో కూడిన ఈ కోట శతాబ్దాలపాటు వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, బహమనీయులు, కుతుబ్‌షాహీలు, మొగలాయిలు, నిజాం వంటి రాజుల పరిపాలన కాలంలో వైభవాన్ని చవిచూసింది. పండరాజు, 1159లో దొమ్మరాజు, కాకతి రుద్రదేవుడు నుగునూరును పాలించారు.[2]
నిర్మాణం
[మార్చు]కోట చుట్టూ శతృదుర్భేద్యంగా నిర్మించిన రాతిగోడ, మట్టిగోడ, కందకం, బురుజులు, ఇతర కట్టడాలు ఉన్నాయి.కాకతి రుద్రదేవుని మంత్రి నగునూరు పాలకుడు వెల్లకి గంగాధరుడు 12–13 శతాబ్ధాల మధ్య కాలంలో నగునూరులో త్రికూట దేవాలయాన్ని కట్టించినట్లు కరీంనగర్ కలెక్టర్ బంగ్లాలో ఉన్న శాసనాన్ని బట్టి తెలుస్తోంది. ఈ శివాలయంలో మరో మూడు విగ్రహాలున్నాయి. శివాలయ ప్రధాన ప్రవేశ ద్వారం ఉత్తర దిశలో వుండి, మిగతా మూడు ప్రవేశ ద్వారాలు ఒకదానితో మరొకటి ఎదురుగా ఉన్నాయి. ఈ గర్భాలయంలోకి సూర్య కిరణాలు నేరుగా పడేవిధంగా మందిర నిర్మాణం జరిగింది.
శివాలయం చుట్టూ వుండే స్తంభాలు, ఆలయంపై శిలా విగ్రహాలు చెక్కబడ్డాయి. శిలను తొలిచబడి రాతి శిల్పాలుగా మలచబడ్డాయి.[3]
ఇతర వివరాలు
[మార్చు]- నగనూరులో లభించిన సా.శ. 946నాటి శిలాశాసనం కరీంనగర్ మ్యూజియంలో భద్రపరిచబడింది.
- ఈ కోటలో సాలేశ్వర, గణపతీశ్వర, సకలేశ్వర, రామనాథ, వైష్ణవ, రామలింగాది అనేక దేవాలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి.
- అనేక శిల్పకళా నైపుణ్యంతో కూడిన ఈ కోట మొగలాయిల దండయాత్రల సమయంలో ధ్వంసం చేయబడి ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Heritage Spots in Telangana :: Telangana Tourism". www.telanganatourism.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 25 ఏప్రిల్ 2019. Retrieved 10 May 2020.
Located at a distance of 8 km north-east of the Karimnagar city . . .
- ↑ తెలంగాణ మ్యాగజిన్, చరిత్ర (1 February 2017). "కోటనిండా ఆలయాలే!". www.magazine.telangana.gov.in. నాగబాల సురేష్ కుమార్. Archived from the original on 11 May 2020. Retrieved 11 May 2020.
- ↑ నవ తెలంగాణ, జరదేఖో (30 April 2019). "కనుమరుగౌతున్న నగునూరు కోట". Archived from the original on 11 మే 2020. Retrieved 11 May 2020.